కామెరూన్ రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్ (ఫ్రెంచ్: రిపబ్లిక్ డు కామెరూన్) ఉంది. ఇది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఉంది. పశ్చిమ, ఉత్తర సరిహద్దులో నైజీరియా, ఈశాన్య సరిహద్దులో చాడ్; తూర్పు సరిహద్దులో మద్య ఆఫ్రికన్ రిపబ్లిక్కు, దక్షిణసరిహద్దులో ఈక్వాటోరియల్ గినియా, గాబన్, కాంగో రిపబ్లిక్ ఉన్నాయి. గ్యానియా గల్ఫు అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న బియాఫ్ర బైట్లో కామెరూన్ సముద్రతీర ప్రాంతం ఉంది. కామెరూన్ ఎకోవాసు సభ్య దేశం కానప్పటికీ ఇది దక్షిణ కెమెరానుతో భౌగోళికంగా, చారిత్రాత్మకంగా పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. ఇది ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికా వాయవ్య ప్రాంతంలో కెమెరూన్ వాయవ్య, నైరుతి ప్రాంతాలుగా ఏర్పడింది. కెమరూన్ భౌగోళికంగా పశ్చిమ, మద్య ఆఫ్రికా మధ్య కూడలి స్థానంలో ఉన్న కారణంగా ఈ దేశం కొన్ని మార్లు పశ్చిమ ఆఫ్రికా దేశంగా, కొన్ని మార్లు మద్య ఆఫ్రికా దేశంగా గుర్తించబడుతుంది.

[République du Cameroun] Error: {{Lang}}: text has italic markup (help)
కామెరూన్ గణతంత్రరాజ్యము
Flag of కామెరూన్ కామెరూన్ యొక్క Emblem
నినాదం
"[Paix - Travail - Patrie] Error: {{Lang}}: text has italic markup (help)"  (French)
"Peace - Work - Fatherland"
జాతీయగీతం
[Ô Cameroun, Berceau de nos Ancêtres] Error: {{Lang}}: text has italic markup (help)  (French)
O Cameroon, Cradle of our Forefathers 1

కామెరూన్ యొక్క స్థానం
కామెరూన్ యొక్క స్థానం
రాజధానియావుందే
3°52′N 11°31′E / 3.867°N 11.517°E / 3.867; 11.517
అతి పెద్ద నగరం దువాలా
అధికార భాషలు ఫ్రెంచి, ఇంగ్లీషు
ప్రభుత్వం రిపబ్లిక్
 -  అధ్యక్షుడు పాల్ బియా
 -  ప్రధానమంత్రి ఎఫ్రెయిమ్ ఇనోని
స్వాతంత్ర్యము ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ నుండి 
 -  Date జనవరి 1 1960, అక్టోబర్ 1 1961 
విస్తీర్ణం
 -  మొత్తం 475,442 కి.మీ² (53వది)
183,568 చ.మై 
 -  జలాలు (%) 1.3
జనాభా
 -  జూలై 2005 అంచనా 17,795,000 (58వది)
 -  2003 జన గణన 15,746,179 
 -  జన సాంద్రత 37 /కి.మీ² (167వది)
97 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $43.196 బిలియన్ (84వది)
 -  తలసరి $2,421 (130వది)
జినీ? (2001) 44.6 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.506 (medium) (144వది)
కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ (XAF)
కాలాంశం WAT (UTC+1)
 -  వేసవి (DST) not observed (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .cm
కాలింగ్ కోడ్ +237
1 కామెరూన్ గణతంత్రరాజ్య రాజ్యాంగము లో ఇవ్వబడిన పేర్లు, Article X. The French version of the song is sometimes called "[Chant de Ralliement] Error: {{Lang}}: text has italic markup (help)", as in National Anthems of the World, and the English version "O Cameroon, Cradle of Our Forefathers", as in DeLancey and DeLancey 61.

ఫ్రెంచి, ఆంగ్లం కామెరూన్ అధికారిక భాషలుగా ఉన్నాయి. ఈ దేశం దాని భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యపరంగా తరచుగా " సూక్ష్మరూప ఆఫ్రికా " గా భావించబడుతుంది. సహజమైన భౌగోళికవైవిధ్యాలలో సముద్రతీరాలు, ఎడారులు, పర్వతాలు, వర్షారణ్యాలు, సవన్నాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. దాదాపు 4,100 మీటర్ల (13,500 అడుగులు) ఎత్తులో నైరుతి ప్రాంతంలోని మౌంట్ కామెరూన్, జనాభా పరంగా అతిపెద్ద నగరాలు వౌరీ నది తీరంలో ఉన్న డౌలా, ఆర్థిక రాజధాని, ప్రధాన ఓడరేవు యౌండే, దాని రాజకీయ రాజధానిగా గారౌ ఉన్నాయి. దేశం మకోసా, బికుట్సిల వంటి స్థానిక సంగీత శైలులకు, విజయవంతమైన జాతీయ ఫుట్బాలు జట్టుకు ప్రసిద్ధి చెందింది.

సరస్సు చాడ్ ప్రాంతంలో నివసించిన వేట-వస్తుసేకరణ జీవనాధారంగా జీవించిన బాకా ప్రజలు, ఆగ్నేయ వర్షారణ్యంలో నివసించిన సావో నాగరికతకు చెందిన ప్రజలు ఈ భూభాగంలో ప్రారంభ నివాసులుగా భావిస్తున్నారు. 15 వ శతాబ్దంలో పోర్చుగ్రీసు అన్వేషకులు తీరానికి చేరుకుని ఈ ప్రాంతానికి రియో ​​డోస్ కామారోస్ (ష్రిమ్ప్ రివర్) అనే పేరు పెట్టారు. తరువాత ఇది ఆంగ్లంలో కామెరూన్గా మారింది. 19 వ శతాబ్దంలో ఫులని సైనికులు ఆడంవా ఎమిరేటును స్థాపించారు. పశ్చిమప్రాంతం, వాయువ్యప్రాంతంలోని పలు జాతి సమూహాలు శక్తివంతమైన రాజ్యాలు స్థాపించారు. 1884 లో ఈ ప్రాంతం కామెరూన్ పేరుతో జర్మన్ కాలనీగా మారింది.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ భూభాగం ఫ్రాన్సు, యునైటెడ్ కింగ్డంల మధ్య లీగ్ ఆఫ్ నేషన్స్ మేండేటు విభజించబడింది. రాజకీయ పార్టీ యూనియన్ డెస్ పాపులేషన్సు డు కామెరూన్ (యుపిసి) స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించింది. కానీ దీనిని 1950 లలో ఫ్రాన్సు బహిష్కరించడం స్వతంత్ర పోరాటానికి దారితీసింది 1871 వరకు ఫ్రెంచి, యుపిసి తీవ్రవాద దళాల మధ్య పోరాటం కొనసాగింది. 1960 లో ఫ్రెంచి పాలనలో ఉన్న కెమరూన్ అధ్యక్షుడు అహ్మద్యు అహిడ్జోలో నాయకత్వంలో కామెరూన్ రిపబ్లిక్గా స్వతంత్రం పొందింది. బ్రిటిషు పాలనలో ఉన్న కెమెరోన్సు దక్షిణ భాగం 1961 లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్‌గా ఏర్పడింది. 1972 లో ఈ సమాఖ్య రద్దు చేయబడింది.1972 లో యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్గా పేరు మార్చబడింది. 1984 లో రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్ గా మార్చబడింది. పెద్ద సంఖ్యలో కామేరూనియన్లు వ్యవసాయం జీవనోపాధిగా నివసిస్తున్నారు. 1982 నుండి పాల్ బియాయా తన కామెరూన్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ పార్టీతో పాలక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆంగ్ల భాష మాట్లాడే భూభాగాల నుండి ఉద్రిక్తతలు ఎదురయ్యాయి. ఆంగ్ల భాష మాట్లాడే ప్రాంతాలలో ఉన్న రాజకీయ నాయకులు కామెరూన్ అత్యధిక వికేంద్రీకరణ అవసరమని లేకుంటే పూర్తి విభజన లేదా స్వాతంత్ర్యం (సదరన్ కెమెరోన్స్ నేషనల్ కౌన్సిల్లో ఉన్నట్లు) కావాలని వాదించారు.

చరిత్ర మార్చు

నేటి కెమరూన్ భూభాగంలో నియోలిథిక్ యుగంలో మానవనివాసాలు ప్రారంభం అయ్యాయి. బకా (పిగ్మీస్) వంటి సమూహాలు దీర్ఘకాలం ఈ ప్రాంతంలో నివసించారు.[1] 2000 సంవత్సరాల పూర్వం బంటు ప్రజలు ఇక్కడ నుండి తూర్పు, దక్షిణ, మధ్య ఆఫ్రికాకు వలస వెళ్ళడం ప్రారంభమైనదని విశ్వసిస్తున్నారు.[2] క్రీ.పూ. 500 సంవత్సరాలకు ముందు చాడు సరోవర పరిసరప్రాంతాలలో సావో సంస్కృతి ఉద్భవించింది. ఇది కనెం రాజ్యం రూపుదిద్దుకోవడానికి మూలంగా ఉంది. కనెం తరువాత బోర్ను సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించింది. పశ్చిమప్రాంతంలో రాజ్యాలు, నాయకత్వాలు ఏర్పడ్డాయి. [3]

1472 లో పోర్చుగీసు నావికులు ఈప్రాంతంలోని సముద్రతీరానికి చేరుకున్నారు. వౌరి నదిలో దెయ్యం రొయ్యలు (లెపిడోఫ్థాల్మస్ టర్నర్నానస్) విస్తారంగా ఉన్నాయని గుర్తించారు. ఇది రియో డోస్ కామారోస్ (ష్రిమ్ప్ నది) గా పేరుపొందింది. ఇది ఆంగ్లంలో కామెరూన్గా మారింది. [4] తరువాతి కొన్ని శతాబ్దాల్లో యూరోపియన్ వ్యాపారులు తీరప్రాంతాలతో వర్తకం చేసారు. క్రైస్తవ మిషనరీలు లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నారు.[5]

1800 లలో మార్చు

 
Bamum script is a writing system developed by King Njoya in the late 19th century

19 వ శతాబ్దంలో మొట్టమొదటి మోడిబొ అడామా నాయకత్వంలో ఫులానీ సైనికులు ముస్లిమేతర, పాక్షికంగా ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా జిహాదు పేరుతో దాడి చేసి అడావా ఎమిరాట్ను స్థాపించారు. ఫులని కారణంగా స్థిరపడిన ప్రజలు పారిపోవడం ఒక పెద్ద ప్రజావాహిని స్థలమార్పిడికి దారితీసింది.

