2005 జింబాబ్వేలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పర్యటన

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు, నమీబియాలో కొన్ని సన్నాహక మ్యాచ్‌లతో సహా 2005 ఆగస్టు, సెప్టెంబర్‌లలో జింబాబ్వేలో పర్యటనకు వెళ్ళి ఆడింది. ఇది రాజకీయ కారణాల దృష్ట్యా వివాదాస్పదమైంది. న్యూజీలాండ్ జింబాబ్వేతో 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. జింబాబ్వే, భారతదేశం, న్యూజీలాండ్‌లతో ఒక ముక్కోణపు వన్డే అంతర్జాతీయ పోటీల్లో కూడా జరిగింది.[1]

2005లో జింబేబ్వేలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు పర్యటన
జింబాబ్వే
న్యూజీలాండ్
రోజులు జూలై 25 – 2005 సెప్టెంబరు 6
నాయకులు తతెంద తైబు స్టీఫెన్ ఫ్లెమింగ్
Test series
ఫలితం న్యూజీలాండ్ 2-ఆటల సిరీస్ ను 2–0 తో గెలుచుకున్నది
అత్యదిక పరుగులు బ్రెండన్ టైలర్ (124) డేనియల్ వెట్టోరీ (175)
అత్యదిక వికెట్లు హీత్ స్ట్రీక్ (6)
బ్లెస్సింగ్ మహ్వైర్ (6)
షేన్ బాండ్ (13)
మెరుగైన ఆటను ప్రదర్శించిన ఆటగాడు(ళ్ళు) షేన్ బాండ్ (న్యూజీలాండ్)

రాజకీయ చర్చ మార్చు

ఆపరేషన్ మురంబత్స్వినా పేరిట రాబర్ట్ ముగాబే నేతృత్వంలోని జింబాబ్వే ప్రభుత్వం దేశవ్యాప్తంగా మురికివాడలను శుభ్రంచేస్తామంటూ బలవంతంగా ప్రజలను మురికివాడల నుంచి తొలగించే పనిని 2005లో ప్రారంభించింది. దీనికి జింబాబ్వే ప్రభుత్వం చేస్తున్న ఇతర మానవహక్కుల ఉల్లంఘనలు కూడా తోడవడంతో అంతర్జాతీయంగా పలు సంస్థలు వ్యతిరేకించసాగాయి. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు ఈ పర్యటనను బహిష్కరించాలని న్యూజీలాండ్ గ్రీన్ పార్టీ, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా మానవ హక్కుల ఉద్యమకారులు, సంస్థలు పిలుపునిచ్చాయి. 2005 డిసెంబర్‌లో జింబాబ్వే క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు రావడం జరగదని, జింబాబ్వే ఆటగాళ్ళకు న్యూజీలాండ్‌లోకి ప్రవేశం నిరాకరిస్తామని న్యూజిలాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది..

న్యూజీలాండ్ జట్టుకు మాత్రం జింబాబ్వేలో పర్యటించడం తప్పనిసరి అయింది. పర్యటించకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 3 మిలియన్ల న్యూజీలాండ్ డాలర్లను జరిమానాగా కట్టాల్సి ఉంటుందని తేల్చింది. ఈ జరిమానాను మాఫీ చేయాలని ఐసీసీని కోరినప్పటికీ వారు తిరస్కరించారు. అంతేకాక, ఈ పర్యటన నుండి వైదొలగడం వల్ల 2011 క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాలను న్యూజిలాండ్ కోల్పోతుందని, తద్వారా మరో 20 మిలియన్ల న్యూజీలాండ్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని కూడా సూచించారు. దీని విషయంలో రెండుసార్లు జనాభిప్రాయాన్ని సేకరించారు, రెంటిలోనూ ఎక్కువమంది న్యూజీలాండ్ వాసులు పర్యటనను వ్యతిరేకించారు. టూర్‌ను విరమించుకోవాలని బ్లాక్ క్యాప్స్‌ని కోరుతూ ప్రవేశపెట్టిన పార్లమెంటు తీర్మానం గణనీయమైన మెజారిటీ సంపాదించుకుంది. యాక్ట్ పార్టీ, మావోరీ పార్టీ మాత్రమే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. అయినప్పటికీ, న్యూజీలాండ్ జట్టు పర్యటనకు వెళ్ళవలసే వచ్చింది.

