1564
1564 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1561 1562 1563 - 1564 - 1565 1566 1567 |
దశాబ్దాలు: | 1540లు 1550లు - 1560లు - 1570లు 1580లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జూలై: ఇంగ్లీష్ వ్యాపారి ఆంథోనీ జెంకిన్సన్ తన రెండవ యాత్ర నుండి గ్రాండ్ డచీ ఆఫ్ మాస్కోకు తిరిగి వస్తాడు, ఇంగ్లీష్ మస్కోవి కంపెనీకి వాణిజ్య హక్కుల యొక్క గణనీయమైన విస్తరణను పొందాడు.
- సెప్టెంబర్ 4: డెన్మార్క్ లోని రోన్నెబీలో (ఇప్పుడు స్వీడన్లో ఉంది) రోన్నెబీ రక్తపతం జరిగింది.
- సెప్టెంబర్ 10: జపాన్‌లో కవనకాజిమా యుద్ధం : టకేడా షింగెన్ చివరిసారిగా ఉసుగి కెన్షిన్ దళాలతో పోరాడి, వారిని నిలిపేసాడు.
- నవంబర్ 21: స్పానిష్ దండయాత్రికుడు మిగ్యుల్ లోపెజ్ డి లెగాజ్పి మెక్సికో నుండి ప్రయాణించాడు. తరువాత, అతను ఫిలిప్పీన్స్ దీవులను జయించి మనీలాను స్థాపించాడు .
- డిసెంబర్ 25: విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నలుగురు సుల్తానుల కూటమి యుద్ధ సన్నద్ధులై తళ్ళికోట వద్దకు ససైన్యంగా చేరుకున్నారు.
జననాలు
మార్చు- ఫిబ్రవరి 19: భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త గెలీలియో గెలీలి జననం. (మ.1642)
- ఏప్రిల్ 26: (బాప్తిస్మం పొందాడు) విలియం షేక్స్పియర్ ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత. (మ. 1616)
- ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం) నాటకం రచించిన క్రిస్టఫర్ మార్లో (మ.1593)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 18: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి,, ఇంజనీరు. (జ.1475)
- రాణీ దుర్గావతి, బుందేల్ఖండు సంస్థానాధీశుల్లో మొదటివాడైన చందవేల్ రాజు కుమార్తె (జ. 1524)
- పురందర దాసు: ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు. (జ.1484)