బాముమ్ తెగ బాముమ్ లిపి (షు మాం) అని పిలువబడే ఒక లిఖిత వ్యవస్థ ఉంది. 1896 లో సుల్తాను ఇబ్రహీం నజీయా ఈ స్క్రిప్టు వారికి ఇచ్చాడు.[6][7] కెమెరూనులో బాముమ్ స్క్రిప్ట్సు అండ్ ఆర్చివ్సు ప్రాజెక్టు ద్వారా బోధించబడుతుంది.[7] 1868 లో హంబర్గు వోమర్మాను కంపెనీ గిడ్డంగిని నిర్మించడంతో జర్మనీ కామెరూనులో కాలూనడం ప్రారంభమైంది. ఔరి నదీతీరంలో నిర్మించబడింది. తరువాత గుస్టావ్ నాచ్టిగల్ ఈ ప్రాంతాన్ని జర్మనీ సామ్రాజ్యంలో కలపడానికి స్థానిక రాజ్యం ఒకదానితో ఒప్పందం చేసుకున్నాడు.[8] 1884 లో జర్మని సామ్రాజ్యం ఈ భూభాగాన్ని కామెరూన్ కాలనీగా పేర్కొని అంతర్గతంగా స్థిరమైన భూభాగంగా మార్చింది. ఈ దేశంలో జర్మన్లు స్థిరపడడాన్ని వ్యతిరేకించే స్థానిక ప్రజలను జర్మన్లు ​​అడ్డగించారు. జర్మనీ ప్రభావంతో వాణిజ్య సంస్థలు స్థానిక పరిపాలనలనని నియంత్రించడానిని విడిచిపెట్టబడ్డాయి. వాణిజ్య సంస్థలు ఈ రాయితీల ద్వారా నిర్బంధ ఆఫ్రికన్ కార్మికులను ఉపయోగించి ప్రయోజనం చేకూర్చుకున్నాయి. అరటి, రబ్బరు, పామాయిలు, కోకో తోటలలో పనిచేయడానికి నిర్బంధ కార్మికులు ఉపయోగించబడ్డారు.[8] కాలనీ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి వారు ప్రాజెక్టులను ప్రారంభించడానికి నిర్బంధ కార్మికుల కఠినమైన వ్యవస్థపై ఆధారపడ్డారు. దీనిని ఇతర కాలనీల అధికారాలు విమర్శించారు. [9]

1900 లలో మార్చు

మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి కారణంగా కామెరూన్ లీగ్ ఆఫ్ నేషన్స్ మేండేట్ భూభాగం అయింది. 1919 లో ఫ్రెంచి కెమెరోన్, బ్రిటిష్ కామెరూనుగా విభజించబడింది. ఫ్రాన్సు కామెరూన్ ఆర్థిక వ్యవస్థను ఫ్రాంసు ఆర్ధికవ్యవస్థతో సమీకరించింది.[10] మూలధన పెట్టుబడులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, నిర్బంధ కార్మిక వ్యవస్థను సవరించారు.[9]

బ్రిటీషు పొరుగు నైజీరియా నుండి వారి కెమరూన్ భూభాగాన్ని నిర్వహించారు. ఇది వారిని ఒక నిర్లక్ష్యం చేసిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. నైజీరియన్ వలస కార్మికులు సదరన్ కెమెరోనుకు తరలివెళ్లడం ద్వారా నిర్బంధిత కార్మిక వ్యవస్థ పూర్తిగా మూతపడింది.[11] 1946 లో లీగ్ ఆఫ్ నేషన్స్ మేండేట్లు ఐక్యరాజ్యసమితి ట్రస్టీషిపు కౌంసిలుగా మార్చబడ్డాయి. ఫ్రెంచి కామెరూనులో స్వాతంత్ర్యం సమస్య ఒక ముఖ్యమైన అంశంగా మారింది.[10]

1955 జూలై 13 న ఫ్రాన్సు తీవ్రవిప్లవ రాజకీయ పార్టీ అయిన యూనియన్ డెస్ పాపులేషన్స్ డు కామెరూనును బహిష్కరించింది.[12] ఇది సుదీర్ఘ గెరిల్లా యుద్ధం, పార్టీ నేత రూబేన్ ఉమ్ నియోబ్ హత్యలను ప్రేరేరణకు కారణం అయింది. మరింత ప్రశాంతమైన బ్రిటీష్ కమీరోన్లు ఫ్రెంచి కెమెరానులలో తిరిగి కలవడమా లేదా నైజీరియాలో చేరాలా అనే ప్రశ్న ఉదయించింది.[13]

స్వతంత్రం (1960) మార్చు

 
Former president Ahmadou Ahidjo ruled from 1960 until 1982.

1960 జనవరి 1 న ఫ్రెంచి కామెరూన్ ఫ్రాన్సు అధ్యక్షుడు అహ్మద్యు అహిడ్జో ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం పొందింది. 1961 అక్టోబరు 1 న మాజీ బ్రిటిషు కామెరూన్ ఫ్రెంచి కెమెరూనుతో సమైఖ్యమై " ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ కెమెరూన్ " రూపొందించారు. యుపిసి అధ్యక్ష పదవిలో అధికారాన్ని కేంద్రీకరించడానికి అహిడ్జొ ప్రారంభించిన యుద్ధం 1971 లో యుపిసి అణిచివేసిన తరువాత కూడా ఇది కొనసాగింది.[14]

ఆయన రాజకీయ పార్టీ కామెరూన్ నేషనల్ యూనియన్ 1966 సెప్టెంబరు 1 లో ఏకైక చట్టపరమైన రాజకీయ పార్టీగా మారింది. 1972 లో యౌండే నాయకత్వంలోని యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ కామెరూనుకు అనుకూలంగా ఫెడరల్ వ్యవస్థ రద్దు చేయబడింది.[15] అహిద్జో ప్రణాళికాబద్ధమైన ఉదారవాద ఆర్ధిక విధానాన్ని అనుసరించాడు. వాణిజ్య పంటలు, పెట్రోలియం అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. జాతీయ నగదు నిల్వలను, రైతులకు చెల్లించుటకు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం చమురు ధనాన్ని ఉపయోగించింది. అయినప్పటికీ ప్రాజెక్టులను నిర్వహించడానికి అహిద్జొ నైపుణ్యం వ్యక్తులతో కలిసి పనిచేసినందున పలు కార్యక్రమాలు విఫలమయ్యాయి.[16]

 
1982 నుండి పౌల్ బయా దేశంను పాలించింది

1982 నవంబరు 4 న అహిద్జో పదవిని తన రాజ్యాంగ వారసుడైన పాల్ బయాకు అధికారాన్ని వదిలాడు. అయినప్పటికీ అహిడ్జో సి.ఎన్.యు.లో ఉండి బియా అతని మిత్రరాజ్యాల కారణంగా రాజీనామా చేసే వరకు తెరచాటున దేశాన్ని పాలించడానికి ప్రయత్నించాడు. బియా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తరలించడానికి ప్రయత్నించాడు.[17]

1980 - 1990 మద్య కరువు, పతనం ఔతున్న పెట్రోలియం ధరలు, సంవత్సరాలుగా కొనసాగిన అవినీతి, నిర్వహణాలోపం కారణంగా అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం సంభవించింది. పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి ప్రభుయ్వ వ్యయం తగ్గించి కామెరూన్ విదేశీ సహాయాన్ని అందుకున్నది. 1990 డిసెంబరులో బహుళ-పక్ష రాజకీయాల పునఃప్రారంభంతో మాజీ బ్రిటీషు దక్షిణ కెమెరోన్సు బృందాలు సంపూర్ణ స్వయంప్రతిపత్తి కోసం పిలుపునిచ్చాయి.[18]

21 వ శతాబ్ధం మార్చు

2006 జూనులో బస్ససి ద్వీపకల్పంపై ప్రాదేశిక వివాదం గురించి చర్చలు పరిష్కరించబడ్డాయి. సుసంపన్నంగా చమురు నిలువలు కలిగిన కెమెరోనియన్ ద్వీపకల్పం నియంత్రణ కొరకు కామెరూన్ అధ్యక్షుడు పాలు బియాయా, నైజీరియా అధ్యక్షుడు ఒలూస్గన్ ఓబసాన్జో మద్య ఉన్న వివాదాల పరిష్కారం కొరకు సాగిన చర్చలలో ఐఖ్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ కోఫీ అన్నన్ పాల్గొన్నాడు. ఆగష్టు 2006 లో ఉత్తర ప్రాంతం అధికారికంగా కెమెరోనియన్ ప్రభుత్వానికి అప్పగించబడింది. మిగిలిన రెండు ద్వీపకల్పాలు2008 లో 2 సంవత్సరాల తరువాత కామెరూనుకు విడిచిపెట్టబడ్డాయి.[19]

2008 ఫిబ్రవరిలో కామరూన్ డౌలాలో రవాణా సంఘం సమ్మె కారణంగా 31 పురపాలక ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు పెరిగిపోవడంతో ఘోరమైన హింసకు సాక్ష్యంగా నిలిచింది.[20][21]

2014 మేలో చిబాక్ పాఠశాల కిడ్నాపింగ్ నేపథ్యంలో కామెరూన్ అధ్యక్షులు పాల్ బియాయా, చాడ్ ఇద్రీస్ డీబీలు బోకో హారాం మీద యుద్ధాన్ని ప్రకటించి నైజీరియా సరిహద్దుకు దళాలను నియమించారు. [22]

2016 నవంబరు నుండి ఆంగ్ల భాష మాట్లాడే వాయువ్య, నైరుతీ ప్రాంతాల నుండి నిరసనకారులు పాఠశాలలలో, న్యాయస్థానాలలో ఆంగ్ల భాషను నిరంతరం ఉపయోగించాలని పోరాటం చేశారు. ఈ నిరసనల ఫలితంగా ప్రజలు చంపబడ్డారు, వందల మందికి జైలు శిక్ష విధించారు.[23] 2017 లో బయాస్ ప్రభుత్వం నిరసనలు తలెత్తిన ప్రాంతానికి మూడు నెలల వరకు ఇంటర్నెట్ను ఆపివేసింది.[24] సెప్టెంబరులో ఆంగ్లోఫోనిక్ ప్రాంతం స్వతంత్రం కొరకు అండెనోనియా వేర్పాటువాదులు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. ప్రతిస్పందనగా ప్రభుత్వం ఒక సైనిక దాడి చేసింది. తిరుగుబాటు వాయవ్య, నైరుతి ప్రాంతాలలో విస్తరించింది. 2018 వరకు వేర్పాటువాద గెరిల్లాలు, ప్రభుత్వ దళాల మధ్య పోరాటం కొనసాగుతూ ఉంది.[25]

భౌగోళికం మార్చు

 
Cameroon map of Köppen climate classification.
 
