నాగావ్ జిల్లా

అస్సాం లోని జిల్లా

అస్సాం రాష్ట్రం లోని 27 జిల్లాలలో నాగావ్ జిల్లా (అస్సామీ: নগাঁও জিলা) ఒకటి. 2011 అస్సాం రాష్ట్రం లోని అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా నాగావ్ జిల్లా గుర్తింపు పొందింది. [1] అంతేకాక నాగావ్ నగరం దేశంలోని బృహత్తర నగరాలలో ఒకటిగా గుర్తించబడ్తుంది.

నాగావ్ జిల్లా
নগাঁও জিলা
District
నాగోన్‌లోని కోలాంగ్ నది దృశ్యం
నాగోన్‌లోని కోలాంగ్ నది దృశ్యం
Location of Nagaon district in Assam
Location of Nagaon district in Assam
Country India
Stateఅసోం
Headquartersనాగావ్
Websitehttp://nagaon.nic.in/

చరిత్ర మార్చు

వైష్ణవ సంస్కర్త శంకరదేవ్ జన్మభూమి బతద్రొవ జన్మస్థలం ఇది. అస్సామీ సంఘజీవితంలో శంకరదేవా పునరుజ్జివనం కలుగజేసాడు. ఇది అస్సాం రాష్ట్రం, పూర్తి ఈశాన్య భారతంలో కూడా కేంద్రస్థానంలో ఉంది. ఈ ప్రాంతం1833 నుండి ఉనికిలో ఉంది. ఈ జిల్లా అస్సాంలోని అతి పురాతన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ జిల్లా అత్యధిక జనసాంధ్రత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. పురాతన దస్తావేజులలో ఈ ప్రాంతం " ఖగరిజన్ " అని పిలువబడింది.[2]1983లో ఈ జిల్లాలో నెల్లె మూకుమ్మడి హత్యలు జరిగాయి. ఈ సంఘటనలో దాదాపు 2,191 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1989 సెప్టెంబరు 29న నాగావ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి మారిగావ్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[3]

భౌగోళికం మార్చు

జిల్లా కేంద్రంగా నాగావ్ పట్టణం ఉంది. నాగావ్ జిల్లా వైశాల్యం 3831 చ.కి.మీ.[4] వైశాల్యపరంగా జిల్లా ఫిలిప్పైంస్ దేశంలోని బొహొల్ ద్వీపం జనసంఖ్యకు సమానం.[5]

అభయారణ్యం మార్చు

ఆర్ధికం మార్చు

హొజైలో సెంటు పరిశ్రమ అధికంగా ఉంది. ఈ పరిశ్రమలో కాపాడబడుతున్న తయారీ రహస్యాలు అస్సం రాష్ట్ర సురక్షిత రహస్యంగా గుర్తించబడుతుంది. నాగావ్ జిల్లా అస్సాం రాష్ట్ర బియ్యపు పాత్రగా గుర్తింపు పొందింది. నాగావ్ ప్రకృతి సంపద ఆర్థిక రంగానికి ఎంతగానో సహకరిస్తుంది. జిల్లా ఆర్థిక రంగానికి వ్యసాయరంగం వెన్నెముకలా సహకరిస్తుంది. 78% శాంతం ప్రజలకు ఇది ఉపాధి కల్పిస్తుంది. జిల్లా వాసులకు బియ్యం ప్రధాన ఆహారంగానూ వడ్లు ప్రధాన పంటగానూ ఉంది. వ్యవసాయరంగ అభివృద్ధికి తరచుగా సంభవించే వరదలు అడ్డుకట్ట వేస్తున్నాయి. వ్యవసాయంతో పాటు చేపల పరిశ్రమ కూడా జిల్లా ఆర్థికరంగానికి సహకారం అందిస్తుంది.

చేపల పెంపకం మార్చు

అస్సాం రాష్ట్రం అత్యధికంగా వర్షపాతం అందుకుంటుంది. మంచినీటి చేపల పెంపకంలో అస్సాం రాష్ట్రం భాగం 5.7%. రాష్ట్ర చేపల పెంపకంలో నాగావ్ జిల్లా భాగం 9%. అయినప్పటికీ జిల్లా అదనంగా చేపలు దిగుమతి చేసుకొనబడుతున్నాయి. చిన్నవి, పెద్దవిగా దాదాపు 20 నదులు, జలాశాయాలు, చెరువులు, మడుగులు ఉన్నాయి. జలవనరులు జిల్లాలో చేపల పెంపకానికి అధికంగా సహకరిస్తున్నాయి. జిల్లాలో అధికంగా మత్స్యకారులు ఉన్నారు. మత్స్యపరిశ్రమ జిల్లాలో అత్యధికులకు ఉపాధి కలిగిస్తుంది.

