హీరుభాయ్ ఎం.పటేల్
హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ సిఐఇ (1904 ఆగస్టు 27 - 1993 నవంబరు 30) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి సంవత్సరాల్లో అంతర్గత, జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలలో ప్రధాన పాత్ర పోషించిన ఒక భారతీయ పౌర సేవకుడు. 1977 నుండి 1979 వరకు, అతను భారత ఆర్థిక మంత్రిగా, తరువాత హోం మంత్రిగా పనిచేశాడు. అతను వల్లభ విద్యాపీఠ్ స్థాపించిన చారుతార్ విద్యా మండలం కు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ తర్వాత దానికి సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం, వల్లభ్ విద్యానగర్ అని పేరు పెట్టారు.
Hirubhai M. Patel | |
---|---|
Minister of Home Affairs | |
In office 24 January 1979 – 28 July 1979 | |
అంతకు ముందు వారు | Morarji Desai |
తరువాత వారు | Yashwant Chavan |
Minister of Finance | |
In office 24 March 1977 – 24 January 1979 | |
అంతకు ముందు వారు | Chidambaram Subramaniam |
తరువాత వారు | Charan Singh |
Defence Secretary | |
In office 7 October 1947 – 20 July 1953 | |
అంతకు ముందు వారు | G. S Bhalja |
తరువాత వారు | B. B. Ghosh |
Member of parliament, Lok Sabha for Sabarkantha | |
In office 1984–1989 | |
అంతకు ముందు వారు | Shantubhai Patel |
తరువాత వారు | Maganbhai Patel |
In office 1977–1980 | |
అంతకు ముందు వారు | Maniben Patel |
తరువాత వారు | Shantubhai Patel |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Bombay, Bombay Presidency, British India | 1904 ఆగస్టు 27
మరణం | 1993 నవంబరు 30 Vallabh Vidyanagar, Kheda, Gujarat, India | (వయసు 89)
రాజకీయ పార్టీ | Swatantra Party[1] |
సంతానం | 5; including Amrita Patel |
వృత్తి | Civil servant, politician |
Known for | National security during the Partition of India (1947) |
ప్రారంభ జీవితం, వృత్తి
మార్చుపటేల్ 1904 ఆగస్టు 27న బొంబాయి (ప్రస్తుతం ముంబై)లో బ్రిటిష్ ఇండియా పూర్వపు బొంబాయి ప్రెసిడెన్సీలో జన్మించాడు .[2] అతను 14 సంవత్సరాల వయస్సులో ఇంగ్లండ్‌కు వెళ్లేముందు, బొంబాయిలోని సెయింట్ జేవియర్స్‌లో చదివాడు.ఇంగ్లండ్‌లో అతను సెయింట్ కేథరీన్స్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ నుండి ఆర్థికశాస్త్రంలో మేజర్ పట్టభద్రుడయ్యాడు.1927 అక్టోబరులో ఇండియన్ భారత పౌర ఉద్యోగిగా చేరి [3] 1927 నుండి 1933 వరకు, అతను ఉత్తర కన్నడ జిల్లా, అహ్మద్‌నగర్‌లలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, భరూచ్ కలెక్టర్‌గా పనిచేసాడు. ఆ తర్వాత 1934లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో చేరాడు1936 మార్చిలో అతను బాంబే ప్రెసిడెన్సీలో ఆర్థిక శాఖ కార్యవర్గంలో డిప్యూటీ సెక్రటరీగా నియమితుడయ్యాడు. 1937 జూలై నుండి అతను యుద్ధం ప్రారంభమయ్యే వరకు జర్మనీలోని హాంబర్గ్‌లో భారత వాణిజ్య కమీషనర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అతను భారతదేశానికి తిరిగి వచ్చి 1940 జనవరిలో ఉపవాణిజ్య కమిషనర్‌గా చేరాడు.అదే సంవత్సరం సెప్టెంబరులో,అతను సరఫరా శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమితుడయ్యాడు.1945 నాటికి పూర్తి కార్యదర్శి స్థాయికి ఎదిగాడు.[4] పటేల్ 1946 నూతన సంవత్సర గౌరవాల జాబితాలో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (సిఐఇ)గా నియమితులయ్యాడు.