Volcanic plugs dot the landscape near Rhumsiki, Far North Region.

కెమెరూన్ వైశాల్యం 4,75,442 చదరపు మీటరు (183,569 చ.మీ.). కామెరూన్ వైశాల్యపరంగా ప్రపంచంలో 53 వ అతిపెద్ద దేశంగా ఉంది.[26] ఇది స్వీడన్ దేశం, కాలిఫోర్నియా రాష్ట్ర కంటే కొంచం అధికంగా ఉంటుంది. కామెరూన్ పాపువా న్యూ గినియాకు పరిమాణంలో సమానంగా ఉండవచ్చు. ఈ దేశం మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో ఉంది.[27] కామెరూన్ 1 ° - 13 ° ఉత్తర అక్షాంశాల మధ్య, 8 ° - 17 ° తూర్పు రేఖాంశం మద్య ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం 12 నాటికల్ మైళ్ళ ప్రాంతం కెమరూన్ నియంత్రణలో ఉంది.

పర్యాటక సాహిత్యం కామెరూన్ను "ఆఫ్రికా సూక్ష్మరూపం" గా వర్ణించింది. ఇందులో ఖండంలో సముద్రతీరం, పర్వతాలు, వర్షారణ్యం, సవన్నాల అన్ని ప్రధాన శీతోష్ణస్థితులు, వృక్షాలను ఉండడమే అందుకు ప్రధానకారణం.[28] పశ్చిమ సరిహద్దులో పొరుగు దేశం నైజీరియా, అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో చాడ్ ఉంది. తూర్పు సరిహద్దులో మద్య ఆఫ్రికన్ రిపబ్లిక్కు, ఈక్వాటోరియల్ గినియా, గాబన్, కాంగో రిపబ్లిక్ ఉన్నాయి.[29]

 
వాజా నేషనల్ పార్కులో ఏనుగులు

కామెరూన్ ఐదు ప్రధాన భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడింది. ఇది భౌతిక, శీతోష్ణస్థితి, వృక్షసంబంధ లక్షణాలచే ప్రత్యేకించబడింది. గల్నీ ఆఫ్ గినీయా నుండి తీరప్రాంత మైదానాలు 15 నుండి 150 కిలోమీటర్ల (9 నుండి 93 మైళ్ళు) వరకు విస్తరించి ఉన్నాయి. [30] సగటు ఎత్తు 90 మీటర్లు (295 అడుగులు) ఉంది.[31] కెమెరూన్‌లో తీవ్రమైన వేడి, తేమ, స్వల్పకాలం పొడి వాతావరణం ఉంటుంది. ఈ బెల్ట్ దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. క్రాస్-సనాగా-బయోకో తీరప్రాంత అడవులలో భాగంగా, భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశాలను కలిగి ఉంది.[32][33]

దక్షిణ కెమెరూన్ పీఠభూమి తీరప్రాంత పీఠభూమి నుండి 650 మీ ఎత్తువరకు ఉంటుంది.[34] భుమద్యరేఖా ప్రాంతపు వర్షారణ్యాలు ఈ ప్రాంతంలో ఆధిఖ్యత చేస్తూ ఉన్నాయి. సముద్రతీరం కంటే ఈ ప్రాంతం పొడి, తడి వాతావరణంతో తేమశాతం తక్కువగా ఉంటుంది. ఇది అట్లాంటిక్ భూమద్యరేఖా సముద్రతీర ప్రాంతంలో ఇది భాగంగా ఉంది.[35]

 
కామెరూన్ ఆడమవా ప్రాంతంలో నగౌండల్ సమీపంలోని గ్రామీణ ప్రాంతం

కామెరూన్ శ్రేణి అని పిలవబడే అపసవ్య పర్వతాలు, కొండలు, పీఠభూములు కామెరూన్ పర్వతంలో మొదలౌతూ ఉంది. కామెరూన్ ఎత్తైన ప్రదేశం 4,095 మీటర్లు (13,435 అడుగులు) [36] కామెరూన్ ఉత్తర సరిహద్దు వద్ద 13 ° 05 ' N. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో పశ్చిమ ఎగువ పీఠభూమిలో తేలికపాటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మౌంట్ కామెరూన్ అగ్నిపర్వత ప్రాంతంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి.[36] అగ్నిపర్వతం ఇక్కడ అగ్నిపర్వతపు సరస్సులను సృష్టించింది. 1986 ఆగస్టు 21 న వాటిలో ఒకటైన నైస్ సరస్సు నుండి వెలువడుతున్న కార్బన్ డయాక్సైడ్ కారణంగా 1,700 - 2,000 మంది చనిపోయారు.[37] ప్రపంచ వైల్డులైఫ్ ఫండ్ ఈ ప్రాంతం లోని క్యామేరోనియన్ హైలాండ్సును అటవీ పర్యావరణ ప్రాంతంగా వర్ణించింది.[38]

దక్షిణ పీఠభూమి ఉత్తరంలో గడ్డి, కఠినమైన ఆడవావా పీఠభూమిగా విస్తరించింది. పశ్చిమ పర్వత ప్రాంతం నుండి విస్తరించి, దేశం ఉత్తర, దక్షిణప్రాంతాల మద్య అవరోధం ఏర్పడుతుంది. దీని సగటు ఎత్తు 1,100 మీటర్లు (3,609 అడుగులు)[34] దాని సగటు ఉష్ణోగ్రత 22 ° సెల్షియసు (71.6 ° ఫారెన్ హీటు) నుండి 25 ° సెల్షియసు(77 ° ఫారెన్ హీటు) వరకు ఉంటుంది. ఇది ఏప్రిల్, అక్టోబర్ మధ్య జూలై, ఆగస్టులలో అధిక వర్షపాతం ఉంటుంది.[39][40] ఉత్తర లోతట్టు ప్రాంతం అమావావా అంచు నుండి లేక్ చాడ్ వరకు విస్తరించి ఉంది. ఈప్రాంతం సగటు ఎత్తు 300 - 350 మీటర్ల (984 నుండి 1,148 అడుగులు) ఉంటుంది.[36] ఇక్కడ సవన్నా పొదలు, గడ్డి అధికంగా ఉంటుంది. ఇది తక్కువ వర్షపాతం, అధిక మధ్యస్థ ఉష్ణోగ్రతలతో ఉన్న శుష్క ప్రాంతంగా ఉంది.[41][42]

సైన్యం మార్చు

The Cameroon Armed Forces, (French: Forces armées camerounaises, FAC) as of 2015, consists of the country's army (French: Armée de Terre), the country's navy (French: Marine Nationale de la République (MNR), includes naval infantry), the Cameroonian Air Force (French: Armée de l'Air du Cameroun, AAC), Fire Fighter Corps, Rapid Intervention Brigade and the Gendarmerie.[43]

Males and females that are 18 years of age up to 23 years of age and have graduated high school are eligible for military service. Those that do so are obliged 4 years of service. There is no conscription in Cameroon, but the government makes periodic calls for volunteers.[43]

ఆర్ధికం, మౌలికసౌకర్యాలు మార్చు

 
Douala, the economic capital of Cameroon
 
A touristic area in Limbe, Cameroon
 
Yaoundé Sport palace

కామెరూన్ తలసరి జి.డి.పి. (పర్చేజింగ్ పవర్ పారిటీ) 2008 లో $ 2,300 అమెరికన్ డాలర్లుగా అంచనా వేయబడింది.[29] ఉప-సహారా ఆఫ్రికాలో అత్యధిక జి.డి.పి. కలిగిన 10 దేశాలలో కెమెరాన్ ఒకటిగా ఉంది.[44] ప్రధాన ఎగుమతి మార్కెట్లలో ఫ్రాన్సు, ఇటలీ, దక్షిణ కొరియా, స్పెయిను, యునైటెడ్ కింగ్డం ప్రాధాన్యం వహిస్తూ ఉన్నాయి.[29] 2035 నాటికి కామెరూన్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతోంది.

కామెరూన్ ఒక దశాబ్దకాలం బలమైన ఆర్థిక పనితీరును కలిగి ఉంది. జి.డి.పి. సంవత్సరానికి 4% సగటున అభివృద్ధి చెందుతూ ఉంది. 2004-2008 కాలంలో ప్రభుత్వ రుణాలు జి.డి.పి.ని 60% - 10% కు తగ్గించాయి. అధికారిక నిల్వలు 3 బిలియన్ డాలర్లకు పైగా తగ్గాయి. [45] బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్సులో,[44] సెంట్రల్ ఆఫ్రికా కస్టమ్స్ అండ్ ఎకనామిక్ యూనియన్, ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనిజేషన్ ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికాలో భాగంగా ఉంది.[46] దీని కరెన్సీ సి.ఎఫ్.ఎ. ఫ్రాంకు.[29]

2014 లో నిరుద్యోగిత 4.4% గా అంచనా వేయబడింది.[47] జనాభాలో మూడవ వంతు మంది 2009 నాటికి (దినసరి ఆదాయం $ 1.25 అమెరికన్ డాలర్లు) అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు.[48] 1980 ల చివర నుండి కామెరూన్ పేదరికాన్ని తగ్గించటానికి, పరిశ్రమలను ప్రైవేటీకరించటానికి, ఆర్ధిక వృద్ధిని పెంచడానికి ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండు ప్రోత్సహించిన కార్యక్రమాలను చేపడుతూ ఉంది.[49] దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.[50]

