హుగ్లీ జిల్లా

వెస్ట్ బెంగాల్ లోని జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో హుగ్లీ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో ప్రవహిస్తున్న హుగ్లీ నది కారణంగా జిల్లకు ఈ పేరు వచ్చింది. జిల్లాకేంద్రంగా హుగ్లీ-చింసురా ఉంది. జిల్లా 4 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది: హుగ్లీ-చింసురా (చింసురా సాదర్), చందన్నగర్, సెరాంపోర్, అరంబాగ్. ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.

Hooghly జిల్లా
হুগলী জেলা
West Bengal పటంలో Hooghly జిల్లా స్థానం
West Bengal పటంలో Hooghly జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుBurdwan
ముఖ్య పట్టణంChinsura
Government
 • లోకసభ నియోజకవర్గాలుArambagh (with 1 assembly segment in Paschim Medinipur), Hooghly, Sreerampur (with 2 assembly segments in Howrah district)
 • శాసనసభ నియోజకవర్గాలుUttarpara, Sreerampur, Champdani, Singur, Chandannagar, Chunchura, Balagarh, Pandua, Saptagram, Chanditala, Jangipara, Haripal, Dhanekhali, Tarakeswar, Pursurah, Arambag, Goghat, Khanakul
Area
 • మొత్తం3,149 km2 (1,216 sq mi)
Population
 (2011)
 • మొత్తం55,20,389
 • Density1,800/km2 (4,500/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత82.55 %
 • లింగ నిష్పత్తి958
ప్రధాన రహదార్లుNH 2, NH 6, Grand Trunk Road
సగటు వార్షిక వర్షపాతం1,500 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర మార్చు

 
హుగ్లి నదిలో స్నానం చేస్తున్న భక్తులు. హౌరా బ్రిడ్జి వద్ద

హుగ్లీ నది పశ్చిమ తీరంలో ఉన్నందున ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఇది కొలకత్తాకు 40కి.మీ దూరంలో ఉంది. 15వ శతాబ్దంలో ఈ పట్టణం నదీతీర రేవుపట్టణంగా ఉంది. ఈ జిల్లాకు వేలాది సంవత్సరాల ముందు ఉన్న గ్రేట్ బెంగాల్ సామ్రాజ్యానికి చెందిన సంప్రదాయ చరిత్ర ఉంది.

పోర్చుగీసు వారి ప్రవేశం మార్చు

ఈ ప్రాంతానికి వచ్చిన మొదటి యురేపియన్ నావికుడు వాస్కోడిగామా. 1536లో పోర్చుగీసు వ్యాపారులు సుల్తాన్ మొహమ్మద్ షాహ్ వద్ద ఈ ప్రాంతంలో వ్యాపారం చేయడానికి అనుమతిని పొందారు. పురాతన కాలంలో హుగ్లీ నదీప్రవాహాలు ప్రధాన వస్తురవాణా మార్గాలుగా సహకరించాయి. కొన్ని దశాబ్ధాలుగా పశ్చిమబెంగాలులో హుగ్లీ వాణిజ్యపరంగా ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. అలాగే ప్రధాన రేవుపట్టణంగా కూడా అభివృద్ధి చెందింది. 1579-80లో అక్బర్ చక్రవర్తి పోర్చుగీసు కేప్టన్‌కు బెంగాలులో ఒక పట్టణం నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. 1599లో పోర్చుగీసు వ్యాపారులు బండేల్ వద్ద ఒక కాంవెంట్, చర్చి స్థాపించారు. ప్రద్తుతం బండేల్ చర్చి అనబడే ఇది బెంగాలులోని మొదటి చర్చిగా గుర్తింపు పొందింది.

