2010 సంవత్సరములో క్రీడలకు సంబంధించిన వార్తలు, సంఘటనలు.

జనవరి 2010సవరించు

 • జనవరి 6: ముంబాయి 43వ సారి రంజీ ట్రోఫి ఫైనల్లోకి ప్రవేశించింది.
 • జనవరి 7: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో సోమ్‌దేవ్ జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
 • జనవరి 13: వీరేంద్ర సెహ్వాగ్ వన్డే క్రికెట్‌లో 7000 పరుగులు పూర్తిచేసుకొని ఈ ఘనత సాధించిన ఆరవ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు
 • జనవరి 13: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్యజరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటు ఫైనల్లో శ్రీలంక భారత్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
   
  ధొని
 • జనవరి 18: సచిన్ టెండుల్కర్ టెస్టుక్రికెట్‌లో 44వ సెంచరీ పూర్తిచేశాడు.
   
  సచిన్ తన 44వ సెంచరి
 • జనవరి 20: పూజారి శైలజ, విక్కీభట్టాలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య జీవితకాల నిషేధం విధించింది.
 • జనవరి 20;; గౌతమ్ గంభీర్ వరుసగా 5 టెస్టులలో సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించిన ఐదవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.
 • జనవరి 30: ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ విజయం సాధించింది.
   
  సెరెనా విలియమ్స్
 • జనవరి 30: అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది.
 • జనవరి 31: ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ కైవసం చేసుకున్నాడు.
 • జనవరి 31: ఆస్ట్రేలియన్ ఓపెన్-2010 మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన లియాండర్ పేస్, జింబాబ్వేకు చెందిన కారాబ్లాక్ జోడి విజయం సాధించింది.

ఫిబ్రవరి 2010సవరించు

 • ఫిబ్రవరి 13: కెనడాలోని వాంకోవర్‌లో వింటర్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
 • ఫిబ్రవరి 17: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను ఆచంట శరత్ కమల్ వరుసగా 4వ సారి కైవసం చేసుకున్నాడు.
 • ఫిబ్రవరి 19: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు కొత్తఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
 • ఫిబ్రవరి 25: ఒకరోజు క్రికెట్ పోటీలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండుల్కర్ రికార్డు సృష్టించాడు.

మార్చి 2010సవరించు

 • ప్రవీన్ కుమర్: ఐ.పి.ఎల్.-3లో హాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా ప్రవీణ్ రికార్డు సృష్టించాడు.
   
  ప్రవీణ్ కుమర్

ఏప్రిల్ 2010సవరించు

 • ఏప్రిల్ 25: ఐ.పి.ఎల్.-3 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ట్రోఫి చేజిక్కించుకుంది.

మే 2010సవరించు

జూన్ 2010సవరించు

 • జూన్ 4: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్‌ను కాతరీనా స్రెబోత్నిక్, క్వెటా పెషక్ జంట గెలుచుకుంది.
 • జూన్ 11: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చూడండిసవరించు