1707 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1704 1705 1706 - 1707 - 1708 1709 1710
దశాబ్దాలు: 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు సవరించు

  • జనవరి 16: స్కాట్లాండ్, ఇంగ్లాండ్ యొక్క రెండు రాజ్యాల విలీన ఒప్పందం (లేదా చట్టం) స్కాట్లాండ్ పార్లమెంట్ ఆమోదించింది.
  • మార్చి 3: మొగలు చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో మరణించాడు.
  • మార్చి 19: స్కాట్లాండ్‌తో యూనియన్ చట్టాన్ని ఇంగ్లాండ్ పార్లమెంట్ ఆమోదించింది.
  • మే 12: స్కాట్లాండ్, ఇంగ్లాండ్ రాజ్యాలు విలీనమై గ్రేట్ బ్రిటన్ యొక్క ఏకైక సార్వభౌమ రాజ్యం ఉనికిలోకి వచ్చింది, [1]
  • మే 23: శాంటోరిని కాల్డెరాలో అగ్నిపర్వత విస్ఫోటనం ప్రారంభమైంది.
  • అక్టోబరు 22: సిసిలీ నావికాదళ విపత్తు : తప్పుడు నావిగేషన్ కారణంగా నాలుగు బ్రిటిష్ రాయల్ నేవీ నౌకలు ఐల్స్ ఆఫ్ స్సిలీలో ఒడ్డు వైపుకు కొట్టుకెళ్ళాయి. అడ్మిరల్ సర్ క్లౌడెస్లీ షోవెల్ తో సహా, కనీసం 1,450 నావికులు అందరూ మునిగిపోయారు.
  • అక్టోబరు 23: గ్రేట్ బ్రిటన్ రాజ్యపు పార్లమెంటు మొదటిసారి లండన్లో సమావేశమైంది.
  • అక్టోబరు 28: హేయి భూకంపం (2011 వరకు జపాన్‌లో ఇదే అత్యంత శక్తివంతమైనది) తాకింది, స్థానిక పరిమాణం 8.6 గా అంచనా వేసారు.
  • డిసెంబరు 16: ఫుజి పర్వతపు చివరి విస్ఫోటనం జపాన్‌లో ప్రారంభమైంది.
  • డిసెంబరు: స్వీడన్‌కు చెందిన చార్లెస్ XII రష్యాపై దండయాత్ర ప్రారంభించాడు, 60,000 సంకీర్ణ దళాలతో లీప్‌జిగ్ నుండి తూర్పు వైపుకు వెళ్ళాడు. రీగా శివార్లలో మరో 16,000 మంది సైనికులు స్వీడిష్ సరఫరా మార్గాలకు కాపలాగా ఉన్నారు.

జననాలు సవరించు

మరణాలు సవరించు

 
Aurangzeb as the young emperor

పురస్కారాలు సవరించు

మూలాలు సవరించు

  1. Acts of Union 1707 parliament.uk, accessed 31 December 2010.
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
"https://te.wikipedia.org/w/index.php?title=1707&oldid=3846748" నుండి వెలికితీశారు