ఈ పర్యటనలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల తర్వాత జింబాబ్వే-న్యూజీలాండ్-భారత్‌ల మధ్య ముక్కోణపు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కూడా జరిగింది.

షెడ్యూల్ మార్చు

  • ఆగస్టు 4: హరారేలో ప్రాక్టీస్ మ్యాచ్
  • ఆగస్టు 7: తొలి టెస్టు ప్రారంభం (హరారే)
  • ఆగస్టు 15: రెండో టెస్టు ప్రారంభం (బులవాయో)
  • ఆగస్టు 24: మొదటి వన్డే న్యూజిలాండ్ v జింబాబ్వే (బులవాయో)
  • ఆగస్టు 26: 2వ వన్డే భారత్ v న్యూజిలాండ్ (బులవాయో)
  • ఆగస్టు 29: 3వ వన్డే జింబాబ్వే v భారత్ (హరారే)
  • ఆగస్టు 31: 4వ వన్డే న్యూజిలాండ్ v జింబాబ్వే (హరారే)
  • సెప్టెంబర్ 2: 5వ వన్డే న్యూజిలాండ్ v భారత్ (హరారే)
  • సెప్టెంబర్ 4: 6వ వన్డే జింబాబ్వే v భారత్ (హరారే)
  • 6 సెప్టెంబర్: ఫైనల్ (హరారే)

ఫలితాలు మార్చు

నమీబియాతో మ్యాచ్‌లు మార్చు

నమీబియా v న్యూజిలాండ్, జూలై 30 మార్చు

న్యూజిలాండ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది . క్రెయిగ్ కమ్మింగ్ చేసిన 116 పరుగులతో న్యూజీలాండ్ విండ్‌హోక్‌లో నమీబియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. నమీబియా 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ 10 ఓవర్లలో 20కి రెండు వికెట్లు తీసుకున్నప్పటికీ, నమీబియా 301 పరుగులకు ఆలౌట్ అవ్వడం విశేషం.[2]

నమీబియా v న్యూజిలాండ్, జూలై 31 మార్చు

న్యూజిలాండ్ 148 పరుగుల తేడాతో విజయం సాధించింది . తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేశారు. బ్రెండన్ మెకల్లమ్ అజేయంగా 84 పరుగులు చేయగా, నాథన్ ఆస్టిల్ అజేయంగా 73 పరుగులు చేశారు. అయితే, ఈసారి, నమీబియన్లు అధిక స్కోరు సాధించేందుకు వీల్లేకపోయింది, ఎందుకంటే షేన్ బాండ్, క్రిస్ మార్టిన్ తలో రెండు వికెట్లు పడగొట్టి 178 పరుగులకు ఆలౌట్ చేశారు.[3]