కామెరూన్ సహజ వనరులు వ్యవసాయం, ఆర్భోరికల్చర్ పెంపకానికి బాగా సరిపోతాయి. 70% ప్రజలు తోటలు, వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నారు. 2009 లో జిడిపిలో వ్యవసాయరగం 19.8% భాగస్వామ్యం వహిస్తుందని అంచనా.[29] రైతులు అత్యధికంగా వ్యవసాయాన్ని సామాన్య ఉపకరణాలు ఉపయోగించి చేస్తున్నారు. వారు తమ మిగులు ఉత్పత్తిని విక్రయిస్తారు. కొందరు వాణిజ్య ఉపయోగం కోసం ప్రత్యేక రంగాలను నిర్వహిస్తారు. పట్టణ కేంద్రాలు వారి ఆహారపదార్ధాల కోసం రైతులు చేస్తున్న వ్యవసాయంపై ఆధారపడతాయి. సారవంతమైన తీరప్రాంత భూములు, వాతావరణం అరటి, కోకో, పాం నూనె, రబ్బరు, టీ విస్తృతమైన వాణిజ్య సాగుకు ప్రోత్సహం అందిస్తున్నాయి. దక్షిణాన కామెరూన్ పీఠభూమిలో కాఫీ, చక్కెర, పొగాకు పండించబడుతున్నాయి. పశ్చిమ పర్వత ప్రాంతాలలో కాఫీ ప్రధాన వాణిజ్య పంటగా ఉంది. సహజ పరిస్థితులు పత్తి, వేరుశెనగ, వరి వంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ ఎగుమతులు కామెరూన్ వ్యవసాయ ధరలు మార్పులకు గురవుతుంది.[29]

 
ఉత్తర కామెరూన్లో తన పశువులను ఒక ఫులని కాపరి తీసుకువెళతాడు

దేశవ్యాప్తంగా పశువుల సంఖ్య అధికరించింది.[51] చేపలవేట 5,000 మందికి జీవనాధారంగా ఉంది. చేపలవేట వార్షికంగా ప్రతి సంవత్సరం 1,00,000 టన్నుల చేపలు అందిస్తుంది.[52][53] వేట మాంసం గ్రామీణ కెమెరూనియన్లకు ప్రధాన ఆహారంగా ఉంది. దేశ పట్టణ కేంద్రాలలో నేడు రుచికరమైన ఆహారంగా ప్రజలకు అభిమాన ఆహారంగా ఉంది. వేటమాసం వాణిజ్యం కామెరూన్లోని వన్యప్రాణులకు ప్రధాన ముప్పుగా ఉండి అటవీ నిర్మూలనకు కారణమౌతూ ఉంది.[54][55]

దక్షిణ వర్షారణ్యం విస్తృతమైన కలప నిల్వలను కలిగి ఉంది. ఇది కామెరూన్ మొత్తం భూభాగంలో 37% ఉంది.[53] అయినప్పటికీ ఈఇ ఆటవీప్రాంతాలను చేరుకోవడం కష్టం. లాగింగ్ అధికంగా విదేశీ యాజమాన్యంలోని సంస్థలచే నిర్వహించబడుతుంది. [53] ఇది ప్రభుత్వానికి సంవత్సరానికి US $ 60 మిలియన్ పన్నులు (1998 నాటికి) అందిస్తుంది. చట్టం స్థిరమైన దోపిడీకి కారణం ఔతున్నాయి. అయినప్పటికీ ఆచరణలో ఈ పరిశ్రమ కామెరూన్లో కనీసంగా నియంత్రించబడి ఉంది.[56]

2009 లో ఫ్యాక్టరీ ఆధారిత పరిశ్రమ జి.డి.పి.లో సుమారు 29.7% కు భాగస్వామ్యం వహిస్తుంది.[29] కామరూన్ పారిశ్రామిక బలం 75% కంటే అధికం డౌలా, బొనబేరిలో ఉంది. కామెరూన్ గణనీయమైన ఖనిజ వనరులను కలిగి ఉంది. అయినప్పటికీ వీటిలో అత్యధికభాగం వెలికితీయబడలేదు. (కామెరూన్లో మైనింగ్ను చూడండి).[49] 1986 నుండి పెట్రోలియం ధరలు పతనం కావడం ఆర్ధికరంగాన్ని మరింత ప్రభావితం చేస్తుంది.[57] రాపిడ్స్ జలపాతాలు దక్షిణ నదులను అడ్డుకుంటాయి. కానీ ఈ ప్రదేశాలు జలవిద్యుత్ అభివృద్ధికి, కామెరూనుకు శక్తిని సరఫరా చేయడానికి అవకాశాలు అందిస్తున్నాయి. ఎడియాలో సనగా నది హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషను ఉంది. మిగిలిన కామెరూను శక్తి కొరకు చమురు-ఆధారిత ఇంజిన్లను ఉపయోగిస్తున్నారు. దేశాల్లో అత్యధిక భాగానికి విద్యుత్తు సరఫరా అందుబాటులో లేదు.[58]

కామెరూన్లో రవాణా తరచుగా కష్టతరమైనదిగా ఉంది. ప్రధాన నగరాలు (వాటిలో ఒకే రహదారి) రహదారిని అనుసంధానించే పరిమితంగా ఉన్న టోల్ రోడ్లు మినహాయించి మిగిలిన రహదారులలో 10% మాత్రమే తారురోడ్లుగా నిర్మించబడ్డాయి.[29] రోడ్ల బ్లాక్లు తరచూ పోలీసులకు, జెండర్మేస్ ప్రయాణీకుల నుండి లంచాలను సేకరించేందుకు అనుమతించటం కంటే ఇతర ప్రయోజనాలను తక్కువగా అందిస్తాయి.[59] తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంట దీర్ఘకాలంగా కొనసాగుతున్న దారిదోపిడి రవాణాకు ఇబ్బందికరంగా మారింది. 2005 నుండి మధ్య ఆఫ్రికన్ రిపబ్లిక్కులో నెలకొని ఉన్న రాజకీయ అస్థిరత్వం తూర్పుప్రాంతంలో ఈ సమస్యను తీవ్రతరం చేసింది.[60]

బహుళ ప్రైవేట్ సంస్థలు నడుపుతున్న ఇంటర్ సిటీ బస్సు సేవలు అన్ని ప్రధాన నగరాలను కలుపుతాయి. కామ్రిల్ రైలు సేవ తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా మార్గంగా ఉన్నాయి. రైలు సేవ పశ్చిమప్రాంతంలో ఉన్న కుంబ నుండి తూర్పు ప్రాంతంలో ఉన్న వెల్బో వరకు, ఉత్తరప్రాంతంలో నగౌండేరే వరకు అందుబాటులో ఉంది.[61] అంతర్జాతీయ విమానాశ్రయాలు డౌలా, యౌండేలలో ఉన్నాయి. మూడవది మెరౌలో నిర్మాణంలో ఉంది.[62] దేశం ప్రధాన ఓడరేవు డౌలాలో ఉంది.[63] ఉత్తరప్రాంతంలో ఉన్న బెన్నౌ నదిలో సీజన్లలో గరోవ నుండి నైజీరియా చేరడానికి నౌకాసౌకర్యాలు నిర్వహించబడుతున్నాయి.[64]

21 వ శతాబ్దం మొదటి దశాబ్దం నుండి పత్రికా స్వేచ్ఛలు మెరుగుపడినప్పటికీ ప్రెస్ రాజకీయ సమూహాలకు కట్టుబడి అవినీతికరంగా ఉంది. [65] ప్రభుత్వ జోక్యం నివారించడానికి వార్తాపత్రికలు సాధారణంగా స్వీయ-సెన్సార్ను కలిగి ఉన్నాయి.[66] ప్రధాన రేడియో, టెలివిజన్ స్టేషన్లు రాష్ట్ర నిర్వహణలో, టెలిఫోన్లు, టెలిగ్రాఫ్లు వంటి ఇతర సమాచారాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి.[67] అయినప్పటికీ 21 వ మొదటి దశాబ్దం నుండి సెల్ ఫోన్ నెట్వర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు నాటకీయంగా పెరిగాయి.[68] ఇవి అధికంగా ఎక్కువగా నియంత్రించబడలేదు.[69]

విద్య, ఆరోగ్యం మార్చు

 
School children in Cameroon.

2013 లో కామెరూను వయోజన అక్షరాస్యత శాతం 71.3% గా అంచనా వేయబడింది. 15-24 ఏళ్ల వయస్సులో అక్షరాస్యత శాతం మగవారికి 85.4%, ఆడవారికి 76.4%.[70] చాలామంది పిల్లలు ప్రైవేటు, మతపరమైన సౌకర్యాలున్న పాఠశాలల కంటే చౌకైన ప్రభుత్వ పాఠశాలలకు అధికంగా హాజరు ఔతుంటారు.[71] విద్యా వ్యవస్థ బ్రిటీషు, ఫ్రెంచి విధానాల మిశ్రమంగా ఉంటుంది.[72] ఆగ్లం, ఫ్రెంచి భాషలలో విద్యాబోధన చేయబడుతుంది.[73] ఆఫ్రికాలో అత్యధిక పాఠశాల హాజరు శాతం ఉన్న దేశాలలో కామెరూన్ ఒకటి.[71] సాంస్కృతిక వైఖరులు, గృహబాధ్యతలు, బాల్య వయసులో వివాహం, చిన్నవసులో గర్భం ధరించడం, లైంగిక వేధింపుల కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు పాఠశాలకు హాజరు కావడం తక్కువగా ఉంటుంది. దక్షిణప్రాంతంలో హాజరు శాతం అధికంగా ఉన్నప్పటికీ,[71] పలువురు ఉపాధ్యాయులు దక్షిణప్రాంతాలలో స్థిరపడడం కారణంగా ఉత్తరప్రాంత పాఠశాలలో సిబ్బంధి కొరత ఏర్పడుతూ ఉంది.[66] 2013 లో ప్రాథమిక పాఠశాల నమోదు రేటు 93.5%.[70]

కామెరూనులో పాఠశాల హాజరు బాల కార్మికులచే ప్రభావితమవుతుంది. వాస్తవానికి, యు.ఎస్. డిపార్టుమెంటు ఆఫ్ లేబరు ది వరల్డు ఫైండిగ్సు ఆధారంగా 5 - 14 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న పిల్లలు 56% మంది బాలకార్మికులుగా ఉన్నారని పిల్లలను పని చేస్తున్నారు, 7 నుంచి 14 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు 53% మంది పాఠశాలకు, పనులకు ఏక కాలంలో హాజరు ఔతున్నారని భావిస్తున్నారు.[74] 2014 డిసెంబరులో " బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ లేబరు అఫెయిర్సు " వెలువరించిన నివేదిక బాలకార్మిక వ్యవస్థ లేదా వెట్టిచాకిరి ద్వారా వస్తువులను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో కెమెరూను ఒకటని తెలియజేస్తుంది. కెమెరూను కొకయా ఉత్పత్తిలో బాలకార్మికులు పనిచేస్తున్నారని నివేదిక తెలియజేస్తుంది. [75]

