1754 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1751 1752 1753 - 1754 - 1755 1756 1757
దశాబ్దాలు: 1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • జూన్ 3: రెండవ ఆలంఘీర్ మొఘల్ చక్రవర్తి అయ్యాడు
  • సెప్టెంబర్ 2: సాయంత్రం 9 గంటల తరువాత కాన్స్టాంటినోపుల్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది . ఒక స్కాటిష్ వైద్యుడు, డాక్టర్ మోర్డాచ్ మాకెంజీ, అనేక భవనాలు దెబ్బతిన్నాయని నివేదించాడు: "ఈ విపత్తుతో 2000 మంది మరణించారని కొందరు అంటున్నారు; కొందరు సుమారు 900 అనీ, మరికొందరు 60 మంది అనీ అంటున్నారు. నేను చూసినదాని ప్రకారం ఈ చివరి సంఖ్యే సత్యానికి దగ్గరగా ఉంది. " [1]
  • సెప్టెంబర్ 11: ఆంగ్ల అన్వేషకుడు ఆంథోనీ హెండే రెడ్ డీర్ నది పైన ఒక శిఖరాన్ని అధిరోహించినపుడు, కెనడియన్ రాకీస్‌కు చేరుకున్న మొట్టమొదటి తెల్లజాతి వ్యక్తి అయ్యాడు. [2]
  • అక్టోబర్ 24: చైనా కియాన్లాంగ్ చక్రవర్తి, చైనా ప్రజలు మూడేళ్ళకు పైగా దేశం బయట ఉంటే వెనక్కి తిరిగి రాకుండా నిషేధించిన దీర్ఘకాలిక విధానాన్ని రద్దు చేసాడు. [3]
  • అక్టోబర్ 31: కొలంబియా విశ్వవిద్యాలయాన్ని "కింగ్స్ కాలేజ్" పేరుతో న్యూయార్క్ నగరంలో స్థాపించారు. [4]
  • నవంబర్ 29: పర్షియా రాజు కరీం ఖాన్ జాండ్, షిరాజ్ నగరాన్ని ఆఫ్ఘన్ యుద్దవీరుడు ఆజాద్ ఖాన్ ఆఫ్ఘన్ నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. [5]
  • డిసెంబర్ 13: ఉస్మాన్ III, తన సోదరుడు మహమూద్ I తరువాత ఒట్టోమన్ చక్రవర్తి అయ్యాడు. 1757లో మరణించే వరకు అతను పాలించాడు.
  • తేదీ తెలియదు: ఫ్రెంచి గవర్నర్ గోడెన్ హ్యూ ఆంగ్లేయులతో పుదుచ్చేరి సంధి చేసుకున్నాడు. దాంతో రెండో కర్ణాటక యుద్ధం ముగిసింది.

జననాలు

మార్చు
 
Colinmackenzie

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Charles Hutton, et al., The Philosophical Transactions of the Royal Society of London, from Their Commencement, in 1665, to the Year 1800, Volume X: From 1750 to 1755 (C. and R. Baldwin, 1809) p549
  2. Andrew Hempstead, Canadian Rockies: Including Banff & Jasper National Parks, Moon Handbooks (Avalon Publishing, 2016)
  3. Philip A. Kuhn, Chinese Among Others: Emigration in Modern Times (Rowman & Littlefield, 2009) p94
  4. Robert McCaughey, Stand, Columbia: A History of Columbia University (Columbia University Press, 2003) p21
  5. Kaveh Farrokh, Iran at War: 1500-1988 (Bloomsbury Publishing, 2011)
"https://te.wikipedia.org/w/index.php?title=1754&oldid=3026675" నుండి వెలికితీశారు