యురేపియన్ల ప్రవేశం మార్చు

అయినప్పటికీ పోర్చుగీసు వారు వారి ఆధికారాన్ని దురుపయోగ పరుస్తూ, బానిస వ్యాపారం, దోపిడీ, మతమార్పిడికి ఉపయోగించుకున్నారు. తరువాత క్రమంగా వారు మొగలు సామ్రాజ్యానికి పన్నులు చెల్లించడం మానుకున్నారు. ఫలితంగా షాజహాన్ బెంగాల్ ప్రతినిధికి ఖాసింఖాన్ జువాయ్నికి హుగ్లీ అధికారాన్ని రద్దుచేయాలని ఆదేశం జారీ చేసాడు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పోర్చుగీసు వారికి విజయం లభించింది.హుగ్లీలో ప్రవేశించిన యురేపియన్ శక్తులలో డచ్, డెన్మార్క్, బ్రిటన్, ఫ్రెంచ్,బెల్జియం, జర్మనీ మొదలైన వారు ప్రధానులు. డచ్ వ్యాపారులు వారి కార్యక్రమాలకు హుగ్లీ (చుచురాను) కేంద్రంగా చేసుకున్నారు. ఇది హుగ్లీకి దక్షిణంగా ఉంది. ఫ్రెంచ్ వారు చందన్నగర్‌ను తమ వాణిజ్య స్థావరంగా మార్చుకున్నారు. అలాగే నగరన్ని తమ ఆధీనంలోకి (1816-1950) తీసుకున్నారు. డెన్మార్క్ వారు తమ స్థావరాన్ని శ్రీరాంపూర్‌లో ఏర్పరచుకున్నారు. ఈ నగరాలన్నీ హుగ్లీ నదికి పశ్చిమ తీరంలో ఉన్నాయి. ఇవి అన్నీ రేవుపట్టణాలుగా ఉన్నాయి. క్రమంగా యురేపియన్ శక్తులలో బ్రిటన్ శక్తివంతమైనదిగా మారింది.

బ్రిటన్ ప్రాబల్యం మార్చు

ఆరంభంలో బ్రిటన్ తమ స్థవరాన్ని ఇతర యురేపియన్ల వలె హుగ్లీ, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పరచుకున్నారు. అయినప్పటికీ 1690లో జాబ్ చర్నాక్ బ్రిటన్ స్థావరాన్ని హుగ్లీ-చింసురా నుండి కోల్‌కాతాకు మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం సురక్షిత ప్రదేశం, బంగాళాఖాతం సమీపంలో ఉండడం. ఫలితంగా బెంగాల్ వాణిజ్యకేంద్రం హుగ్లీ నుండి కొలకత్తాకు మారింది. ఫలితంతా హుగ్లీ తన వాణిజ్య ముఖ్యత్వ వైభవాన్ని కోల్పోయింది. " బాటిల్ ఆఫ్ బక్సర్ " తరువాత ఈ ప్రాంతం తమ పూర్తిగా బ్రిటిష్ ఆధీనం లోకి మారింది.1947లో భారతదేశానికి స్వతంత్రం లభించే వరకు ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ప్రాంతం పశ్చిమ బెంగాల్‌లో కలుపబడింది.

హుగ్లీ నగరం మార్చు

హుగ్లీ నగరం 500 సంవత్సరాల పురాతనమైనది. హుగ్లీ పట్టణం కేంద్రంగా జిల్లా 1795లో రూపొందించబడింది. తరువాత జిల్లాకేంద్రం హుగ్లీ చురచురాకు మార్చబడింది. 1843లో హుగ్లీ జిల్లాలోని దక్షిణ ప్రాంతాన్నీ హౌరా జిల్లాగా రూపొందించారు. 1872లో హుగ్లీ వాయవ్య ప్రాంతాన్ని మెదీనాపూర్ జిల్లాలో మిశ్రితం చేయబడింది. ఈ ప్రాంతానికి చివరి మార్పు 1966లో జరిగింది. జీల్లాలో అంత్పుర్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.

సింగూర్ టాటా నానో వివాదం మార్చు

భౌగోళికం మార్చు

జిల్లా చాలావరకు చదునైన భూభాం కలిగి ఉంది. జిల్లాలో భూభాగ వ్యత్యాసం 200 మీ ఎత్తు మాత్రమే ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో హుగ్లీనది, బంకురా, దక్షిణ సరిహద్దులో హౌరా, ఉత్తర సరిహద్దులో బర్ధామన్, వాయవ్య సరిహద్దులో మేదినీపూర్ జిల్లాలు ఉన్నాయి.