పూర్వపు ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడు, పాట్నా ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి అతని శ్రేయోభిలాషులలో ఒకడు
సివిల్ సర్వెంట్‌గా
మార్చుపటేల్ 1946లో వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హోం సెక్రటరీ అయ్యాడు.ఆ పదవిలో 1950 వరకు పనిచేశాడు. స్వాతంత్ర్యం వరకు పటేల్ పాకిస్తాన్ కాబోయే ప్రధాన మంత్రి చౌదరి ముహమ్మద్ అలీ వాల్టర్ జాన్ క్రిస్టీతో కలిసి కీలకమైన పత్రం తయారీ, అమలులో విభజన పరిపాలనా పరిణామాలు .
1947లో భారత విభజన తర్వాత భారీ హింస చెలరేగిన రోజుల్లో ఢిల్లీని నిర్వహించే అత్యవసర కమిటీకి అతను అధిపతిగా ఉన్నాడు. నగరంలో నివసిస్తున్న ముస్లింలను కాపాడుతూ, నగరంలోకి ప్రవేశించే లక్షలాది మంది హిందూ, సిక్కు శరణార్థులకు పునరావాసం కల్పించే ప్రయత్నానికి పటేల్ నాయకత్వం వహించాడు.
పటేల్ 1947, 1953 మధ్య భారతదేశ రక్షణ కార్యదర్శిగా పనిచేసాడు. 1950లో అతను భారత సాయుధ దళాల అధికారాలను తగ్గించే బాధ్యతను స్వీకరించాడు. ఎందుకంటే బలగాలు దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చని భయపడ్డారు. అధికార యంత్రాంగాన్ని బలగాలకు, మంత్రులకు మధ్య రాయిగా నిలబెట్టడం ద్వారా పటేల్ విజయం సాధించాడు. మరోవైపు ప్రతి సంవత్సరం పార్లమెంట్‌లో రక్షణ కోసం ప్రత్యేక బడ్జెట్‌ను ఆమోదించేలా పౌర ప్రభుత్వం కోసం ఒత్తిడి చేయడం ద్వారా బలగాల నుండి ఆర్థికాన్ని వేరు చేయడంలో అతను విజయం సాధించాడు.[5] పటేల్ 1958 వరకు భారతదేశ అత్యున్నత స్థాయి పౌర ఉద్యోగులలో ఒకడుగా కొనసాగాడు.
పటేల్ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా ఉన్న సమయంలో, 1958లో హరిదాస్ ముంధ్రా కుంభకోణంపై ఆర్థిక మంత్రి టి.టి కృష్ణమాచారితో కలిసి పదవికి రాజీనామా చేసాడు.[3][6]
రాజకీయ నాయకుడిగా
మార్చుపటేల్ తొలిసారిగా 1967 లో భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికల్లో పోటీ చేసాడు. స్వతంత్ర పార్టీ నుండి పోటీ చేసిన పటేల్ ఓటర్లకు పెద్దగా తెలియని కారణంగా ఓడిపోయాడు.[7] భారత అత్యవసర స్థితిని ముగిసిన తరువాత జరిగిన 1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత, భారతదేశం మొదటి కాంగ్రెసేతర పరిపాలనకు నాయకత్వం వహించిన కొత్త ప్రధాని మొరార్జీ దేశాయ్ పటేల్‌ను ఆర్థిక మంత్రిగా నియమించాడు. అతను భారతదేశం అనేక సామ్యవాద ఆర్థిక విధానాలను మార్చాడు. విదేశీ పెట్టుబడులకు అడ్డంకులను అంతం చేశాడు.గృహ పరిశ్రమలను కాపాడుతూ సుంకాలను తగ్గించాడు. అన్ని విదేశీ కంపెనీలు తప్పనిసరిగా 50 శాతం వాటాను కలిగి ఉన్న భారతీయ కంపెనీలతో కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలనే విధానానికి అతను బాధ్యత వహించాడు. ఇది కోకా-కోలా భారతదేశం నుండి వైదొలగడానికి కారణమైంది. అయితే ఇంకా చాలా చేయవలసిన ఇతరాలు చేయలేదు.