ఆరోగ్య సంరక్షణ నాణ్యత సాధారణంగా తక్కువగా ఉంటుంది.[76] 2012 లో ఆయుఃపరిమితి 56 ఏళ్ల వయస్సు అంచనా వేయబడింది. ఇందులో ఆరోగ్యవంతంగా గడుతున్న కాలం 48 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేయబడింది.[77] కెమెరూనులో సంతానోత్పత్తి శాతం సగటున 4.8 జననాలు ఉండగా మొదటి శిశువు జననం సగటున 19.7 సంవత్సరాల వయస్సులో ఉంటుందని అంచనా వేయవడింది.[77] ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారంగా కెమరూనులో ప్రతి 5,000 మందికి ఒక్క వైద్యుడు ఉన్నాడని భావిస్తున్నారు.[78] 2014 లో మొత్తం జి.డి.పి. వ్యయంలో కేవలం 4.1% మాత్రమే ఆరోగ్య సంరక్షణకు కేటాయించబడింది.[79] ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆర్థిక కోతలు కారణంగా నిపుణులు కొంతమంది మాత్రమే ఉన్నారు. కామెరూనులో శిక్షణ పొందిన వైద్యులు, నర్సులకు పనిభారం అధికం, చెల్లింపు తక్కువగా ఉండటంతో వారు వెలిపలి దేశాలకు వలసవెళ్లారు. నర్సుల అవసరం ఉన్నప్పటికీ వారికి ఉద్యోగాలు లభించక నిరుద్యోగులుగా ఉన్నారు. వారిలో కొంతమంది స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న కారణంగా వారి నైపుణ్యాలను కోల్పోలేదు.[80] ప్రధాన నగరాల వెలుపల, సౌకర్యాలు తరచుగా మురికిగా, ఉపకరణాలు పేలవంగా ఉంటాయి.[81] 2012 నాటికి కేమెరూనులో ఘోరమైన మూడు వ్యాధులైన ఎయిడ్సు, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, డయేరియల్ డిసీజెస్ ఉన్నాయి.[77] అలాగే డెంగ్యూ జ్వరం, ఫిల్టరియాసిస్, లియిష్మానియాసిస్, మలేరియా, మెనింజైటిస్, స్కిస్టోసోమియాసిస్, నిద్ర అనారోగ్యం అంటు వ్యాధులు ఉన్నాయి.[82] 2016 లో ఎయిడ్సు ప్రాబల్యత శాతం 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల వారిలో 3.8% గా ఉందని అంచనా వేయబడింది.[83] బలమైన అస్తవ్యస్థత కృత్రిమంగా తక్కువచేసి నివేదించబడిన కేసులు ఉండడం మరొక సమస్యగా మారింది.[76] 2016 లో 14 ఏళ్ళలోపు వయస్సు ఉన్న 46,000 మంది పిల్లలు హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్తులుగా ఉన్నారని అంచనా. కామెరూనులో 58% మంది ఎయిడ్సు వ్యాధిగ్రస్తులు ఉన్నారని భావిస్తున్నారు. వారిలో కేవలం 37% మంది ఎయిడ్సు చికిత్సను పొందుతున్నారు. 2016 లో 29,000 మంది పెద్దవారు, పిల్లలు ఎయిడ్సు కారణంగా మరణించారు.[83]

కామేరాన్లో సాంప్రదాయికమైన ఆచారం అయిన ఛాతి ఇస్త్రీ బాలికల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు.[84][85][86][87] 2013 యునిసెఫ్ నివేదిక ఆధారంగా కొన్ని జాతులలో స్త్రీ జననాంగ విరూపణం విస్తృతంగా ఉండకపోయినా, కొన్ని జాతులలో ఆచారంగా ఉందని భావిస్తున్నారు.[88] కామెరూనులో 1% మంది మహిళలు ఎఫ్.జి.ఎం.లో ఉన్నారు. 2014 లో గర్భనిరోధక వ్యాప్తి శాతం 34.4% గా అంచనా వేయబడింది.[89]

గణాంకాలు మార్చు

Population in Cameroon[90]
Year Million
1971 7.0
1990 12.2
2009 19.5
2016 23.4
Source: OECD/World Bank

2016 నాటికి కామెరూను జనసంఖ్య 23,439,189.[29] జీవన కాలపు అంచనా 56 సంవత్సరాలు (పురుషులకు 55.9 సంవత్సరాలు, ఆడవారికి 58.6 సంవత్సరాలు).

ఇటీవలి జనాభా గణాంకాల ఆధారంగా కామెరూనులో పురుషులు 49.4%, మహిళలు (50.6%) ఉన్నారు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు 60% మంది ఉన్నారు. 65 సంవత్సరాల కంటే అధికంగా ఉన్నవారు 3.2% మంది మాత్రమే ఉన్నారు.[29] కామెరూన్ జనాభా దాదాపుగా పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య సమానంగా విభజించబడింది.[91] పెద్ద పట్టణ కేంద్రాలలో పశ్చిమ పర్వత ప్రాంతాలలో, ఈశాన్య మైదానంలో జనాభా సాంద్రత ఎక్కువగా ఉంది.[92] డౌలా, యౌండే, గారౌ అతిపెద్ద నగరాలలో అత్యధిక జనసాంధ్రత ఉంది. ఆడంవా పీఠభూమి, ఆగ్నేయ బెనౌ డిప్రెషన్, దక్షిణ కెమెరాన్ పీఠభూమి అధికభాగం జనసాంధ్రత ఉన్నాయి.[93] వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధారంగా 2013 లో జనన రేటు 4.8 గా ఉంది. జనాభా పెరుగుదల రేటు 2.56% ఉంది. [77]

అధిక జనాభా ఉన్న పశ్చిమ పర్వత ప్రాంతాల ప్రజలు, అభివృద్ధి చెందని ఉత్తర ప్రాంతం ప్రజలు తీరప్రాంత తోటలలో పనిచేయడానికి, ఉపాధి కోసం పట్టణ కేంద్రాలకు వెళుతున్నారు.[94] కార్మికులు తక్కువసంఖ్యలో దక్షిణప్రాతం, తూర్పుప్రాంతాల కలప మిల్లులలో, తోటలలో ఉపాధిని కోరుకుంటూ తరలి వెళుతున్నారు.[95] జాతీయ లింగ నిష్పత్తి సమానంగా ఉన్నప్పటికీ ప్రాథమికంగా ఉపాధి వెతుక్కుంటూ మగవారు ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళడం కొన్ని ప్రాంతాల్లో అసమతుల్య నిష్పత్తులు ఏర్పడడానికి దారితీస్తుంది.[96]

 
ఫార్ నార్త్ ప్రాంతంలోని భూమి, గడ్డితో తయారు చేయబడిన మస్జమ్ గృహాలు

ఒక భార్య విధానం, బహుభార్యాత్వ వివాహం రెండూ కూడా వాడుకలో ఉన్నాయి. సగటు కెమెరోనియన్ కుటుంబం పెద్దదిగా విస్తరించి ఉంటుంది.[97] ఉత్తరప్రాంతం మహిళలు ఇంటిపనులు చేస్తారు, పురుషుల పశువులు మందలను మేపడం లేదా రైతులుగా పని చేస్తారు. దక్షిణప్రాంలో మహిళలలు కుటుంబ ఆహారం కొరకు కృషిచేస్తుంటారు, పురుషులు వేట మాంసం, వాణిజ్య పంటలకు కృషి చేస్తుంటారు. కామెరూనియన్ సమాజం పురుష-ఆధిపత్యం మహిళలపై హింస, వివక్షత సాధారణం.[66][69][98]

కామెరూనులో 230 - 282 వేర్వేరు స్థానిక జాతులు, భాషా సమూహాలలకు చెందిన ప్రజలు దేశం అంతటా విస్తరించి ఉన్నారు.[99][100] ఆదాంవ పీఠభూమి ప్రాంతం ఉత్తర, దక్షిణ విభాగాలకు కూడలిగా ఉంది. ఉత్తరప్రాంతంలో సుడానీసు ప్రజలు అధికంగా మధ్యభాగాలు, ఉత్తర లోతట్టు ప్రాంతాలలో నివసిస్తుంటారు. ఉత్తర కామెరూన్ అంతటా ఫులని ప్రజలు విస్తరించి ఉన్నారు. సరస్సు చాద్ సమీపంలో కొద్ది సంఖ్యలో శూవా అరబ్లు నివసిస్తున్నారు. దక్షిణ కెమరూనులో బంటూ, సెమీ బంటు భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తుంటారు. బంటు-మాట్లాడే సమూహాలు తీర, భూమధ్యరేఖ ప్రాంతాలలో నివసిస్తుంటారు. సెమీ బంటు భాషను మాట్లాడేవారు పాశ్చిమప్రాంతాలలోని పచ్చిక మైదానాలలో నివసిస్తారు. 5,000 గీలే, బకా పిగ్మీ ప్రజలు ఆగ్నేయ, తీరప్రాంత వర్షారణ్యాలను తిరుగుతూ రోడ్డు పక్కన చిన్న స్థావరాలలో నివసిస్తుంటారు.[101] నైజీరియన్లు అతిపెద్ద విదేశీయ సమూహంగా ఉన్నారు.[102]

ఆశ్రితులు మార్చు

2007 లో కామెరూన్ సుమారు 97,400 మందికి ఆశ్రయం ఇచ్చింది. వీరిలో 49,300 మంది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (యుద్ధం ద్వారా అనేకమంది పశ్చిమ యుద్ధాలు),[103] 41,600 చాడుకు చెందినవారు, నైజీరియాకు చెందినవారు 2,900 మంది ఉన్నారు.[104] 2005 నుండి సెంట్రల్ ఆఫ్రికన్ బందిపోట్లు కెమెరోనియన్ పౌరులను కిడ్నాపు చేయడం అధికరించింది.[60] 2014 మొదటి నెలల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కులో తలెత్తిన హింసాకాండ నుండి తప్పించుకుని వేలమంది శరణార్థులు కెమరూను చేరుకున్నారు. [105]

2014 జూన్ 4 న అలర్ట్నెట్ నివేదించింది:

డిసెంబరు నుంచి దాదాపు 90,000 మంది పౌరులు పొరుగున ఉన్న కామెరూనుకు పారిపోయారు. వారంలో 2,000 మంది మహిళలు, మహిళలు, పిల్లలు సరిహద్దు దాటిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎర్తరిన్ కౌసిన్ ఇలా అన్నారు "మహిళలు పిల్లలు వారాల తర్వాత, కొన్ని సమయాలలో నెలలు తర్వాత, రోడ్డు మీద, ఆకలి బాధను భరిస్తూ, ఒక దిగ్భ్రాంతికరమైన స్థితిలో కామెరూన్ వచ్చారు".

[106]

భాషలు మార్చు

ఇంగ్లీషు, ఫ్రెంచు రెండూ కూడా అధికారిక భాషలుగా ఉన్నాయి. అయినప్పటికీ ఫ్రెంచి భాషను అధికమైన ప్రజలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు (80% కంటే ఎక్కువ).[107] అసలైన వలసవాదుల భాష ఉంటున్న జర్మనీ భాషను చాలాకాలం పూర్వమే ఫ్రెంచి, ఆంగ్ల భాషలు అధిగమించాయి. గతంలో బ్రిటీషు పాలిత ప్రాంతాల్లోని కామేరోనియన్ పిడ్జిన్ భాష వాడుకలో ఉంది.[108] 1970 ల మధ్యకాలం నుంచి కామ్ఫ్రాంగ్లాసు అనే ఇంగ్లీషు (ఫ్రెంచి, పిడ్గిను మిశ్రమం) పట్టణ కేంద్రాలలో ప్రజాదరణ పొందింది.[109][110] ప్రభుత్వం ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలో ద్విభాషావిధానాన్నిని ప్రోత్సహిస్తుంది. అధికారిక ప్రభుత్వ పత్రాలు, కొత్త చట్టం, బ్యాలెట్లు, ఇతర భాషలను వ్రాసినవి రెండు భాషల్లో అందించబడతాయి. కామెరూనులో ద్విభాషావాదాన్ని ప్రోత్సహించడానికి చొరవలో భాగంగా, దేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలలో ఆరింటిలో ద్విభాషా భాషావిధానాన్ని అనుసరిస్తూ ఉన్నాయి.

అదనంగా దాదాపుగా 20 మిలియన్ల మంది కామెరూన్లకు 250 ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి.[111] ప్రపంచంలో అత్యంత భాషాపరంగా వైవిధ్యభరితమైన దేశాలలో కెమెరాన్ ఒకటిగా పరిగణించబడుతుంది.[112]

2017 లో ఫ్రాంకోఫోన్ అణచివేతకు వ్యతిరేకంగా ఆంగ్లోఫోన్ జనాభాలో నిరసనలకు ఫలితంగా నిరసనకారులు, ప్రజలు చంపబడడం, వందల మంది ఖైదుచేయబడడం, వేల సంఖ్యలో దేశం వది పారిపోవడం సంభవించాయి.[113]

మతం మార్చు

Religion in Cameroon (Pew Research)[114][115]
religion percent
Catholic
  
40%
Protestant
  
30%
Muslim
  
18%
None
  
6%
Folk
  
3%
Other
  
3%

కామెరూనులో మత స్వేచ్ఛ, వైవిధ్యం అధిక స్థాయిలో ఉంది.[66] క్రైస్తవ మతం ప్రధానమతంగా ఆధిఖ్యతలో ఉంది. జనాభాలో సుమారు మూడింట రెండు వంతుల మంది క్రైస్తవమతాన్ని ఆచరించరిస్తున్నారు. ఇస్లాం మతం గణనీయమైన స్థాయిలో ఉంది. ప్రజలలో వంతు ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నారు. ఇతర సాంప్రదాయిక విశ్వాసాలను అనేకమంది ఆచరించరిస్తున్నారు. ముస్లింలు అధికంగా ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. అయితే క్రైస్తవులు ప్రధానంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. ఈ రెండు విశ్వాసాల అభ్యాసకులను దేశవ్యాప్తంగా చూడవచ్చు.[115] పెద్ద నగరాలలో ఈ రెండు సమూహాలకు చెందిన ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.[115] కామెరూన్లో ముస్లింలలో సుఫీస్ ( సలాఫిస్),[116] షియాలు డినామినేషనల్ ముస్లింలుగా విభజించబడ్డారు.[116][117]

బ్రిటిషు కెమెరనులో భాగమైన ఉత్తర-పశ్చిమ, నైరుతీ రాష్ట్రాల్లోని ప్రజలలో ప్రొటెస్టంట్లు అత్యధిక శాతం ఉన్నారు. దక్షిణ, పశ్చిమంలో ఫ్రెంచి మాట్లాడే ప్రాంతాలలో కాథలిక్కులు అధికంగా ఉన్నారు.[115] దక్షిణ జాతి సమూహాలు ప్రధానంగా క్రిస్టియన్ లేదా సాంప్రదాయిక ఆఫ్రికన్ మతవిశ్వాసాలను అనుసరించడం లేదా రెండింటి ఒక సంక్లిష్ట కలయికను ఆచరిస్తుంటారు. మంత్రవిద్యలను ప్రజలు విస్తారంగా నమ్ముతారు. ప్రభుత్వం ఇటువంటి పద్ధతులను బహిష్కరించింది.[118] మాంత్రికులుగా అనుమానించబడే వారు తరచూ ఆకతాయిమూక హింసకు గురవుతారు.[66] ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సమూహం అన్సార్ అల్-ఇస్లాం ఉత్తర కామెరూనులో పనిచేస్తున్నట్లు నివేదించబడింది.[119]

ఉత్తర ప్రాంతాలలో స్థానికంగా ప్రబలమైన ఫులని జాతి సమూహంలో ఎక్కువగా ముస్లింలు ఉన్నప్పటికీ మొత్తం జనాభా ముస్లింలు, క్రైస్తవులు, దేశీయ మత విశ్వాసాల (ఖైదీ ("పాగాన్" అని పిలుస్తారు) అనుచరులుగా విభజించబడ్డారు.[115] పశ్చిమ ప్రాంతంలోని బాముమ్ జాతి సమూహంలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు.[115] దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు స్థానిక సాంప్రదాయ మతాలు అభ్యసిస్తుంటారు.[115]

1920 ల ప్రారంభంలో నార్వేజియన్ మిషనరీ సొసైటీ మొట్టమొదట కామెరూన్లో ఒక మిషన్ను ఏర్పాటు చేసింది. వారు స్థాపించిన అనేక చర్చిలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ సమయంలో కొందరు మాత్రమే క్రైస్తవులు ఉన్నప్పటికీ ఇప్పుడు చాలామంది ఉన్నారు. స్థానిక ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ ఆఫ్ కామెరూన్, అమెరికన్ ఎల్కా సహకారంతో ఈ సంస్థలలో అనేక ఆస్పత్రులు, పాఠశాలలు స్థాపించారు. ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనైనా అతిపెద్ద నార్వేజియన్ ఆంగుల నిర్మాణాలలో ఒకటిగా Ngaoundéré ఒకసారి నిర్వహించబడింది, 1980 లో అక్కడ నివసిస్తున్న 100 నార్వేజియన్లు. ఈ కల్లోధోల్, బజనేస్, స్టవేన్జోర్డ్, డాన్కేల్ మధ్య అనేక కుటుంబాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. పొరుగును "నోర్వెజ్" (ఫ్రెంచ్లో "నార్వే" గా కూడా పిలుస్తారు).

సంస్కృతి మార్చు

మాద్యమం మార్చు

సంగీతం, నృత్యం మార్చు

 
Dancers greet visitors to the East Region.

కామేరోనియన్ వేడుకలు, పండుగలు, సాంఘిక కలయికలు, కథాకాలక్షేపాలలో సంగీతం, నృత్యం అంతర్భాగంగా ఉన్నాయి.[120][121] అత్యున్నత ప్రమాణాలతో కూడిన దర్శకత్వంలో సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి. వీటిలో పురుషులు, మహిళలు విడివిడిగా నృత్యాలలో పాల్గొంటూ ఉంటాయి.[122] నృత్యాలు స్వచ్ఛమైన వినోదం, మతపరమైన భక్తిని ప్రదర్శిస్తుంటాయి.[121] సాంప్రదాయ సంగీతంలో గాత్రసంగీతం ప్రాధాన్యత వహిస్తుంది. ప్రత్యేక సంగీతప్రదర్శనలో ప్రధాన గాయకునితో బృందం కోరసు పాడుతూ ప్రదర్శనలో భాగస్వామ్యం వహిస్తుంటారు.[123]

సంగీత కారులు చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ ,[124] నృత్యకారులు గంటలు, డ్రమ్సు, మాట్లాడే డ్రమ్స్, వేణువులు, కొమ్ముబూరలు, గిలక్కాయలు, స్క్రాపర్లు, తంత్రీ వాయిద్యాలు, ఈలవాయిద్యాలు, క్సిలోఫోన్లు ధరిస్తారు. సంప్రదాయం అనుసరించి, ప్రాంతాలను అనుసరించి నృత్యరీతులు మారితూ ఉంటాయి. కొందరు ప్రదర్శకులు హార్పు వాయిద్యంతో కలిసి పూర్తి పాటలు పాడుతూ ఉంటారు.[123][125] ప్రసిద్ధ సంగీత శైలిలో అంబాస్సే బే (తీరప్రాంతం), ఆస్కికో (బస్సా ప్రాంతం), మంగమ్బెయు (బంగాంగ్తె ప్రాంతం), త్సామసి (బామైల్కే) ఉన్నాయి. [126]

ఆంగ్లోఫోన్ కెమెరోనియన్ ప్రదర్శనకారులను నైజీరియా సంగీతం ప్రభావితం చేసింది. ప్రిన్స్ నికో మ్బార్కా "స్వీట్ మదర్" అత్యధికంగా అమ్ముడైన ఆఫ్రికన్ రికార్డుగా చరిత్ర సృష్టించింది.[127]

సంగీతంలో మకోస్సా, బికుట్సి అత్యంత ప్రజాదరణ పొందాయి. డౌలాలో జానపద సంగీతం హైలైఫ్, సోల్, కాంగో సంగీతం సమ్మిళితం చేసి మకోసా అభివృద్ధి చేయబడింది. 1970-1980 లలో మను దిబాంగో, ఫ్రాన్సిస్ బెబీ, మోని బిలే, పెటిట్-పేస్ వంటి సంగీతకారులు మకోసా సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించి దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. యుడోండ్లో యుద్ధ సంగీతంగా బ్యూకుషి సంగీతం పుట్టింది. 1940 వ దశకంలో అన్నే-మేరీ నజీ వంటి కళాకారులు దీనిని ప్రముఖ నృత్య సంగీతంగా అభివృద్ధి చేశారు. 1960 లు, 1970 లు 1980 లలో మామా ఓహాంద్జా, లెస్ టేట్స్ బ్రూలీలు వంటి ప్రదర్శకులు దీనికి అంతర్జాతీయంగా ప్రజాదరణ తీసుకువచ్చారు.[128][129]

ఆహారం మార్చు

 
A woman weaves a basket near Lake Ossa, Littoral Region. Cameroonians practise such handicrafts throughout the country.