ఆర్ధికం మార్చు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలలో హుగ్లీ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానంగా జనపనార పంట, జనపనార పరిశ్రమ, జనపనార వర్తకాలకు కేంద్రంగా ఉంది. జిల్లాలో పారిశ్రామిక సమూహాలు (ఇండస్ట్రియల్ కాంప్లెక్స్) లు ఉన్నాయి. ఉత్తరపరాలో దేశంలో అతిపెద్ద కార్లతయారీ సంస్థ అయిన " హిందూస్థాన్ మోటర్స్ " ప్లాంటు ఉంది. హుగ్లీ నదీతీరంలో ఉన్న త్రిబేనీ, భద్రేశ్వర్, చంపాదని, శ్రీరాంపూర్ వద్ద జనపనార పలు పరిశ్రమలు ఉన్నాయి.

విభాగాలు మార్చు

ఉపవిభాగాలు మార్చు

 • హుగ్లీ జిల్లా 4 ఉపవిభాగాలుగా విభజించబడింది: -చింసురా, చందన్నగోర్, శ్రీరాంపూర్, అరంబాగ్లో:
 • జిల్లాను నాలుగు ఉపవిభాగాలున్నాయి వుంటారు ; మోగ్రా, ధానియఖాలి, పన్దుయా, పొల్బ, దాద్పూర్ (బాలాఘర్), చింసురా.
 • చింసురా ఉపవిభాగం రెండు మున్సిపాలిటీలు (హుగ్లి- చుచురా, బంస్బెరియా), 5 కమ్యూనిటీ అభివృద్ధి కూటములు ఉన్నాయి.
 • చందన్నగోర్ ఉపవిభాగం:- చందన్నగర్ మునిసిపల్ కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు (భద్రేశ్వర్ ( హుగ్లీ ), చంపదని, తారకేశ్వర్), మూడు సమాజ వికాస అభివృద్ధి కూటముల: హరిపాల్, సింగూర్, తారకేశ్వర్.
 • శ్రీరాం పూర్ ఉపవిభాగం:- 6 మున్సిపాలిటీలు (సెరంపోర్, ఉత్తరపరా కోట్రంగ్, దంకుని, కొన్నగర్, రిష్ర, బైద్యబతి ), నాలుగు కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్ ఉన్నాయి: చందితల-1, చందితల-2, జంగిపర, శ్రీరాంపూర్, ఉత్తరపరా.
 • అరంబాగ్లో ఉపవిభాగం అరంబాగ్ పురపాలక, ఆరు కమ్యూనిటి అభివృద్ధి బ్లాక్స్ ఉన్నాయి: అరంబాగ్, ఖనాకుల్ -1, ఖనాకుల్-2, గోఘాట్-1, గోఘాట్-2,, పుర్సుర.[1]
 • హుగ్లీ- చుచురా జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లాలో మొత్తంగా 23 పోలీస్ స్టేషన్లు, 18 డెవెలెప్మెంటు బ్లాకులు, 12 పురపాలకాలు, 210 గ్రామపంచాయితీలు, [1][2]

చింసురా ఉపవిభాగం మార్చు

 • రెండు మున్సిపాలిటీలు: హుగ్లీ-చుచురా, బంస్బెరియా బధగచ్చి: గ్రామ పంచాయితీల ఒక జనాభా గణన పట్టణం;
 • బాలాగర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 13 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • చింసురా మోగ్రా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 10 గ్రామ పంచాయితీలు కలిగిన గ్రామీణ ప్రాంతాలున్నాయి: 9 పట్టణాలు: కొడాలియా, రఘునాథ్ ( మాగ్రా), మధుసూధంపూర్ , అమోద్ఘట, షంకరనగర్, చక్ బంస్బెరియా, కులిహండా, సిమ్లా ( వెస్ట్ బెంగాల్) , ధర్మపూర్ (భారతదేశం), సప్తగ్రాం, మోగ్రా.
 • ధానియఖాలి కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 18 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
 • పన్దుయా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక:- 16 గ్రామ పంచాయితీలతో గ్రామీణ ప్రాంతాలు, ఒక పట్టణం: పన్దుయా ( హుగ్లీ),పొల్బా.
 • దాద్పూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 12 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.

చందన్నగోర్ ఉపవిభాగం మార్చు

 • చందన్నగోర్ మునిసిపల్ కార్పొరేషన:-
 • మూడు మున్సిపాలిటీలు: భద్రేశ్వర్( హుగ్లీ ) , చంపదాని , తారకేశ్వర్.
 • హరిపాల్ కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్:- 15 గ్రామ పంచాయితీలతో గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది. ఒక పట్టణం; సింగూర్
 • సింగూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 16 గ్రామ పంచాయతీలతో గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • తారకేశ్వర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 10 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంటుంది.

సెరంపోర్ ఉపవిభాగం మార్చు

 • ఆరు మున్సిపాలిటీలు: సెరంపోర్, ఉత్తర్పర కొట్తంగ్ , కొన్నాగర్, రిష్ర, దంకుని , బైద్యనాథ్.
 • చందితల-1 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- అంటే 9 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది. (అనియా, భబతిపూర్, గంగాధర్పూర్, హరిపూర్, క్రిష్ణరాంపూర్,

కుమిర్మొరా, మాషత్, నవాబ్పూర్, షీకలా.

 • చందితల -2 కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్:- 11 గ్రామ పంచాయిలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు , 10 సెన్సస్ పట్టణాల ఉన్నాయి: బేగంపూర్ (భారతదేశం), ఖర్సరై, పూర్భా తాజ్పూర్, చిక్రండ్, పైరగచ్చ, మనోహరపూర్, బరిఝతి, గరళగచ్చ, క్రిష్ణపూర్ ( చందితల) , మ్రిగల.
 • జంగిపరా కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్:- 10 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • శ్రీరాంపూర్- ఉత్తరపరా (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్:- 6 గ్రామ పంచాయితీలతో కూడిన 6 పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి: రఘునాథ్ (దంకుని ),

దక్షిణ రాజ్యధర్పూర్, బమునగరి, బమునగరి, రిష్ర, నబగ్రాం , కనజ్పూర్.

అరంబాగ్లో ఉపవిభాగం మార్చు

 • ఒకటి మున్సిపాలిటీ: అరంబాగ్. గ్రామ పంచాయతీల.
 • అరంబాగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ మాత్రమే 15 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • ఖనకుల్ గ్రామ పంచాయితీలు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ 13 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • ఖనకుల్ గ్రామ పంచాయితీలు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ 11 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • గోఘత్ 1 గ్రామ పంచాయితీలు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ 8 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • గోఘాత్ 2 గ్రామ పంచాయితీలు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ 9 గ్రామీణ ప్రాంతాలను కలిగి ఉంది.
 • పుర్సురాహ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ కేవలం 8 గ్రామీణ ప్రాంతాలు , గ్రామ పంచాయితీలు.

అసెంబ్లీ నియోజకవర్గాలు మార్చు

హుగ్లీ జిల్లా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:-[4]

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు మార్చు

 • షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- బలాగర్, ధానియఖాలి, ఖానాకుల్ , గోఘట్ . హౌరా జిల్లా నుండి 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి.
 • సెరంపోర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి జంగిపరా, చందితలా, ఉత్తరపరా, సెరంపోర్ , చంపదాని అసెంబ్లీ నియోజకవర్గాలు.
 • హూగ్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి చద్రన్నగోర్, సింగూర్, హరిపాల్, చింసురా, బంస్బెరియా, పొల్బా , ధాన్యఖాలి.
 • అరంబగ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తారకేశ్వర్, పుర్సురా, ఖాంఖుల్, అరంబాగ్ , గోఘట్. పశ్చిమ మదినాపూర్ జిల్లా నుండి 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.
 • కత్వా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బాలాఘర్ , పదుయా , బర్ధామన్ జిల్లా నుండి 2 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.