వ్యవసాయం మార్చు

నాగావ్ జిల్లా గత కొన్ని దశాబ్ధాలుగా ఆధునిక వ్యవసాయంలో ముందంజలో ఉంది. అయినప్పటికీ మత్స్యపరిశ్రమలో మెళకువలు అనుసరించక పోవడం కారణంగా చేపల ఉత్పత్తి తక్కువగానే ఉంది. మత్స్య పరిశ్రమ ద్వారా ఆదాయం రాను రాను తగ్గుతూ ఉంది. జిల్లాలో జంతువుల పెంపకం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అయినప్పటికీ అవసరానికి తగినంత ఉతపత్తి జరగడం లేదు. వాతావరణం కోళ్ళపెంపకానికి అనుకూలంగా ఉంటుంది. కోళ్ళ పరిశ్రమలలో అధిక శాతం చిన్నచిన్న ఫారమ్‌కలో పెంచబడుతున్నాయి. ఫౌల్ట్రీ ఆహారం కొరత మరియుఔషధాల ధరలు ఈ పరిశ్రమను బాధిస్తున్నాయి. ప్రాంతీయ ఆవుల నుండి పాల ఉత్పత్తి తక్కువగానే ఉంది. జిల్లా అవసరానికి తగినంత పౌల్ట్రీ అందించడానికి జిల్లాలో జంతువుల పెంపకానికి అవకాశం అధికంగా ఉంది.

చేనేత పరిశ్రమ మార్చు

అస్సాంలో చేనేత పరిశ్రమ అతిముఖ్యమైన పరిశ్రమలలో ఒకటి. అంతేకాక జిల్లా ఆర్థికరంగానికి ఇది చాలా సహకారం అందిస్తుంది. ఇది సాంఘిక సంస్కృతి సంప్రదాయాలు, కళలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. గ్రామీణ ప్రజలకు, కళాకారులకు చేనేత పరిశ్రమ భారీగా ఉపాధి కల్పిస్తుంది. టీ ఉత్పత్తి కూడా జిల్లా ఆర్థిక రంగంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నాగావ్ జిల్లాలో వ్యవసాయ సంబంధిత పరిశ్రమలకు అధికంగా అవకాశం ఉంది. ప్రత్యేకంగా సీజనల్ ఫుడ్స్, చేపలపెంపకం, పట్టుపురుగుల పెంపకానికి అవకాశం అధికం. పారిశ్రామిక కార్మికుల కొరత కారణంగా జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. జిల్లాలో హస్థకళలు, కుటీరపరిశ్రమలు ప్రజలకు ఉపాధిని కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఇవి అధికంగా ఉపాధి కల్పిస్తుంది.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,826,006,[1]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. కనాస్ నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 135వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 711 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.09%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 962:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 74%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
ముస్లిములు 1,180,267 (50.99%),
హిందువులు 1,106,354
ఇతర మతస్థులు సిక్కులు, జైనులు, బౌద్ధులు.
భాషలు అస్సామీలు, బెంగాలీ, హిందీ, బోడో, కర్బి, దింసా, మణిపురి,

సంస్కృతి మార్చు

పర్యాటకం మార్చు

బొర్డోవా మార్చు

 
బోర్డువా థాన్
  • బోర్డువా : ఇది శ్రీమంత శంకరదేవా పుట్టిన ప్రదేశం. శ్రీమంత శంకరదేవా గొప్ప రచయిత, కళాకారుడు, వైష్ణవ సమాజ స్థాపకుడు, అస్సాం నాటకకళాకారుడు. నాగావ్ పట్టణానికి 18కి.మీ దూరంలో ఉన్న బోర్డోవాలో 2 సత్రాలు ఉన్నాయి. ఒకటి నరోవా సత్రం రెండవది సాలగురి సత్రం. నరోవా సత్రంలో చిన్న మ్యూజియం ఉంది.
 
బోర్డువా థాన్ దేవాలయంలోని లోపలి భాగం

సమగురి బిల్ మార్చు

సమగురి బిల్ (పొఖి తీర్ధ) లో వలసపక్షులకు గుర్తింపు పొందింది. ఇక్కడకు శీతాకాలంలో పలు వలసపక్షులు ఇక్కడకు చేరుకుంటుంటాయి.

