1825 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1822 1823 1824 - 1825 - 1826 1827 1828
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు సవరించు

 • మార్చి 1: 1924 నాటి ఆంగ్లో డచ్చి ఒప్పందం ప్రకారం భారతదేశం లోని డచ్చి స్థావరాలన్నీ బ్రిటిషు వారి వశమై, డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
 • జూలై 18: బ్రెజిల్ నుండి ఉరుగ్వే విడిపోయింది.
 • ఆగస్టు 6: బొలీవియా, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం సాధించుకుంది.
 • ఆగస్టు 18: గ్రెగర్ మెక్‌గ్రెగర్ అనే స్కాటిష్ సాహసికుడు అసలు ఉనికిలోనే లేని "పొయాయిస్" అనే దేశానికి, లండను లోని థామస్ జెంకిన్స్ అండ్ కంఫెనీ బ్యాంకు ద్వారా 3 లక్షల పౌండ్ల ఋణాన్ని మంజూరు చేసాడు. దీంతో ప్రపంచపు మొట్టమొదటి స్టాక్ మార్కెట్ పతనం జరిగింది. లండన్‌లో 6 బ్యాంకులు, మిగతా ఇంగ్లాండులోమరో 60 బ్యాంకులూ మూత పడ్డాయి.
 • సెప్టెంబరు 27: ప్రపంచపు తొట్తతొలి ఆధునిక రైల్వే ఇంగ్లాండులో మొదలైంది
 • డిసెంబరు 26: రష్యా చక్రవర్తిగా నికోలస్ 1 గద్దెనెక్కడాన్ని నిరసిస్తూ రష్యా సైన్యం లోని కొందరు అధికారులు సెంట్ పీటర్స్ బర్గ్ లో తిరుగుబాటు చేసారు. ప్రభుత్వం దాన్ని అణచివేసింది.
 • తేదీ తెలియదు: భీమిలి రేవు పట్టణం బ్రిటిషు ‌వారి వశమైంది.
 • తేదీ తెలియదు: బీజింగ్‌ను త్రోసిరాజని లండన్, ప్రపంచపు అతిపెద్ద నగరమైంది.[1]
 • తేదీ తెలియదు: లండన్‌లో గుర్రాలు లాగే బస్సులను ప్రవేశపెట్టారు
 • తేదీ తెలియదు: మిన్హ్ మాంగ్, వియత్నాంలో క్రైస్తవం బోధించడాన్ని నిషేధించాడు.

జననాలు సవరించు

 
దాదాభాయ్ నౌరోజీ, 1892

మరణాలు సవరించు

 • ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (జ.1754)

పురస్కారాలు సవరించు

మూలాలు సవరించు

 1. Rosenberg, Matt T. "Largest Cities Through History". About.com. Archived from the original on 2007-07-14. Retrieved 2012-09-25.
"https://te.wikipedia.org/w/index.php?title=1825&oldid=3911636" నుండి వెలికితీశారు