ఆహారసంస్కృతి ప్రాంతాలవారిగా మారుతూ ఉంటుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా సంపూర్ణమైన సాయంత్రం భోజనం తప్పనిసరిగా ఉంటుంది. ఆహారంలో కొబ్బరి, మొక్కజొన్న, కాసావా (మనియోక్), చిరుధాన్యాలు, ఆకుకూరలు, బంగాళాదుంపలు, బియ్యం లేదా దుంపలు వంటి ఆహారాలు ప్రాధాన్యత వహిస్తుంటాయి. ఇది సాస్, సూప్, లేదా గ్రీన్స్, వేరుశెనగ, పామాయిల్ లేదా ఇతర పదార్ధాలతో వడ్డించబడుతుంది.[130] మాంసం, చేప ప్రజాదరణ పొందినవి కానీ ఖరీదైనవి. కోడిమాసం వంటివి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తయారు చేసుకుంటారు.[131] వంటకాలు చాలా వేడిగా ఉప్పు, ఎర్ర మిరియాలు సాస్, మాగిలతో మసాలా పెట్టి ఉంటాయి.[132][133][134]

కత్తులవాడకం సాధారణం అయినప్పటికీ ఆహారం సాంప్రదాయకంగా కుడి చేతితో తింటారు. అల్పాహారంగా మిగిలిపోయిన రొట్టె, పండ్లను కాఫీ లేదా టీ లతో తీసుకుంటారు. సాధారణంగా అల్పాహారం గోధుమ పిండి నుండి తయారుచేసే పఫ్-పఫ్ (డోనట్స్), అరటి పండ్ల నుండి అక్ర్రా బనానా, పిండి తయారు చేయబడుతుంది. బీన్ కేక్సు పలు ఇతర ఆహారాలు ఉంటాయి. వాటి నుండి తయారుచేసిన అక్ర అరనం వంటి వివిధ ఆహార పదార్ధాల నుండి తయారు చేయబడుతుంది. వీధిలో విక్రయించే వ్యాపారుల ద్వారా పట్టణ ప్రాంతాలలో చిరుతిండ్లు కొనుగోలు చేయవచ్చు.[135][136]

నీరు, తాటికల్లు, చిరుధాన్యాలతో తయారుచేసే బీరు సంప్రదాయ భోజన పానీయాలుగా ఉంటాయి. బీరు, సోడా, వైను ప్రజాదరణ పొందుతున్నాయి. 3 ఎక్క్ష్పోర్టు బీరు " నేషనల్ సాకర్ టీమ్ " అధికారిక పానీయంగా ఉంది.

ప్రాంతీయ కళలు, హస్థకళలు మార్చు

దేశవ్యాప్తంగా సంప్రదాయ కళలు, హస్థకళలు వాణిజ్య, అలంకార, మత ప్రయోజనాలకు ఉపయోగించబడుతున్నాయి. వీటిలో వుడ్కార్వింగులు, శిల్పాలు ప్రత్యేకంగా ఉంటాయి.[137] పాశ్చాత్య పర్వతప్రాంతాలలో ఉన్న అధిక-నాణ్యమైన మట్టి కుండలు, మట్టిపాత్రలు చేయడానికి ఉపయోగంగా ఉంటుంది.[121] ఇతర చేతిపనులలో బుట్టలు నేయడం, పూసల అల్లికలు, ఇత్తడి, కంచు, కలాబాష్ శిల్పం, పెయింటింగు, ఎంబ్రాయిడరీ, తోలు పని ప్రాధాన్యత వహిస్తున్నాయి. సాంప్రదాయ గృహ నిర్మాణాలకు స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగిస్తుంటారు. సంచార మెబోరో తాత్కాలిక కలప, ఆకు ఉపయోగించి గుడిసెలను నిర్మించుకుంటారు. దక్షిణ ప్రజల దీర్ఘచతురస్రాకార మట్టి- సిమెంటు, టిన్ను వంటి పదార్ధాల నుంచి తయారు చేసిన నివాసాలు అధికంగా ఉంటాయి.[138] స్వతంత్ర సాంస్కృతిక సంస్థలు సమకాలీన కళలను (డౌల్ఆర్ట్, ఆఫ్రికెర), కళాకారులను (ఆర్ట్ వాష్, అట్లేయర్ వైకింగ్, ఆర్ట్ బేకర్) ప్రోత్సహిస్తున్నారు.[139]

సాహిత్యం మార్చు

కామెరోనియన్ సాహిత్యం యూరోపియన్, ఆఫ్రికన్ ఇతివృత్తాలపై కేంద్రీకృతమై ఉంది. లూయిస్-మేరీ పౌకా, సాన్కి మైమో వంటి కాలనీల కాలం నాటి రచయితలు యూరోపియన్ మిషినరీ సమాజాలలో విద్యాభ్యాసం చేసారు. వారు దానిని కెమెరూనును ఐరోపా సంస్కృతిలోకి, ఆధునిక ప్రపంచంలోకి తీసుకొచ్చే మార్గంగా వాడుకున్నారు.[140] రెండో ప్రపంచ యుద్ధం తరువాత మోగో బేటి, ఫెర్డినాండ్ ఓయోనో వంటి రచయితలు వలసవాదాన్ని విశ్లేషించారు విమర్శిస్తూ అసమానతలను తిరస్కరించారు.[141][142][143]

చలన చిత్రాలు, సాహిత్యం మార్చు

స్వతంత్రం వచ్చిన కొంతకాలం తర్వాత, జీన్-పాల్ నగస్సా థెరేసే సీతా-బెల్లా వంటి చిత్ర నిర్మాతలు ఇలాంటి ఇతివృత్తాలను అన్వేషించారు. [144][145] 1960 లో మాంగో బేటి, ఫెర్డినంద్ ఒయొనొ, ఇతర రచయితలు వలసపాలన తరువాత కాలం, ఆఫ్రికన్ అభివృద్ధి సమస్యలు, ఆఫ్రికన్ గుర్తింపును పునరుద్ధరించడంజ్ గురించి అన్వేషించారు.[146] 1970 మద్యకాలంలో జీన్ - పియర్రె డికొంక్యూ పిపా, డానియేల్ కంవా సంప్రదాయ, వలసపాలన తరువాత సమాజిక సంఘర్షణల ఇతివృత్తంతో చలనచిత్రాలు చిత్రీకరించారు. తరువాత రెండు దశాబ్ధాల కాలం కెమరూనియన్ కథాంశాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించారు.[147]

క్రీడలు మార్చు

 
Cameroon faces Germany at Zentralstadion in Leipzig, 17 November 2004.

జాతీయ విధానం క్రీడలను బలంగా సమర్ధిస్తుంది. సాంప్రదాయ క్రీడలు కానో రేసింగ్, కుస్తీ, 40 కిమీ (25 మైళ్ళు) పొడవైన పర్వతం మౌంట్ కామరూన్ రేసులో వార్షికంగా వందల మంది క్రీడాకారులు పాల్గొంటాయి.[148] వింటర్ ఒలింపిక్సులో పాల్గొన్న కొన్ని ఉష్ణమండల దేశాలలో కామెరూన్ ఒకటి.

కామెరూనులో క్రీడలను ఫుట్ బాల్ ఆధిక్యం చేస్తూ ఉంది. అమెచ్యూర్ ఫుట్ బాల్ క్లబ్లు జాతిపరమైన మార్గాలలో లేదా కార్పొరేట్ స్పాన్సర్లచే నిర్వహించబడతాయి. 1982 - 1990 ప్రపంచ కప్పులలో శక్తివంతగా నిలిచిన తరువాత జాతీయ జట్టు ఆఫ్రికాలో అత్యంత విజయవంతమైన జట్టుగా మారింది. కామెరూన్ ఐదు ఆఫ్రికన్ కప్పు నేషన్స్ టైటిల్స్, 2000 ఒలింపిక్సులో బంగారు పతకాన్ని గెలుచుకుంది. [149]

నవంబరు-డిసెంబరు 2016 లో మహిళల ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ క్రీడలకు కెమెరూన్ ఆతిథ్యం ఇచ్చింది.[150] మహిళల ఫుట్ బాల్ జట్టును "అధిగమించ శక్యం కాని ఆడసింహాలు " అని పిలుస్తారు.

