1712
1712 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1709 1710 1711 - 1712 - 1713 1714 1715 |
దశాబ్దాలు: | 1690లు 1700లు - 1710లు - 1720లు 1730లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలుసవరించు
- జనవరి 8: సంపూర్ణ సూర్య గ్రహణం 60°36′S 49°12′E / 60.6°S 49.2°E నుండి కనిపించింది
- జనవరి 16: మాస్కోలో ఒక మిలిటరీ ఇంజనీరింగ్ పాఠశాల స్థాపించబడింది. ఇదే AF మొజైస్కీ మిలిటరీ-స్పేస్ అకాడమీగా అవతరించింది.
- జనవరి 26: 18,161 కిలోల బరువున్న గంట, ఓల్డ్ పమ్మెరిన్‌నువియన్నా లోని సెయింట్ స్టీఫెన్ కేథడ్రల్ లో తొలిసారి మోగించారు. చార్లెస్ VI కు చక్రవర్తిగా పట్టాభిషేకం అయ్యాక, వియన్నా నుండి ఫ్రాంక్ఫర్ట్‌కు తొలిసారి వచ్చిన గుర్తుగా దీన్ని మోగించారు. 16 మంది పురుషులు పావుగంట పాటు బెల్ తాడును లాగితే గంట లోని గంటకు తగిలి మోగింది.
- ఫిబ్రవరి 10: హుయిలిచే తిరుగుబాటు : చిలీ యొక్క చిలోస్ ద్వీపసమూహంలోని హుయిలిచే ప్రజలు తమకు జరిగుఇన అన్యాయాలకు ప్రతీకారంగా స్పానిష్ ఎన్‌కోమెండెరోస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు .
- ఫిబ్రవరి 30: స్వీడన్ తమ క్యాలెండర్‌ను తాత్కాలికంగా జూలియన్ క్యాలెండర్‌కు తిరిగి మార్చుకుంది.
- మార్చి 11: స్వీడన్ తమ క్యాలెండర్‌ను తాత్కాలికంగా జూలియన్ క్యాలెండర్‌కు తిరిగి సర్దుబాటు చేసే రోజుగా అరుదైన ఫిబ్రవరి 30 ను స్వీకరించింది.
- మార్చి 30: గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే చివరిసారిగా రాయల్ టచ్ (అనారోగ్యాన్ని నయం చేయాలనే ఉద్దేశంతో ఒక కర్మ) నిర్వహిస్తుంది; ఆమె తాకిన 300 మందిలో చివరివాడు శామ్యూల్ జాన్సన్ .
- మే 19: పీటర్ ది గ్రేట్ రష్యా రాజధానిని మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్‌కు తరలించాడు .[1]
- ఆగస్టు 1: యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1712 నాటి స్టాంప్ చట్టాన్ని ఆమోదించారు. ప్రచురణకర్తలపై, ముఖ్యంగా వార్తాపత్రికలపై పన్ను విధించింది.
- డిసెంబర్ 28: సంపూర్ణ సూర్య గ్రహణం 21°30′S 159°00′E / 21.5°S 159.0°E నుండి కనిపించింది.
- తేదీ తెలియదు: మొగలు చక్రవర్తి జహందర్ షా పీఠమెక్కాడు
- తేదీ తెలియదు: మొట్టమొదటిగా పనిచేసే న్యూకామెన్ ఆవిరి యంత్రాన్ని థామస్ న్యూకామెన్ జాన్ కాలీతో కలిసి నిర్మించాడు. ఇది బ్లాక్ కంట్రీ ఆఫ్ ఇంగ్లాండ్‌లోని గనుల నుండి నీటిని బయటకు తోడివేయడానికి, యాంత్రిక పనిని ఉత్పత్తి చేయడానికి ఆవిరి శక్తిని ఆచరణాత్మకంగా ఉపయోగించిన మొదటి పరికరం.[2]
జననాలుసవరించు
- జనవరి 24: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
మరణాలుసవరించు
- ఫిబ్రవరి 27 : మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
- తేదీ తెలియదు: కొటికెలపూడి వీరరాఘవయ్య, మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థాన ప్రభువైన పెద సోమనాద్రి ఆస్థాన కవి. (జ. 1663)
పురస్కారాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ Error on call to మూస:cite web: Parameters url and title must be specified
- ↑ Rolt, L. T. C.; Allen, J. S. (1977). "The First Newcomen Engines c1710-15". The Steam Engine of Thomas Newcomen (new ed.). Hartington: Moorland. pp. 44–57. ISBN 0-903485-42-7.