నియోజకవర్గాల పునర్విభజన తరువాత మార్చు

పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం హుగ్లీ జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 18 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది.[5]

 1. ఉత్తరపర (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 185),
 2. శ్రీరాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 186),
 3. చన్ంపదాని (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 187),
 4. సింగూర్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 188),
 5. చందననగర్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 189),
 6. చుంచురా (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 190),
 7. బాలఘర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 191),
 8. పన్దు.ఎ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 192),
 9. సప్రగ్రాం (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 193),
 10. చందితల (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 194),
 11. జంగీపారా (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 195),
 12. హరిపాల్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 196),
 13. ధనేకలి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 197),
 14. తారకేశ్వర్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 198),
 15. పుర్సురహ్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 199),
 16. అరంబగ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 200.),
 17. గోఘత్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 201) ,
 18. ఖనకుల్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 202.).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు మార్చు

 • షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- బలాగర్,ధనేకలి, అరంబాగ్ , గోఘాత్, హౌరా జిల్లా నుండి 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి.
 • శ్రీరీరాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఉత్తరపరా, శ్రీరాంపూర్, చంపదాని, చందితల , జంగిపరా .
 • హుగ్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి సింగూర్, చందన్నగర్, చుంచురా, బాలాగర్, పదుయా, సప్తగ్రాం , ధనేకాలి.
 • అరంబాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి హరిపాల్, తారకేశ్వర్, పుర్సురా, అరంబాగ్, గోహత్ , ఖాంకుల్ , పశ్చిమ మెదీనీపూర్ జిల్లా నుండి 1 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.

పోలీస్ స్టేషను మార్చు

హుగ్లీ జిల్లా బర్ద్వాన్ పోలీస్ రేజ్‌లోకి చేరుతుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ జిల్లా పోలీస్ చీఫ్‌గా ఉంటాడు. 23 పోలీస్ స్టేషన్లు పనిచేయడానికి డిస్ట్రిక్ ఇంటెలిజంస్ బ్రాంచ్, డిస్ట్రిక్ ఎంఫోర్చ్మెంటు శాఖ , డిస్ట్రిక్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 3 అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ అధికారుల సాయంతో సహకరిస్తుంది.

ప్రయాణసౌకర్యాలు మార్చు

రైలు మార్చు

జిల్లాలో సబర్బన్ రైల్వే చక్కగా అభివృద్ధిచేయబడి ఉంది.

 • జిల్లాకు రైల్వే హెడ్ క్వార్టర్‌గా బండేల్ జంక్షన్ ఉంది. జిల్లాలో బండేల్ జంక్షన్ అతిపెద్ద , అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను‌గా గుర్తింపు పొందింది. దేశంలోని ప్రధాన రైలు జంఖన్లలో ఇది ఒకటిగా కూడా గుర్తినబడుతుంది.
 • బందెల్
 • దంకుని
 • కామర్‌కుండ్
 • సియోరాఫులి
 • హౌరా రైల్వే స్టేషను హెరిటేజ్ స్టేషను‌గా గుర్తించబడుతుంది. జిల్లా రైల్వే విభాగం హౌరా విభాగానికి చెందింది. ఇక్కడి నుండి తూర్పు రైల్వేకు చెందినది తొలి రైలు హుగ్లీ , హౌరా మద్య ప్రయాణించింది.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 5,520,389,[6]
ఇది దాదాపు. డెన్మార్క్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. విస్కాంసిన్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 16వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 1763 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.49%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 958:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.55%.[6]
జాతియ సరాసరి (72%) కంటే.

విద్య మార్చు

 
చందర్‌నగర్ గవర్నమెంట్ కళాశాల
 
బాండెల్ బాసిలికా

హుగ్లీ జిల్లాలో జిల్లాలో 2992 ప్రాథమిక పాఠశాలలు, 408 హైస్కూల్స్, 127 హైయ్యర్ సెకండరీ స్కూల్స్, 22 కాలేజీలు, 6 టెక్నికల్ ఇంస్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలు:-

