1752
1752 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1749 1750 1751 - 1752 - 1753 1754 1755 |
దశాబ్దాలు: | 1730లు 1740లు - 1750లు - 1760లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 1: బ్రిటిష్ సామ్రాజ్యం (స్కాట్లాండ్ మినహా) గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది. ఇందులో భాగంగా ఈ రోజును సంవత్సరంలో మొదటి రోజుగా స్వీకరించింది. ఈ రోజు బ్రిటిష్ పార్లమెంట్ గత సంవత్సరం చేసిన క్యాలెండర్ చట్టం నిబంధనల ప్రకారం నూతన సంవత్సర రోజు.[1]
- ఫిబ్రవరి 29: ఎగువ బర్మాలోని గ్రామ చీఫ్ అలంగ్పాయ, కొన్బాంగ్ రాజవంశాన్ని స్థాపించాడు. 8 సంవత్సరాల తరువాత మరణించే నాటికి, అతను దేశం మొత్తాన్ని ఏకం చేశాడు.
- మార్చి 23: కెనడా మొదటి వార్తాపత్రిక అయిన హాలిఫాక్స్ గెజిట్ను ప్రచురించారు.
- ఏప్రిల్ 12: పంజాబ్ సిక్కులు స్వాధీనం చేసుకున్న లాహోర్ నగరాన్ని నాలుగు సంవత్సరాల తరువాత అహ్మద్ షా దుర్రానీ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, తిరిగి స్వాధీనం చేసుకున్నారు.[2]
- జూన్ 3: రష్యన్ సామ్రాజ్యం రాజధాని మాస్కోలో జరిగిన అగ్నిప్రమాదంలో 13,000 ఇళ్ళు తగలబడ్డాయి. మే 23 న జరిగిన అగ్నిప్రమాదంలో 5,000 గృహాలు దగ్ధమైన 11 రోజుల తరువాత ఇది జరిగింది. జూన్ 6 నాటికి, నగరంలో మూడింట రెండొంతుల మంది దెబ్బతిన్నారు.[3]
- జూలై 1 – ఇస్తాంబుల్‌లో ఒట్టోమన్ సుల్తాను మహమూద్ I, దివిత్దార్ మెహమెద్ ఎమిన్ పాషాను ఒట్టోమన్ సామ్రాజ్యపు మహా మంత్రి పదవి నుండి తొలగించాడు. కొత్త మహామంత్రిగా కోర్లులు ఆలీ పాషాను నియమించాడు.
- మే 11: మొదటి అగ్నిప్రమాద భీమాపథకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
- జూన్ 15: వర్షం వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
జననాలు
మార్చు- సెప్టెంబరు 18: ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త అడ్రియన్ మేరీ లెజెండ్రీ (మ.1833).
మరణాలు
మార్చుపురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 315–316. ISBN 0-304-35730-8.
- ↑ "Afghan-Sikh Wars (Durrani-Sikh Wars)", by Melodee M. Baines, in Afghanistan at War: From the 18th-Century Durrani Dynasty to the 21st Century, ed. by Tom Lansford (ABC-CLIO, 2017) p20
- ↑ "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p52