డిసెంబర్ 25
తేదీ
డిసెంబర్ 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 359వ రోజు (లీపు సంవత్సరములో 360వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 6 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1927 : మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు.
- 2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు.
- 2007: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.
జననాలు
మార్చు- 1861: మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
- 1876: భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948)
- 1901: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]
- 1910: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
- 1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి. (మ.2018)
- 1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
- 1927: రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.
- 1933: పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
- 1936: ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
- 1950: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
- 1951: చంద్రకళ, తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత. (మ.1999)
- 1956: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
- 1971: ఎ.కరుణాకర్, చలన చిత్ర దర్శకుడు .
- 1974: నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు.
- 1977: ప్రియా రాయ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి.
- 1991: సుహాని కలిత, తెలుగు, హిందీ, మలయాళ, బెంగాలీ చిత్రాల నటి.
మరణాలు
మార్చు- 1846: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)
- 1970: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909)
- 1972: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
- 1972: కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
- 1996: హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972)
- 1997: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911)
- 1998: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, తెలుగు వచన కవితా ప్రవీణులు.
- 2009: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912)
- 2011: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930)
- 2015: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)
- 2022: తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు
- జాతీయ సుపరిపాలన దినోత్సవం .
బయటి లింకులు
మార్చుడిసెంబర్ 24 - డిసెంబర్ 26 - నవంబర్ 25 - జనవరి 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |