స్టీఫెన్ ఫ్లెమింగ్
స్టీఫెన్ పాల్ ఫ్లెమింగ్ (జననం 1973, ఏప్రిల్ 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ గా ఉన్నాడు. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడ్డాడు. ఇతని కెప్టెన్సీలో న్యూజీలాండ్ 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకుంది. ఇతను ఇతర కోచ్‌ల కంటే చెన్నై సూపర్ కింగ్స్‌తో 5 ఐపిఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | స్టీఫెన్ పాల్ ఫ్లెమింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1973 ఏప్రిల్ 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 188 cమీ. (6 అ. 2 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-స్లో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 188) | 1994 19 March - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2008 22 March - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 88) | 1994 25 March - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2007 24 April - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 7 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 3) | 2005 17 February - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2006 26 December - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991/92–1999/2000 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2008/09 | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001 | Middlesex | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | Yorkshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005–2007 | Nottinghamshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | Chennai Super Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
క్రికెట్ రంగం
మార్చుసదరన్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు. చురుకైన వ్యూహాత్మక సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఇతను 111 మ్యాచ్‌లతో అత్యధికంగా ఆడిన న్యూజీలాండ్ రెండవ టెస్ట్ క్రికెటర్ గా నిలిచాడు. జట్టుకు ఎక్కువ కాలం సేవలందించిన, అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఉన్నాడు.[1][2] జట్టుకు 28 విజయాలకు అందించాడు. భారతదేశం, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేపై టెస్ట్ సిరీస్‌లను గెలుచుకున్నాడు.
2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ విజేత కెప్టెన్, ఇది ఇప్పటివరకు వన్డే ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజీలాండ్ ఏకైక ఐసీసీ ట్రోఫీ.[3] 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మకమైన మొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఫ్లెమింగ్ న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[4]
2008 మార్చి 26న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున US$350,000కి సంతకం చేసిన తర్వాత ఆడాడు, 2009 నుండి జట్టు కోచ్ అయ్యాడు.[5] 2015 ఫిబ్రవరిలో బిగ్ బాష్ లీగ్ మెల్బోర్న్ స్టార్స్ కోచ్‌గా సంతకం చేసాడు.[6] 2018 జనవరి 19న 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా తన బాధ్యతలను స్వీకరించాడు. కొంతకాలం రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌కు కోచ్‌గా ఉన్నాడు.[7] ఎస్ఏ20 లీగ్ కోసం 2022లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. 2023లో మేజర్ లీగ్ క్రికెట్‌కు టెక్సాస్ సూపర్ కింగ్స్ కోచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా నిలిచాడు.
మూలాలు
మార్చు- ↑ "Top 10 Most Successful Cricket Captains of All Time". 27 December 2013. Archived from the original on 11 ఏప్రిల్ 2017. Retrieved 30 అక్టోబరు 2023.
- ↑ "Fleming to end New Zealand career". BBC Sport. 14 February 2008. Retrieved 13 November 2011.
- ↑ "Magnificent Cairns steers New Zealand to great triumph". ESPNcricinfo. Retrieved 11 March 2017.
- ↑ "Ponting leads as Kasprowicz follows". ESPNcricinfo. Retrieved 11 March 2017.
- ↑ Article regarding New Zealand Cricketers in the IPL auction Cricinfo, retrieved 25 March 2008
- ↑ "Stephen Fleming named Melbourne Stars coach". 3 News. 25 February 2015. Retrieved 12 March 2015.
- ↑ "Stephen Fleming appointed as head coach of CSK in 2018 IPL". Deccan Chronicle. 19 January 2018.