 • హుగ్లీ మొహసిన్ కాలేజ్
 • చందనాగోర్ కాలేజ్
 • హుగ్లీ కాలేజియేట్ స్కూల్
 • హుగ్లీ గౌర్హరి హరిజనుడికి విద్యామందిర్
 • చత్రా నందలాల్ ఇన్స్టిట్యూషన్
 • డఫ్ హై స్కూల్
 • డాన్ బాస్కో స్కూల్
 • బందెల్
 • సహాయ కేంద్రం కాన్వెంట్ స్కూల్
 • హుగ్లీ బ్రాంచ్ స్కూల్
 • హుగ్లీ బినొదిని గర్ల్స్ హై స్కూల్
 • గొస్వామి మలిపర హై స్కూల్
 • ద్వార్బసిని కుమార్ రాజేంద్ర హై స్కూల్
 • దుర్గాపూర్ ప్రైమరీ స్కూల్
 • దుముపూర్ ప్రైమరీ స్కూల్
 • మహేష్ హై స్కూల్

పర్యాటక ఆకర్షణలు మార్చు

 • బండేల్ నగరం బండేల్ చర్చికి ప్రసిద్ధం. శరత్‌చంద్ర చటోపాద్యాయకు ఇది జన్మస్థలం.
 • తారకేశ్వర్ యాత్రాస్థలంగా పేఖ్యాతి చెందినది. అంతేకాక పశ్చిమ బెంగాల్ శైవసంప్రదాయానికి ఇది ప్రధాన కేంద్రగా ఉంది.
 • చందన్నగర్ ఇది హుగ్లీలో ప్రముఖమైనది, అనదమైనదిగా గుర్తించబడుతుంది. ఇక్కడ జగద్ధాత్రి పూజ, విద్య్ద్దిపాలంకరణకు ప్రసిద్ధిచెందినది.
 • జిల్లా ప్రధాన కేంద్రంగా చింసురా పట్టణం ఉంది. అంతేకాక ఇది చారిత్రాత్మక పట్టణంగా ఉంది. చింసురాలో " బకిన్‌చంద్ర చఠోపాద్యాయ " దేశీయగీతానికి సంగీతం సమకూర్చాడు.
 • జోర్ఘాట్, మండలం బరి వద్ద ఉన్న డచ్ రాజభవనం (మొండల్ బరి) ప్రస్తుతం మొండల్ రాజకుంటీబీకులు ఆధీనంలో ఉంది. ఇక్కడ ముఖద్వారంలో అద్భుతమైన అలంకరణ చేయబడిన ద్వారం, ద్వారానికి ఇరువైపులా ఆకర్షణీయమైన డచ్ సింహాలూ ఉన్నాయి. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన డచ్ భవనం ప్రధాన భాగం టౌంగార్డ్ రోడ్డు వద్ద ఉంది.

ఇక్కడ ఒకప్పుడు జాతీయ కాంగ్రెస్ నేతలు సభలు, సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ భాగం ప్రద్తుతం పడగొట్టబడి భవననిర్మాణదారుల ఆధీనంలోకి మారింది. వెనుక ఉన్న జార్ఘాట్ మోండల్ హౌస్ డచ్ ఙారకచిహ్నంగా మిగిలి ఉంది. వారసత్వం వంశావళి బలహీనంగా ఉన్నందున ఈ చారిత్రాత్మక భవనానికి సత్వర రక్షణ, వారసత్వ సంపదగా గుర్తింపు అవసరమని భావించబడుతుంది.

 • " కంపర్పుకర్ " శ్రీశ్రీ రామకృష్ణదేవ్ జన్మస్థలం ఇదే.
 • " మహేష్- సెరంపోర్ " రథయాత్ర పూరీ రథయాత్ర తరువాత పురాతన రథయాత్రలలో ఒకటిగా భావించబడుతుంది.

గ్యాలరీ మార్చు

ఇవి కూడ చూడండి మార్చు

బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ

బ్రజేంద్ర నాథ్ సీల్

మూలాలు మార్చు

 1. 1.0 1.1 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-12-04.
 2. 2.0 2.1 "Municipal General Election 2005: Hooghly District". Official website of Hooghly district. Retrieved 2008-12-13.
 3. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-12-04.
 4. "General election to the Legislative Assembly, 2001–List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-11-19.
 5. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2008-11-19.
 6. 6.0 6.1 6.2 6.3 6.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Denmark 5,529,888 July 2011 est.
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Wisconsin 5,686,986

వెలుపలి లింకులు మార్చు