టెస్ట్ సిరీస్ మార్చు

మొదటి టెస్ట్ మార్చు

ఆగస్ట్ 7–11[n 1]
Scorecard
v
452/9 డిక్లేర్డ్ (89 ఓవర్లు)
డేనియల్ వెట్టోరీ 127 (98)
బ్లెస్సింగ్ మహ్వైర్ 3/115 (26 ఓవర్లు)
న్యూజీలాండ్ ఒక ఇన్నింగ్స్, 294 పరుగుల తేడాతో గెలిచింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
Umpires: మార్క్ బెన్సన్ (ఇంగ్లండ్), డారెల్ హైర్ (ఆస్ట్రేలియా)
Player of the match: డేనియల్ వెట్టోరీ (న్యూజీలాండ్)
  • జింబాబ్వే టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది.
  • నీల్ ఫెరీరా (జింబాబ్వే) మొదటి టెస్టు ఆడాడు.
  • జింబాబ్వే ఆటగాడు క్రిస్ మ్పోఫు ఒకేలా రెండు ఇన్నింగ్స్‌లోనూ అవుటయ్యాడు – రెండు ఇన్నింగ్స్‌లోనూ ఒకేలా 7 బంతులను ఎదుర్కొన్నాకా డేనియల్ వెట్టోరీ వేసిన బంతికి బ్రండన్ మెకలమ్ స్టంప్ చేయగా డకౌటు అయ్యాడు.
  • ఒకేరోజు రెండుసార్లు ఆలౌట్ అయిన రెండవ జట్టుగా జింబాబ్వే నిలిచింది. 1952లో ఇంగ్లండ్ చేతిలో ఇండియాకు ఇలా మొట్టమొదటిసారి జరిగింది.[4]

రెండో టెస్టు మార్చు

ఆగస్టు 15–19[n 1]
Scorecard
v
231 (79 ఓవర్లు)
తతెందు తైబు 76 (157)
షేన్ బాండ్ 6/51 (17 ఓవర్లు)
484 (111.1 ఓవర్లు)
నాథన్ ఆస్టిల్ 128 (217)
హీత్ స్ట్రీక్ 4/73 (22 ఓవర్లు)
207 (61.1 ఓవర్లు)
బ్రండన్ టేలర్ 77 (129)
షేన్ బాండ్ 4/48 (14 ఓవర్లు)
న్యూజీలాండ్ ఇన్నింగ్స్, 46 పరుగుల తేడాతో గెలుపొందింది.
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులావాయో
Umpires: మార్క్ బెన్సన్ (ఇంగ్లండ్), డారెల్ హైర్ (ఆస్ట్రేలియా)
Player of the match: షేన్ బాండ్ (న్యూజీలాండ్)
  • జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
  • కీత్ దబెంగ్వా (జింబాబ్వే)కి ఇది తొలి టెస్టు.
  • బ్లెస్సింగ్స్ మహ్వైర్ జింబాబ్వే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థ శతకాన్ని సాధించాడు (34 బంతుల్లో).[5]
  • షేన్ బాండ్ అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన న్యూజీలాండ్ బౌలర్‌గా క్రిస్ మార్టిన్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట తిరగరాశాడు (12 టెస్టులు).[6]

వన్డే ఇంటర్నేషనల్స్ మార్చు

జింబాబ్వే-న్యూజీలాండ్-ఇండియా జట్ల మధ్య ద వీడియోకాన్ ముక్కోణపు సీరీస్ పేరిట వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. హరారేలో జరిగిన ఫైనల్‌లో భారత జట్టును ఆరు వికెట్ల తేడాతో న్యూజీలాండ్ ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.[7]

నోట్స్ మార్చు

  1. 1.0 1.1 ఐదు రోజులకు ఈ మ్యాచ్‌ని షెడ్యూల్ చేసినా నాలుగు రోజులకే ఫలితం తేలిపోయింది.

మూలాలు మార్చు

  1. CricketArchive – tour itinerary Archived 6 నవంబరు 2012 at the Wayback Machine. Retrieved on 14 December 2010.
  2. http://uk.cricinfo.com/db/ARCHIVE/2005/OTHERS/NZ_IN_NAMIB/NZ_NAMIB_30JUL2005.html
  3. http://uk.cricinfo.com/db/ARCHIVE/2005/OTHERS/NZ_IN_NAMIB/NZ_NAMIB_31JUL2005.html
  4. "Hopeless Zimbabwe crushed inside two days". ESPNcricinfo. Retrieved 4 August 2018.
  5. "New Zealand seal win as Zimbabwe capitulate" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 4 August 2018.
  6. "'I'm fitter, stronger, and a smarter cricketer'" (in ఇంగ్లీష్). ESPNcricinfo. 18 August 2005. Retrieved 4 August 2018.
  7. https://cricketarchive.com/Archive/Scorecards/83/83498.html Scorecard