హీరాబెన్ మోదీ
హీరాబెన్ మోదీ (1923 జూన్ 18 - 2022 డిసెంబరు 30) (గుజరాతి: હીરાબેન મોદી) భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి. 2022 జూన్ 18న శత వసంతంలోకి అడుగుపెట్టారు.[1]
హీరాబెన్ మోదీ | |
---|---|
జననం | వాద్‌నగర్, మెహసానా, గుజరాత్ | 1923 జూన్ 18
మరణం | 2022 డిసెంబరు 30 | (వయసు 99)
జీవిత భాగస్వామి | దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ |
పిల్లలు | ఐదుగురు కుమారులు నరేంద్ర మోదీతో కలసి, ఒక కుమార్తె వాసంతీబెన్ హస్ముఖ్‌లాల్ మోదీ |
వ్యక్తిగత జీవితం
మార్చుహీరాబెన్ మోదీ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానాలోని వాద్‌నగర్. ఆమె మోద్-ఘంచి కమ్యూనిటీ (ఓబిసి) కి చెందినది. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ తేనీరు అమ్మేవాడు. వారికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. కుమారులు సోమ మోదీ, ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారి, పంకజ్ మోదీ, గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్, అమృత్ మోదీ, రిటైర్డ్ లేత్ మెషిన్ ఆపరేటర్, ప్రహ్లాద్ మోదీ, ఒక దుకాణ యజమాని, ఆమెకు 3వ సంతానంగా నరేంద్ర మోదీ జన్మించాడు. నరేంద్ర మోదీ, భారత 14వ ప్రధానమంత్రి. అంతకు ముందు, అతను వరుసగా నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కూతురు వాసంతీబెన్ హస్ముఖ్‌లాల్ మోది.
వార్తల్లో వ్యక్తిగా
మార్చుతన భర్త మరణం తర్వాత, హీరాబెన్ మోదీ తన చిన్న కొడుకు పంకజ్ మోదీ ఇంటికి మారింది. ఆమె 2016 మేలో మొదటిసారి ఢిల్లీలోని నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్ని సందర్శించారు. ఆయన పలుమార్లు దీవెనలకై గాంధీనగర్‌లోని తన తల్లి దగ్గరికి వెళ్ళివస్తుంటారు. 2016 నవంబరులో పాత కరెన్సీ నోట్లను బ్యాన్ చేయడం (Demonetization) పై తన కుమారుడి నిర్ణయానికి మద్దతుగా ఆమె ATM క్యూలో నిలబడి అందరిని ఆకట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడికి ఓటు వేయాలని హీరాబెన్ మోదీ ప్రచారం చేయడమేకాక 99 ఏళ్ల వయసులో కూడా ఆమె ఓటు వేశారు.
చిత్రమాలిక
మార్చుమరణం
మార్చువంద ఏళ్ల హీరాబెన్ మోదీ అనారోగ్యంతో అహ్మాదాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2022 డిసెంబరు 30న కన్నుమూసింది.[2]
మూలాలు
మార్చు- ↑ "Modi: శత వసంతంలోకి హీరాబెన్.. తల్లి కాళ్లు కడిగిన ప్రధాని మోదీ". web.archive.org. 2022-06-18. Archived from the original on 2022-06-18. Retrieved 2022-06-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "PM Modi Mother Passes Away: ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్ కన్నుమూత | PM Narendra Modi mother Heeraben Modi passes away at 100 in Ahmedabad– News18 Telugu". web.archive.org. 2022-12-30. Archived from the original on 2022-12-30. Retrieved 2022-12-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)