2010 ఆసియా కప్
2010 ఆసియా కప్ (మైక్రోమ్యాక్స్ ఆసియా కప్) ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటుల్లో పదవది. ఇది 2010 జూన్ 15 నుండి 24 వరకు శ్రీలంకలో జరిగింది. టెస్టు ఆడే దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. ఫైనల్‌లో భారత్ 81 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి రికార్డు స్థాయిలో 5వ ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 88.33 సగటు 164.59 స్ట్రైక్ రేట్‌తో టోర్నమెంట్‌లో అత్యధికంగా 265 పరుగులు చేసినందుకు పాకిస్థాన్ కెప్టెన్, షాహిద్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ పురస్కారం లభించింది.
2010 మైక్రోమ్యాక్స్ ఆసియా కప్ | |
---|---|
తేదీలు | జూన్ 15 – జూన్ 24[1] |
నిర్వాహకులు | ఆసియా క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ రాబిన్, నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | శ్రీలంక |
ఛాంపియన్లు | భారతదేశం (5th title) |
పాల్గొన్నవారు | 4 |
ఆడిన మ్యాచ్‌లు | 7 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | షహీద్ అఫ్రిది |
అత్యధిక పరుగులు | షహీద్ అఫ్రిది (265) |
అత్యధిక వికెట్లు | లసిత్ మలింగ (9) |
← 2008 2012 → |
ట్రోఫీ
మార్చుట్రోఫీని వెండి, బంగారం, రాగి, ఇత్తడితో కలిపి వెండి పూతతో మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్‌తో తయారు చేశారు. ఇది బలం, స్వచ్ఛత, వినయం, పట్టుదలలను సూచిస్తుంది. ఇది, నాలుగు లోహాలను మాత్రమే కాకుండా నాలుగు పాల్గొనే దేశాలను కూడా సూచిస్తుంది. [2]
వేదిక
మార్చు2011 క్రికెట్ ప్రపంచ కప్ కోసం R. ప్రేమదాస స్టేడియంతో సహా శ్రీలంకలోని ఇతర స్టేడియాలు పునరుద్ధరణలో ఉన్నందున రాంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం మాత్రమే ఆసియా కప్ 2010 కి వేదికగా ఉంది. మొత్తం ఏడూ డే/నైట్ మ్యాచ్‌లే.
రాంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం శ్రీలంకలోని 16,800 సీట్ల క్రికెట్ స్టేడియం. [3] ఈ స్టేడియం సెంట్రల్ ప్రావిన్స్‌లో దంబుల్లాకు దగ్గరగా 60 ఎకరాల స్థలంలో ఉంది. ఈ స్టేడియంను దంబుల్లా ట్యాంక్, దంబుల్లా రాక్ లకు అభిముఖంగా నిర్మించారు.
జట్లు
మార్చుటోర్నమెంట్లో పాల్గొనే నాలుగు జట్ల జట్టులను ఆయా క్రికెట్ బోర్డులు జూన్ ప్రారంభంలో ప్రకటించాయి. [4]
బంగ్లాదేశ్[5][6] (13) | భారతదేశం[7][8] (1) | పాకిస్తాన్[9][10] (5) | శ్రీలంక[11][12] (7) |
---|---|---|---|
|
|
|
|
మ్యాచ్‌లు
మార్చుగ్రూప్ దశ
మార్చుగ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతావాటితో ఒకసారి ఆడాయి. గ్రూప్ దశల ముగింపులో పాయింట్ల ఆధారంగా టాప్ 2 జట్లు ఒకదానితో ఒకటి ఫైనల్‌లో తలపడ్డాయి. ప్రతి విజయానికి 4 పాయింట్లు, టై/ ఫలితం తేలనివి 1 పాయింటు వస్తాయి. ఒక బోనస్ పాయింట్ విధానం కూడా అమలులో ఉంది, ఒక జట్టు అందుబాటులో ఉన్న ఓవర్‌లలో 80% లేదా అంతకంటే తక్కువ ఉపయోగించి విజయం సాధించినా లేదా ప్రత్యర్థి జట్టు స్కోరును తమ స్కోరులో 80% కి మించకుండా నిలబెట్టినా ఆ విజయం ద్వారా అందుకున్న నాలుగుతో పాటు, అదనంగా మరొక పాయింటు వస్తుంది.
పట్టిక
మార్చుపోస్ | జట్టు | Pld | W | ఎల్ | టి | NR | BP | Pts | NRR |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | శ్రీలంక | 3 | 3 | 0 | 0 | 0 | 2 | 14 | 1.424 |
2 | భారతదేశం | 3 | 2 | 1 | 0 | 0 | 1 | 9 | 0.275 |
3 | పాకిస్తాన్ | 3 | 1 | 2 | 0 | 0 | 1 | 5 | 0.788 |
4 | బంగ్లాదేశ్ | 3 | 0 | 3 | 0 | 0 | 0 | 0 | -2.627 |
ఫైనల్
మార్చుv
|
||
- భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
- భారత్ ఐదోసారి ఆసియా కప్ గెలుచుకుంది.
84 బంతుల్లో 66 పరుగులు చేసిన దినేష్ కార్తీక్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించగా, టోర్నమెంట్‌లో 3 మ్యాచ్‌లలో 265 పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. [13]
మీడియా ప్రసారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Asia Cup 2010". cricketwa. Retrieved 2015-12-22.
- ↑ Micromax unveiled Asia Cup 2010 Trophy to announce the launch of the Cricketing Event.
- ↑ "Rangiri Dambulla International Stadium". ESPNcricinfo. Archived from the original on 4 May 2009. Retrieved 20 June 2010.
- ↑ "Asia Cup 2010 - Squads, teams for India,Bangladesh,Sri Lanka,Pakistan 2010". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "Bangladesh Squad - Bangladesh Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "Aftab Ahmed left out of Asia Cup squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "India Squad - India Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "Tendulkar rested for Asia Cup, Yuvraj dropped". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "Pakistan Squad - Pakistan Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "Shoaib Akhtar recalled for Asia Cup". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "Sri Lanka Squad - Sri Lanka Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ "No Jayasuriya and Mendis in Asia Cup squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
- ↑ India vs Sri Lanka.