1792
1792 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1789 1790 1791 - 1792 - 1793 1794 1795 |
దశాబ్దాలు: | 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 9 – జాస్సీ ఒప్పందంతో క్రిమియా గురించి ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యాలు చేస్తున్న యుద్ధం ముగిసింది. [1]
- ఫిబ్రవరి 20 – యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ విభాగాన్ని స్థాపించే పోస్టల్ సర్వీస్ చట్టంపై అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ సంతకం చేశాడు. [2]
- ఫిబ్రవరి 20 – డబ్లిన్‌లోని పార్లమెంటు సమావేశాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. తదనంతరం చేసిన ప్రకటనలో, "పైకప్పు కూలిపోవటం ఖాయంగా కనిపించినప్పటికీ, సభ వాయిదా వెయ్యాలని తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించేవరకూ సభను వాయిదా వెయ్యలేదు" అని చెప్పారు. [3]
- మార్చి 1 – చివరి పవిత్ర రోమన్ చక్రవర్తి, ఫ్రాన్సిస్ II పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
- మార్చి 16 – స్టాక్‌హోమ్‌లోని రాయల్ ఒపెరాలో అర్ధరాత్రి స్వీడన్ రాజు గుస్తావ్ III ను జాకబ్ జోహన్ అంకర్స్ట్రోమ్ కాల్చడంతో, అతను మార్చి 29 న మరణించాడు. తరువాత అతని 14 సంవత్సరాల కుమారుడు గుస్తావ్ IV అడాల్ఫ్ రాజయ్యాడు.
- మే 17: బటన్వుడ్ ఒప్పందం కుదురడంతో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైంది.
- మే 21: జపాన్‌లోని మౌంట్ అన్జెన్ అగ్నిపర్వతం కార్యకలాపాల కారణంగా హిమపాతం, సునామీ చెలరేగి 14,300 మంది మరణించారు.
- సెప్టెంబర్ 2 – 7: ఫ్రెంచ్ విప్లవంలో సెప్టెంబరు ఊచకోత: దుండగుల గుంపులు ముగ్గురు రోమన్ కాథలిక్ బిషప్‌లను, 200 మందికి పైగా పూజారులను, కనీసం 1,000 మంది నేరస్థులనూ చంపేసాయి.
- సెప్టెంబర్ 14 – దేశద్రోహానికి పాల్పడినట్లు తేలడంతో థామస్ పైన్ ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్‌కు పారిపోయాడు. అతన్ని గైర్హాజరులో విచారించి డిసెంబరులో నేరస్థుడిగా నిర్ధారించారు.[4]
- అక్టోబర్ 13: వాషింగ్టన్, DC స్థాపన: అమెరికా కార్యనిర్వాహక భవనానికి (1818 తరువాత దాన్ని వైట్ హౌస్ అని పిలుస్తున్నారు) శంకుస్థాపన చేసారు.
- తేదీ తెలియదు: భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.
- తేదీ తెలియదు: టిప్పు సుల్తాన్ కేరళపై దాడి చేశాడు, కాని ఆ దాడిని కేరళీయులు తిప్పికొట్టారు.
- తేదీ తెలియదు: జార్జ్ అన్షుట్జ్ పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో మొదటి బ్లాస్ట్ ఫర్నెస్‌ను నిర్మించాడు.
- తేదీ తెలియదు: ఐరోపాలో మొదటి రాత పరీక్షలు ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరుగాయి.
జననాలు
మార్చు- ఆగస్టు 4 – పెర్సీ బైషే షెల్లీ, ఆంగ్ల కవి (మ .1822)
- తేదీ తెలియదు: స్వామినేని ముద్దునరసింహంనాయుడు, వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త. (మ. 1856) [5]
- తేదీ తెలియదు: గులాబ్ సింగ్, జమ్మూ-కాశ్మీరు రాజ్యానికి తొలి మహారాజు. (మ.1857)
మరణాలు
మార్చు- మునావర్‌ఖాన్ 1, కర్నూలు నవాబులలో రెండవ వాడు.
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Historical Events for Year 1792 | OnThisDay.com". Retrieved 2016-07-14.
- ↑ Harper's Encyclopaedia of United States History from 458 A. D. to 1909, ed. by Benson John Lossing and, Woodrow Wilson (Harper & Brothers, 1910) p169
- ↑ "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) pp62
- ↑ Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 232–233. ISBN 978-0-7126-5616-0.
- ↑ Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta