హోజాయ్
హోజాయ్, అస్సాం రాష్ట్రంలోని హోజాయ్ జిల్లా లో ముఖ్య పట్టణం, పురపాలక సంఘం.[3] 2016, ఆగస్టు 15న జిల్లా ముఖ్య పట్టణంగా ఏర్పాటు చేయబడింది.
హోజాయ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°00′N 92°52′E / 26.0°N 92.87°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | హోజాయ్ పురపాలక సంఘం |
• శాసనసభ సభ్యుడు | శిలాదిత్య దేవ్ (బిజెపి) |
విస్తీర్ణం | |
• Total | 21.219 కి.మీ2 (8.193 సుమారు చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 36,638 |
భాష | |
• అధికారిక | అస్సామీ[2] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 782435 |
ప్రాంతపు కోడ్ | +91-3674 |
Vehicle registration | ఏఎస్ 31 |
పద వివరణ
మార్చుహోజాయ్ అనే పదం దిమాసా ప్రజలలోని ఒక వంశం నుండి వచ్చింది.
భౌగోళికం
మార్చుహోజాయ్ పట్టణం 26°00′N 92°52′E / 26.0°N 92.87°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[4] ఇది సముద్ర మట్టానికి 59 మీటర్ల (193 అడుగుల) ఎత్తులో ఉంది.
చరిత్ర
మార్చుమధ్యయుగ కాలంలో హోజాయ్ పట్టణం దిమాసా కచారి రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. హోజాయ్ ప్రాంతంలో నివసిస్తున్న దిమాసా కచారీలను "హోజాయ్-కచారీస్" అని పిలిచేవారు. దిమాసా తెగకు చెందిన వంశాలలో "హోజాయ్" (సెంగ్‌ఫాంగ్స్) వంశం ఒకటి. ఈ వంశం పేరుమీదుగా ఈ పట్టణానికి "హోజాయ్" పట్టణమని పేరు వచ్చింది. 1983, ఆగస్టు 15న దీనిని నాగావ్ జిల్లా ఉపవిభాగంగా చేశారు. 2016, ఆగస్టు 15న మరో 3 కొత్త జిల్లాలతో పాటు దీనిని రాష్ట్ర కొత్త జిల్లాగా ప్రకటించారు.[5]
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హోజాయ్ పట్టణంలో 36,638 జనాభా ఉంది. ఇందులో 18,762 మంది పురుషులు, 17,876 మంది మహిళలు ఉన్నారు. పట్టణ జనాభాలో 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారు 3,869 మంది ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 29,708 కాగా, మొత్తం జనాభాలో ఇది 81.1% గా ఉంది. ఇందులో పురుష అక్షరాస్యత 83.9%, స్త్రీ అక్షరాస్యత 78.1% గా ఉంది. పట్టణంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 3,158 మంది, షెడ్యూల్డ్ తెగల జనాభా 197 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హోజాయ్ పట్టణంలో 7049 గృహాలు ఉన్నాయి.[1]
భాష
మార్చుఈ పట్టణంలో 69.6% మంది బెంగాలీ, 16.0% మంది హిందీ, 10.7% మంది అస్సామీ, 1.6% మణిపురి భాషలు మాట్లాడేవారు ఉన్నారు.
మతాలు
మార్చుపట్టణ జనాభాలో 81.11% మంది హిందువులు, 18.28% మంది ముస్లీంలు ఉన్నారు. సిక్కు మతం, క్రైస్తవ మతం, ఇతర మతాల వాళ్ళు పట్టణ జనాభాలో ఒక శాతం కన్నా తక్కువ ఉన్నారు.
జిల్లా పరిపాలన
మార్చుపట్టణ డిప్యూటీ కమిషనర్ గా సద్నెక్ సింగ్, [8] పోలీసు సూపరింటెండెంట్ గా అంకుర్ జైన్[9] ఉన్నారు.
రవాణా
మార్చురోడ్డుమార్గం
మార్చుహోజాయ్ పట్టణం ద్వారా రాష్ట్ర రహదారులు, ఇతర రాష్ట్రాలకు కలుపబడుతున్నాయి. దీనికి సమీపంలో 54వ జాతీయ రహదారి ఉంది.
రైల్వేమార్గం
మార్చులమ్డింగ్ డివిజన్‌లోని గౌహతి-లమ్డింగ్ సెక్షన్ లైనులో హోజాయ్ రైల్వే స్టేషను ఉంది. ఈ స్టేషను ద్వారా భారతదేశంలోని వివిధ నగరాలకు రైల్వే సర్వీసులు ఉన్నాయి.
విమానాశ్రయం
మార్చుఈ పట్టణానికి సుమారు 120 కి.మీ దూరంలో తేజ్పూర్ విమానాశ్రయం ఉంది.
190 కి.మీ. దూరంలోని గువహాటిలో ఎల్‌జిబి[10] అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Hojai". www.censusindia.gov.in. Retrieved 23 December 2020.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 డిసెంబరు 2020.
- ↑ "Assam gets five more districts". Zee News. 15 August 2015.
- ↑ "redirect to /world/IN/03/Hojai.html". www.fallingrain.com.
- ↑ "Know about the District | Hojai District | Government Of Assam, India". hojai.assam.gov.in. Archived from the original on 2021-05-14. Retrieved 2020-12-23.
- ↑ "C-16 Population By Mother Tongue - Hojai (MB)". census.gov.in. Retrieved 23 December 2020.
- ↑ "C-16 Population By Religion - Assam". census.gov.in. Retrieved 23 December 2020.
- ↑ "Meet the Deputy Commissioner | Hojai District | Government Of Assam, India". Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 17 March 2020.
- ↑ "Ankur Jain, IPS | Hojai District | Government Of Assam, India". hojai.assam.gov.in. Archived from the original on 22 సెప్టెంబరు 2021. Retrieved 23 December 2020.
- ↑ "Guwahati Airport". aera.gov.in. Archived from the original on 21 నవంబరు 2019. Retrieved 23 December 2020.
ఇతర లంకెలు
మార్చుహోజాయ్ అధికారిక వెబ్‌సైట్ Archived 2020-09-18 at the Wayback Machine