1720 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1717 1718 1719 - 1720 - 1721 1722 1723
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు మార్చు

 
నాసావు యుద్ధం
  • జనవరి 21: స్వీడన్, ప్రష్యాలు స్టాక్హోమ్ ఒప్పందం (గ్రేట్ నార్తర్న్ వార్) పై సంతకం చేశాయి.
  • ఫిబ్రవరి 17: స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, డచ్ రిపబ్లిక్ ల మధ్య హేగ్ ఒప్పందం కుదిరింది. దీంతో క్వాడ్రపుల్ అలయన్స్ యుద్ధం ముగిసింది.[1]
  • ఫిబ్రవరి 24: నాసావు యుద్ధం : క్వాడ్రపుల్ అలయన్స్ యుద్ధంలో బహామాస్ లోని నాసావు బ్రిటిష్ స్థావరంపై స్పానిష్ దళాలు దాడి చేశాయి.
  • ఏప్రిల్: ఇంగ్లాండ్‌లో "సౌత్ సీ బబుల్": బ్రిటన్ జాతీయ రుణాన్ని సౌత్ సీ కంపెనీ స్వాధీనం చేసుకునే పథకం వలన దాని వాటా ధరలు భారీగా పెరిగాయి.
  • ఆగష్టు 14: ఉత్తర అమెరికా గ్రేట్ ప్లెయిన్స్ పై ఫ్రెంచి వారి ప్రభావాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో న్యూ మెక్సికో నుండి జూన్ 16 న బయలుదేరిన స్పెయిను వారి విల్లాసూర్ యాత్ర పావ్నీ, ఒటో బలగాలు చేసిన మెరుపుదాడి వలన విఫలమైంది.
  • సెప్టెంబర్: "సౌత్ సీ బబుల్": సౌత్ సీ కంపెనీ స్టాక్ ధరలను పడిపోవడంతో ఇంగ్లండు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.

తేదీ తెలియదు మార్చు

  • చైనాలోని పాశ్చాత్య వ్యాపారవేత్తలందరూ గ్వాంగ్‌జౌలో మాత్రమే వ్యాపారం చేయవచ్చని కాంగ్జీ చక్రవర్తి ప్రకటించాడు.
  • ఎడ్మండ్ హాలీని ఇంగ్లాండ్ ఖగోళ శాస్త్రవేత్తగా నియమించారు.
  • పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అకాడెమియా రియల్ డా హిస్టోరియా స్థాపించారు.
  • జోనాథన్ స్విఫ్ట్ ఐర్లాండ్‌లో తన గలివర్స్ ట్రావెల్స్‌ ప్రధాన కూర్పుపై పనిని ప్రారంభించాడు.

జననాలు మార్చు

మరణాలు మార్చు

  • ఏప్రిల్ 12: బాలాజీ విశ్వనాథ్, మరాఠా సామ్రాజ్యం యొక్క పేష్వా (జ .1662 )

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 297–298. ISBN 0-304-35730-8.
"https://te.wikipedia.org/w/index.php?title=1720&oldid=3264646" నుండి వెలికితీశారు