హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్

రాయదుర్గం నుండి ఎయిర్‌పోర్టు మెట్రో మార్టం

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ లేదా కారిడార్ IV అనేది రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న హైదరాబాద్ మెట్రో లైన్. ఈ లైను మొత్తం పొడవు 31 కి.మీ. [1]

  హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్
అవలోకనం
రకము (పద్ధతి)ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు
వ్యవస్థర్యాపిడ్ ట్రాన్సిట్
స్థితినిర్మాణంలో ఉంది
లొకేల్హైదరాబాదు
చివరిస్థానంరాయదుర్గం మెట్రో స్టేషను
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
స్టేషన్లు10
ఆపరేషన్
యజమానిహైదరాబాదు మెట్రో
నిర్వాహకులుహైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML)
పాత్రభూమార్గం, భూగర్భ మార్గం, పైదారి
సాంకేతికం
లైన్ పొడవు31 km (19 mi)
ట్రాక్ గేజ్1,435 mm (4 ft 8+12 in) standard gauge

చరిత్ర మార్చు

2018 మార్చి 26 న, హైదరాబాద్ మెట్రోను విమానాశ్రయం వరకు పొడిగించడానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) అనే ప్రత్యేక కంపెనీని స్థాపించింది. [2] [3] HMRL మేనేజింగ్ డైరెక్టర్ నల్లమిల్లి వెంకటసత్యనారాయణ రెడ్డిని HAMLకి కూడా మేనేజింగ్ డైరెక్టరుగా నియమించింది. ఈ సంస్థను HMRL, HMDA లు సంయుక్తంగా ప్రమోట్ చేసాయి. 2019 ఆగస్టులో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు రహేజా మైండ్‌స్పేస్ నుండి శంషాబాద్ RGI విమానాశ్రయం వరకు హైదరాబాద్ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పాడు. [4] రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి శంషాబాద్ RGI విమానాశ్రయానికి అలైన్‌మెంట్ గచ్చిబౌలి ORR ప్రవేశ ద్వారం బదులుగా డైమండ్ హిల్స్ మీదుగా కొత్త ఖాజాగూడ లింక్ రోడ్ (కేర్ హాస్పిటల్స్ పక్కన) గుండా ఉంటుంది. 2021-2022 రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కోసం 1,000 కోట్లు కేటాయించింది. [5] [6] 2021 సెప్టెంబరులో, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIA) నిర్వహిస్తున్న GMR గ్రూప్, విమానాశ్రయంలో మెట్రో కనెక్టివిటీ కోసం 519.52 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. [7] [8]

2022-2023 రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైలు (HMR)కి 2,377.35 కోట్లు కేటాయించింది. ఇందులో భూసేకరణ, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు, ఇతర అభివృద్ధి పనుల కోసం 1,500 [9] కోట్లు, ఎయిర్‌పోర్ట్ మెట్రో కనెక్టివిటీ కోసం 377.35 కోట్లు, పాత నగరం (కారిడార్ II- గ్రీన్ లైన్ పనులు MGBS నుండి ఫలక్‌నుమా వరకు; 5.5 కి.మీ) మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు కేటాయించింది. [10] [11] 31 కి.మీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్లో 27 కి.మీ పైదారి, 1 కి.మీ భూదారి, 2.5 కి.మీ భూగర్భ మార్గాలు ఉండేలా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కి కనెక్ట్ చేయాలని ప్రతిపాదించారు. [12] విమానాశ్రయ మార్గంలో 9 ఎలివేటెడ్ స్టేషన్లు, ఒక భూగర్భ స్టేషన్ ఉంటుంది. [13] రాయదుర్గ్ మెట్రో టెర్మినల్ స్టేషన్ నుండి బయలుదేరిన ఈ మార్గం, ఖాజాగూడ జంక్షన్ గుండా వెళ్ళి, నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌ను తాకి, ORR వెంట శంషాబాద్ విమానాశ్రయానికి ప్రస్తుతం ఉన్న ప్రత్యేక మెట్రో రైల్ రైట్ ఆఫ్ వే గుండా వెళుతుంది. [14] తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2022 డిసెంబరు 9 న హైదరాబాద్ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌కు శంకుస్థాపన చేశాడు. [15] దీన్ని సుమారు 6,250 crore (US$780 million) వ్యయంతో నిర్మిస్తారు. [16] హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రాజెక్టు. 2025 చివరి నాటికి దీన్ని పూర్తి చెయ్యాలని తలపెట్టారు.

స్టేషన్లు మార్చు

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్
# స్టేషన్ పేరు Opened Connections Alignment
ఆంగ్ల భాష తెలుగు
1 Raidurg రాయదుర్గ్ Yet to start construction Airport Shuttle
%1 లైన్
Elevated
2 Biodiversity Junction జీవవైవిధ్య జంక్షన్ None Elevated
3 Khajaguda ఖాజాగూడ None Elevated
4 Nanakramguda Junction నానక్రంగూడ జంక్షన్ None Elevated
5 Narsingi నార్సింగి None Elevated
6 TS Police Academy టి ఎస్ పోలీస్ అకాడమీ None Elevated
7 Rajendranagar/Satamrai రాజేంద్రనగర్ / సతామ్రాయి None Elevated
8 Shamshabad శంషాబాద్ None Elevated
9 Airport Cargo ఎయిర్పోర్ట్ కార్గో None At-grade
10 RGIA Terminal ఆర్ జి ఐ ఎ టెర్మినల్ None Underground

చెక్-ఇన్ సౌకర్యం మార్చు

విమాన ప్రయాణీకులు రాయ్‌దుర్గం మెట్రో స్టేషన్‌లోనే చెక్-ఇన్ చేసి తమ బ్యాగేజీని అప్పగించేసి, నేరుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్‌లను చేరుకోవచ్చు. [17]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Airport Express Metro to be elevated with 2.5-km underground stretch near RGIA".
  2. "Metro Rail to airport may not take off".
  3. "Govt's 'open offer' to private firms for Airport Metro".
  4. "Work on Airport Express metro to begin soon: KTR | Hyderabad News". The Times of India.
  5. "Telangana Budget: No allocation for GHMC, HMDA". 18 March 2021.
  6. "Telangana: ₹1000 crore allocated for Hyderabad Metro Rail in ₹2.30 lakh crore budget 2021-22".
  7. "GHIAL to invest Rs 500 crore for metro connectivity at Hyderabad airport". The Times of India.
  8. "GMR to invest over Rs 500 crore in Hyderabad Airport metro link project". The Economic Times.
  9. "Hyderabad: Telangana govt allocates funds for metro connectivity to old city, airport".
  10. Geetanath, V. (7 March 2022). "Plans for metro connectivity to Hyderabad's Old City revived". The Hindu.
  11. "HMRL tops in budgetary allocation for city departments". 8 March 2022.
  12. "Hyderabad: Metro's airport service to have underground stretch | Hyderabad News". The Times of India.
  13. Geetanath, V. (2 September 2019). "Airport Metro to have underground section connecting to passenger terminal". The Hindu – via www.thehindu.com.
  14. "Telangana announces 31-km Metro line from Madhapur to airport".
  15. "KCR lays foundation stone for Hyderabad Airport Express Metro".
  16. "Airport Express Metro on track, Telangana CM K Chandrasekhar Rao to lay foundation on December 9".
  17. "Once Hyderabad Airport Metro opens, air passengers can check in at Metro station: HMRL MD".