1979లో మొరార్జీ దేశాయ్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా చరణ్ సింగ్ తిరిగి చేరినప్పుడు పటేల్ హోం మంత్రిగా నియమితులయ్యాడు.
పటేల్ తన రెండో పర్యాయం కాలంలో బోఫోర్స్ కుంభకోణంపై లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసాడు. అతను మొదట 1977, 1980 మధ్య, ఆపై 1984, 1989 మధ్య సబర్‌కాంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. వృద్ధాప్యం కారణంగా 1991 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అతను 1993 నవంబరు 30న గుజరాత్‌లోని ఖేడా (ప్రస్తుత ఆనంద్ జిల్లా) వల్లభ్ విద్యానగర్‌లోని తన నివాసంలో మరణించాడు.అతనికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె అమృతా పటేల్ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది.[8]
సాహిత్య వృత్తి
మార్చుపటేల్ రెండు పుస్తకాలు రాశారు: రైట్స్ ఆఫ్ పాసేజ్: ఎ సివిల్ సర్వెంట్ రిమెంబర్స్, ది ఫస్ట్ ఫ్లష్ ఆఫ్ ఫ్రీడమ్: రికలెక్షన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ .[9] అతను కె.ఎం.మున్షీ రాసిన కొన్ని పుస్తకాలను గుజరాతీ నుండి ఆంగ్లంలోకి అనువదించాడు.[10]
అతను భారతీయ పౌర సేవల నుండి పదవీ విరమణ చేసిన తర్వాత సుమతి మొరార్జీ షిప్పింగ్ కంపెనీకి సీనియర్ ర్యాంకింగ్ కార్యకర్తగా వ్యవహరించాడు
మూలాలు
మార్చు- ↑ "Rajmohan Gandhi on C Rajagopalachari and the birth of the Swatantra Party". Rediff.com. Retrieved 1 November 2018.
- ↑ Vittal, Gita (2007). "Heerjibhai Muljibhai Patel". Reflections: Experiences of a Bureaucrat's Wife (in ఇంగ్లీష్). Academic Foundation. p. 60. ISBN 9788171884711. Retrieved 1 November 2018.
- ↑ 3.0 3.1 "HM Patel, a multi-faceted visionary with grit". The Times of India. 26 August 2004. Retrieved 1 November 2018.
- ↑ The India Office and Burma Office List: 1945. Harrison & Sons, Ltd. 1945. p. 296.
- ↑ "The Rediff Interview: Rear Admiral (retired) K R Menon on the navy chief's dismissal". Rediff.com. 2 January 1999. Retrieved 1 November 2018.
- ↑ Rao, S. L. (24 March 2016). "The exponential rise of corruption". The Hindu Business Line (in ఇంగ్లీష్). Retrieved 1 November 2018.
- ↑ Chowdhury, Javid (2012). The Insider's View: Memoirs of a Public Servant (in ఇంగ్లీష్). Penguin UK. ISBN 9788184757224. Retrieved 1 November 2018.
- ↑ "H.M.Patel dead". The Indian Express. 1 December 1993.
- ↑ "Ringside view of history". The Hindu. 28 June 2005. Retrieved 1 November 2018.
- ↑ vyas, Rajani (2012). Gujaratni Asmita (5th ed.). Ahmedabad: Akshara Publication. p. ૩૧૨.