మూలాలు మార్చు

 1. DeLancey and DeLancey 2.
 2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; history అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Njung అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. Pondi, J. E. (1997). "Cameroon and the Commonwealth of nations". The Round Table. 86 (344): 563–570. doi:10.1080/00358539708454389.
 5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Fanso అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 6. DeLancey and DeLancey 59
 7. 7.0 7.1 "Bamum". National Museum of African Art, Smithsonian Institution. Retrieved 29 January 2012.
 8. 8.0 8.1 "historyworld".
 9. 9.0 9.1 DeLancey and DeLancey 125.
 10. 10.0 10.1 DeLancey and DeLancey 5.
 11. DeLancey and DeLancey 4.
 12. Terretta, M. (2010). "Cameroonian Nationalists Go Global: From Forest Maquis to a Pan-African Accra". The Journal of African History. 51 (2): 189–212. doi:10.1017/S0021853710000253.
 13. Takougang, J. (2003). "Nationalism, democratisation and political opportunism in Cameroon". Journal of Contemporary African Studies. 21 (3): 427–445. doi:10.1080/0258900032000142455.
 14. DeLancey and DeLancey 6.
 15. DeLancey and DeLancey 19.
 16. DeLancey and DeLancey 7.
 17. DeLancey and DeLancey 8.
 18. DeLancey and DeLancey 9.
 19. Cameroon: Presidents Obasanjo And Biya Shake Hands on Disputed Bakassi Peninsula, Allafrica, 13 June 2006
 20. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Nkemngu అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 21. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Matthews అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 22. "Cameroon, Chad Deploy Troops to Fight Boko Haram – Nigeria". ReliefWeb. Retrieved 10 June 2014.
 23. http://edition.cnn.com/2016/12/15/world/cameroon-protesters-deaths/index.html.
 24. "Cameroon internet shut for separatists". BBC News. 2 October 2017 – via www.bbc.co.uk.
 25. "Burning Cameroon: Images you're not meant to see". BBC News. 25 June 2018 – via www.bbc.co.uk.
 26. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Demographic Yearbook అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 27. "Country Profiles". UCLA African Studies Center. Retrieved 12 April 2013.
 28. DeLancey and DeLancey 16.
 29. 29.00 29.01 29.02 29.03 29.04 29.05 29.06 29.07 29.08 29.09 "Cameroon". World Factbook. CIA. Archived from the original on 15 మే 2020. Retrieved 2 November 2016.
 30. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Fomensky అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 31. Neba 14.
 32. Neba 28.
 33. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Extremes అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 34. 34.0 34.1 Neba 16.
 35. "ICAM of Kribi Campo" (PDF). UNIDO. Archived from the original (PDF) on 6 మే 2013. Retrieved 16 డిసెంబరు 2018.
 36. 36.0 36.1 36.2 Neba 17.
 37. DeLancey and DeLancey 161 report 1,700 killed; Hudgens and Trillo 1054 say "at least 2,000"; West 10 says "more than 2,000".
 38. "Cameroon Highlands Forests". WWF. Archived from the original on 1 మే 2013. Retrieved 16 డిసెంబరు 2018.
 39. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Gwanfogbe అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 40. Neba 29.
 41. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Green అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 42. "Country Files: Cameroon". UN Food and Agriculture Organization. Retrieved 3 March 2013.
 43. 43.0 43.1 "AFRICA :: CAMEROON". The World Factbook. Central Intelligence Service. Archived from the original on 15 మే 2020. Retrieved 28 December 2015.
 44. 44.0 44.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Musa Biya plan అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 45. "Cameroon Financial Sector Profile". MFW4A. Archived from the original on 13 మే 2011. Retrieved 24 September 2011.
 46. "The business law portal in Africa". OHADA. Retrieved 22 March 2009.
 47. "World Statistics Pocketbook – Cameroon". United Nations Statistics Division. UN data. Retrieved 2 November 2016.
 48. "Table 3: Human and income poverty" (PDF). Human Development Indices. UN. p. 35. Archived from the original (PDF) on 19 డిసెంబరు 2008. Retrieved 16 డిసెంబరు 2018.
 49. 49.0 49.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; State Dept అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 50. "Cameroon Business Mission Fact Sheet 2010–2011" (PDF). Netherlands-African Business Council. 2011. Archived from the original (PDF) on 2013-10-13. Retrieved 2018-12-16.
 51. "Cameroon livestock production map". FAO. Archived from the original on 5 జూన్ 2013. Retrieved 16 డిసెంబరు 2018.
 52. Som, Julienne. "Women's role in Cameroon fishing communities". FAO. Archived from the original on 3 జూన్ 2013. Retrieved 12 April 2013.
 53. 53.0 53.1 53.2 "Cameroon". AWF. 2013-02-28. Retrieved 12 April 2013.
 54. "UK project tackles bushmeat diet". BBC. 10 April 2002. Retrieved 12 April 2013.
 55. "Cameroon's bushmeat dilemma". BBC. 14 March 2008. Retrieved 12 April 2013.
 56. "Logging in the Green Heart of Africa". WWF. Archived from the original on 8 June 2012. Retrieved 12 April 2013.
 57. Cossé, Stéphane (2006). "Strengthening Transparency in the Oil Sector in Cameroon" (PDF). IMF. Retrieved 12 April 2013.
 58. Prevost, Yves. "Harnessing Central Africa's Hydropower Potential" (PDF). Climate Parliament. Archived from the original (PDF) on 2014-04-27. Retrieved 2018-12-16.
 59. Hudgens and Trillo 1036.
 60. 60.0 60.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Musa Gunmen అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 61. "Getting around Cameroon". World Travel Guide. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 12 ఏప్రిల్ 2013.
 62. "Equipment for the Future Maroua International Airport". Cameroon Online. 3 April 2013. Archived from the original on 9 మే 2013. Retrieved 16 డిసెంబరు 2018.
 63. "SOS Children's Village Douala". SOS Children's Villages. Retrieved 12 April 2013.
 64. DeLancey and DeLancey 68.
 65. "Cameroon – Annual Report 2007".
 66. 66.0 66.1 66.2 66.3 66.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Human Rights Report అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 67. Mbaku 20.
 68. Mbaku 20–1.
 69. 69.0 69.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Freedom House అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 70. 70.0 70.1 "Statistics". UNICEF (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 24 డిసెంబరు 2017. Retrieved 4 February 2018.
 71. 71.0 71.1 71.2 Mbaku 15.
 72. DeLancey and DeLancey 105–6.
 73. Mbaku 16.
 74. 2013 Findings on the Worst Forms of Child Labor -Cameroon Archived 2015-03-03 at the Wayback Machine. Dol.gov. Retrieved 29 June 2015.
 75. List of Goods Produced by Child Labor or Forced Labor Archived 2015-06-10 at the Wayback Machine. Dol.gov. Retrieved 29 June 2015.
 76. 76.0 76.1 DeLancey and DeLancey 21.
 77. 77.0 77.1 77.2 77.3 "Cameroon: WHO Statistical Profile" (PDF). World Health Organization. January 2015.
 78. "3 medical marvels saving lives". CNN. Retrieved 18 November 2013.
 79. "UNdata | country profile | Cameroon". data.un.org. Retrieved 4 February 2018.
 80. Rose Futrih N. Njini (December 2012). "The need is so great". D+C Development and Cooperation/ dandc.eu.
 81. West 64.
 82. West 58–60.
 83. 83.0 83.1 "Cameroon". www.unaids.org. Retrieved 4 February 2018.
 84. Joe, Randy. (23 June 2006) Africa | Cameroon girls battle 'breast ironing'. BBC News. Retrieved 29 June 2015.
 85. BBC World Service – Outlook, Fighting 'Breast Ironing' in Cameroon. Bbc.co.uk (16 January 2014). Retrieved 29 June 2015.
 86. Campaigners warn of 'breast ironing' in the UK – Channel 4 News. Channel4.com (18 April 2014). Retrieved 29 June 2015.
 87. Bawe, Rosaline Ngunshi (24 August 2011) Breast Ironing : A harmful traditional practice in Cameroon. Gender Empowerment and Development(GeED)
 88. UNICEF 2013 Archived 2015-04-05 at the Wayback Machine, p. 27.
 89. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Lantum అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 90. "CO2 Emissions from Fuel Combustion: Population 1971–2009". IEA. Archived from the original (XLS) on 12 అక్టోబరు 2009. Retrieved 24 September 2011. PDF Archived 6 జనవరి 2012 at the Wayback Machine pp. 87–89.
 91. West 3.
 92. Neba 109–11.
 93. Neba 111.
 94. Neba 105–6.
 95. Neba 106.
 96. Neba 103–4.
 97. Mbaku 139.
 98. Mbaku 141.
 99. Neba 65, 67.
 100. West 13.
 101. Neba 48.
 102. Neba 108.
 103. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; RCross అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 104. "World Refugee Survey 2008". U.S. Committee for Refugees and Immigrants. 19 June 2008. Archived from the original on 2 October 2008.
 105. "Cameroon: Location of Refugees and Main Entry Points (as of 02 May 2014) – Cameroon". ReliefWeb. Retrieved 8 June 2014.
 106. Nguyen, Katie (4 June 2014). "Cameroon: Starving, Exhausted CAR Refugees Stream Into Cameroon – UN". allAfrica.com. Retrieved 8 June 2014.
 107. Nathan, Fernand (ed.) (2010) La langue francaise dans le monde en 2010 Archived 2012-06-03 at the Wayback Machine, ISBN 2098824076.
 108. Neba 94.
 109. DeLancey and DeLancey 131
 110. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Niba అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 111. Kouega, Jean-Paul. 'The Language Situation in Cameroon', Current Issues in Language Planning, vol. 8/no. 1, (2007), pp. 3-94.
 112. Pereltsvaig, A. (19 January 2011). Linguistic diversity in Africa and Europe - Languages Of The World. Retrieved 30 October 2016, from http://www.languagesoftheworld.info/geolinguistics/linguistic-diversity-in-africa-and-europe.html
 113. Deaths and detentions as Cameroon cracks down on anglophone activists The Guardian, 2018
 114. Pew Research Center's Religion & Public Life Project: Cameroon Archived 2018-08-02 at the Wayback Machine. Pew Research Center. 2010.
 115. 115.0 115.1 115.2 115.3 115.4 115.5 115.6 "July–December, 2010 International Religious Freedom Report – Cameroon". US Department of State. 8 April 2011. Retrieved 12 November 2011.
 116. 116.0 116.1 "The veil in west Africa: Banning the burqa: Why more countries are outlawing the full-face veil". The Economist. 13 February 2016. Retrieved 15 February 2016.
 117. Pew Forum on Religious & Public life. 9 August 2012. Retrieved 29 October 2013
 118. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Geschiere అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 119. Boko Haram timeline: From preachers to slave raiders. BBC. 15 May 2013. retrieved 19 June 2013
 120. Mbaku 189
 121. 121.0 121.1 121.2 West 18.
 122. Mbaku 204.
 123. 123.0 123.1 Mbaku 189.
 124. Mbaku 191.
 125. West 18–9.
 126. DeLancey and DeLancey 184.
 127. Mbaku 200.
 128. DeLancey and DeLancey 51
 129. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Nkolo అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 130. West 84–5.
 131. Mbaku 121–2.
 132. Hudgens and Trillo 1047
 133. Mbaku 122
 134. West 84.
 135. Mbaku 121
 136. Hudgens and Trillo 1049.
 137. West 17.
 138. Mbaku 110–3.
 139. Mulenga, Andrew (30 April 2010). "Cameroon's indomitable contemporary art". The Post. Archived from the original on 11 మార్చి 2014. Retrieved 17 డిసెంబరు 2018.
 140. Mbaku 80–1
 141. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Fitzpatrick అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 142. Mbaku 77, 83–4
 143. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Volet అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 144. DeLancey and DeLancey 119–20
 145. West 20.
 146. Mbaku 85–6.
 147. DeLancey and DeLancey 120.
 148. West 127.
 149. West 92–3, 127.
 150. Shearlaw, Maeve (2016-11-20). "Africa Women Cup of Nations kicks off in Cameroon". The Guardian.
"https://te.wikipedia.org/w/index.php?title=కామెరూన్&oldid=3949181" నుండి వెలికితీశారు