1819
1819 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1816 1817 1818 - 1819 - 1820 1821 1822 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 29: థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
- ఏప్రిల్ 6 – జూన్ 21: బానసలను తీఓసుకెళ్ళే ఫ్రెంచి ఓడ లే రెడ్యూర్ పశ్చిమ ఆఫ్రికా నుండి గ్వాడలోప్ కు ప్రయాణం చేస్తూండగా ఓడలో బానిసలు చాలామందికి కళ్ళు పోయాయి. 30 మంది బానిసలను సముద్రం లోకి తోసేసారు.[1]
- మే 22: ఎస్‌ఎస్ సవానా ఓడ అమెరికా లోని జార్జియా నుండి బయలుదేరి జూన్ 20న ఇంగ్లాండు చేరింది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటిన తొలి ఆవిరి ఓడ ఇది.
- జూన్ 16: కచ్ రాన్ భూకంపంలో 1,543 మంది మరణించారు. ఈ భుకంపం వలన భూమి పైకి ఉబికి వచ్చి, 80 -150 కి.మీ.. పొడవైన 6 మీ. ఎత్తున్న కట్ట ఏర్పడింది. దీన్ని అల్లా బండ్ (దేవుడి ఆనకట్ట) అంటారు.
- జూలై 1: జర్మను ఖగోళవేత్త యోహన్ జార్జ్ ట్రాలెస్, గ్రేట్ కామెట్ ఆఫ్ 1819 తోకచుక్కను కనుగొన్నాడు.[2]
- అక్టోబరు 13: కచ్ రాజాకు ఈస్టిండియా కంపెనీకీ కుదిరిన ఒప్పందం ప్రకారం కచ్ రాజ్యం కంపెనీ హస్తగతమైంది
- నవంబరు 2: బర్మా చక్రవర్తిగా బాగ్యీడా పట్టాభిషేకం జరిగింది.
- డిసెంబరు 17: సైమన్ బొలివర్ అధ్యక్షుడిగా గ్రాన్ కొలంబియా లాంచనంగా ఏర్పాటైంది
- తేదీ తెలియదు: అస్సామీ భాషలో బైబిలు ప్రచురించడంతో అస్సామీ భాషలో ఆధునిక ప్రచురణా యుగం మొదలైంది.
- తేదీ తెలియదు: రావిపాటి గురుమూర్తి రచించిన "ద్వాత్రింశతి సాలభంజికలు", "విక్రమార్కుని కథలు" ప్రచురితమయ్యాయి.
జననాలు
మార్చు- మే 24: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901).
- సెప్టెంబర్ 18:లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1868)
- నవంబరు 22: జార్జ్ ఎలియట్, బ్రిటిషు నవలా రచయిత (మ. 1880)
- తేదీ తెలియదు: సి. వి. రంగనాథ శాస్త్రి, ప్రభుత్వ అధికారి, బహుభాషా కోవిదుడు, సంస్కృత పండితుడు. (మ. 1881)
మరణాలు
మార్చు- ఆగస్టు 25: జేమ్స్ వాట్, ఆవిరి యంత్రాన్ని తయారు చేసిన ఇంజనీరు (జ. 1736)
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Western Africa". The Missionary Register. 9. London: Church Missionary Society: 284–5. July 1821.
- ↑ Dometa Wiegand Brothers, The Romantic Imagination and Astronomy: On All Sides Infinity (Springer, 2015) p. 127