రాక్ గార్డెన్ మార్చు

రాక్ గార్డెన్ అమ్యూజ్మెంట్ పార్క్, తంజ్ వాటర్ పార్క్ సమగురి వద్ద ఉంది. నాగావ్ జిల్లాకు ఇది ఒక కొత్త ఆకర్షణగా ఉంది.

లొఖొవా అభయారణ్యం మార్చు

నాగావ్ జిల్లాలో 70చ.కి.మీ వైశాల్యంలో " లొఖోవా విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " అభయారణ్యం స్థాపించబడింది. ఇందులో ఖడ్గమృగాలు ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. అదనంగా ఈ అభయారణ్యంలో పులి, చిరుతపులి, ఆసియా బెర్రెలు, విల్డ్ బొయర్, చివెట్ క్యాట్, లెప్పర్డ్ క్యాట్, హాగ్ డీర్ మొదలైన జంతువులు ఉన్నాయి. లోఖొవలో పక్షులు, విషపాములు ఉన్నాయి.

చంపావతి కుండ మార్చు

 
నాగావ్ జిల్లాలోని చాపనల వద్ద ఉన్న జలపాతాలు

నాగావ్ జిల్లాలోని చంపనలా వద్ద ఉన్న " చంపావతి కుండం" అనే ప్రబల జలపాతం పర్యాటక ఆకర్షణలలో ప్రత్యేకమౌనది.

కలియాబర్ మార్చు

నాగావ్ పట్టాణాలకు 48 ఉన్న కలియబార్ ఒక చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతం. అహోం కాలంలో బర్ఫుఖన్లకు ఇది రాజధానిగా ఉండేది. మొగల్ సామ్రాజ్యం దణ్డయాత్రలకు ఇది ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది.

సిల్ఘాట్ మార్చు

నాగావ్ పట్టణానికి 50కి.మీ దూరంలో ఉన్న సిల్హౌట్ అందమైన నదీతీరం. ఇది బ్రహ్మపుత్ర నదికి దక్షిణ తీరంలో ఉంది. మద్య అస్సాంలో ఇది రవాణాకేంద్రంగా ఉంది. బ్రహ్మపుత్రా నది నౌకాశ్రయ పట్టణాలలో ఇది ఒకటి. ఇక్కడ అస్సాం కో-ఆపరేటివ్ జ్యూట్ మిల్ ఉంది. సిల్ఘాట్‌లో పలు ఆలయాలు ఉన్నాయి. బృహత్తర సమంతగిరి కొండగుట్టలు అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

హొజల్ మార్చు

నాగావ్ పట్టణానికి 61 కి.మీ దూరంలో ఉన్న హొజల్ అస్సాం ధాన్యాగారంగా గుర్తించబడుతుంది. హొజల్ భూమి సారవంతంగా ఉంట్జుంది. ఇది సెంటు పరిశ్రమకు కేంద్రగా ప్రత్యేకత సంతరించుకుంది. అస్సాంలో ఇది ప్రధాన బియ్యం మార్కెట్‌గా పేరుతెచ్చుకుంది. బియ్యంతో చెరుకు, ఆవాలు, జూట్, కూరగాయలు కూడా ఇక్కడ విస్తారంగా పండించబడుతున్నాయి. బారన్ బరిద్దీన్ అజ్మల్ సెంటుకు ఇది జన్మస్థానం.

జుగిలన్ మార్చు

 
నాగావ్ జిల్లా రాజ్ బరిలో నెలకొని ఉన్న పురాతన శివ లింగం

నాగావ్ పట్టణానికి 6 కి.మీ దూరంలో హొజల్ ప్రాంతంలో నౌకాశ్రయ శిథిలాలు, మూడు ఆలయ శిల్పాల పరిశోధన ప్రారంభం అయింది. ఇక్కడ త్రవ్వకాలలో 7 శివలింగాలు వెలికి తీసి భద్రపరచబడ్డాయి. జువంగికి 2 కి.మీ దూరంలో ఉన్న నవంగ గ్రామంలో 11వ శతాబ్ధానికి చెందిన చాముంఢీశ్వరీ ఆలయం బయటపడింది.

డొబోకా మార్చు

నాగావ్ పట్టణానికి 34కి.మీ దూరంలో ఉన్న డొబోకా డొబాకా రాక్యానికి రాజధానిగా ఉందని అలహాబాదులో ఉన్న గుప్తా చక్రవర్తి సముద్రగుప్తుని శిలాశాసనాలు వివరిస్తున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు. డొబోకా వద్ద ఉన్న అకాశగంగా జలపాతం విహారప్రదేశంగా ఉంది. ఇక్కడ ముందు నుండి ముస్లిములు అధికంగా నివసిస్తున్నారు..

రహ మార్చు

నాగావ్ పట్టణానికి 22 కి.మీ దూరంలో రహ వద్ద ఉన్న బురుజు అహోం కాలంలో ప్రత్యేకత కలిగి ఉంది. ప్రస్తుతం రహ ప్రముఖ వ్యవసాయ సంబంధిత వ్యాపార కేంద్రంగా ప్రత్యేకత కలిగి ఉంది. రహలో వడ్లు, జనపనార, ఆవాలు అధికంగా విక్రయించబడుతున్నాయి. " ఫిషరీ ట్రౌనింగ్ కాలేజ్ " ఇక్కడ ఉన్న ముఖ్యమైన విద్యాకేంద్రాలలో ఒకటి. నాగావ్ జిల్లాలో ఇలాంటి సంద్థలలో ఇదే మొదటిది.

కామాఖ్య ఆలయం మార్చు

సిలికాట్ వద్ద ఉన్న బ్రహ్మపుత్రా నదీ తీరంలో కామాఖ్యా ఆలయంల ఉంది. ఈ ఆలయంలో ప్రతిసంవత్సరం అశోక అష్టమి రోజున అన్నదానం నిర్వహించబడుతుంది.

నంఘర్లు సంబంధిత ఆలయాలు మార్చు

నాగావ్‌లో పలు నంఘర్లు ఉన్నాయి. వీటిలో హార్బర్ వద్ద ఉన్న భరలి నంఘర్, నాగవ్ సత్రా వద్ద ఉన్న బర్దొవా నంగర్ ఇక్కడ శంకరదేవ్ జన్మించాడు. ఇక్కడ రాజా శివ సింగా కాలంలో నిర్మించబడిన సౌభాగ్యా మహాదేవ్, దులాల్ మహాదేవ్, గోపాల్ మహాదేవ్ అనే 3 పురాతన ఆలయాలు ఉన్నాయి.

లండింగ్, చంపర్‌ముఖ్ మార్చు

జిల్లాలో 2 ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇవి ప్రధాన వ్యాపార కేంద్రాలుగా కూడా ఉన్నాయి. లండంగ్ ఎన్.ఎఫ్ రైల్వే డివిషనల్ హెడ్‌క్వార్గా ఉంది. ఇక్కడ పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. లమ్‌డంగ్‌లో మైనపువత్తి తయారీ, ట్రంకుల తయారీ ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయి.

రంతలి మార్చు

రంతలి గ్రామం అస్సామీ బంగారు పూత ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ప్రఖ్యాత రంతలి నాగావ్ పట్టణానికి 4 కి.మీ దూరంలో ఉంది.

జమునాముఖ్ మార్చు

జనాముఖ్ నాగావ్ పట్టణానికి 35కి.మీ దూరంలో ఇంది. ఇక్కడ ముస్లిములు అధికంగా నివసిస్తున్నారు. ఇక్కడ తయారు చేయబడుతున్న మట్టిపాత్రలు ప్రఖ్యాతి వహించాయి.

వృక్షజాలం, జంతుజాలం మార్చు

1974లో నాగావ్ జిల్లాలో 175చ.కి.మీ వైశాల్యంలో " కళిరంగా నేషనల్ పార్క్ " స్థాపించబడింది.[8] ఈ పార్కును గోలాఘాట్ జిల్లాతో పంచుకుంటుంది. జిల్లాలో అదనంగా " లఖోవా విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " కూడా ఉంది.[8]

క్రీడలు మార్చు

నాగావ్‌లోని " జూబ్లీ ఫీల్డ్ "లో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్ పెద్ద ఎత్తున అభిమానులను ఆహ్వానిస్తుంది. నురుల్ అమిన్ స్టేడియంలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ క్రీడోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Edward Gait (1906) A History of Assam, p293
  3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Bohol 3,821km2
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Kansas 2,853,118
  8. 8.0 8.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు మార్చు

26°21′00″N 92°40′00″E / 26.3500°N 92.6667°E / 26.3500; 92.6667

మూస:అస్సాంలోని జిల్లాలు