2015 వోటుకి నోటు ఘటన
2015లో ఓటుకి డబ్బు అంద చేస్తూ తెలుగుదేశం నాయకులు దొరికిపోవటంతో ఈ వోటుకి నోటు [1] అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నికల్లో, ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వయంగా రూ.50 లక్షలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన్ని కోర్టు ముందు హాజరు పరిచి, జైలుకి పంపించటం జరిగింది. తర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యుని తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంభాషణ అని చెప్పబడిన ఫోన్ సంభాషణలు నాటకీయంగా బయట పడి మాధ్యమలలో ప్రసారం అయ్యాయి[2][3]
తెలుగుదేశం పార్టీ ఇది రాజకీయ పగదీర్చుకోవటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్దేశనలో వైఎస్సార్‌సీపీతో కలసి ఆడిన నాటకంలో భాగమంది.[4][5] ఈ కేసు విషయమై ఉమ్మడి హైకోర్టు, సరిపోయినంత సాక్ష్యాలు లేనందున రేవంత్ రెడ్డి, ఇతర ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది.[6]
నేపధ్యం
మార్చుతెలంగాణ లో శాసనసభ నుంచి కౌన్సిల్ కోసం ఎన్నికలకు తెర లేచింది. ఆరు స్థానాలకు గాను నోటిఫికేషన్ పడింది. టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, తెలుగుదేశంనుంచి ఒకరు బరిలోకి దిగారు. తెలుగుదేశానికి, దాని మిత్ర పక్షమైన బీజేపీకి కలిపి .. సరిపడినన్ని ఓట్లు లేవు. దీంతో ఇతర పక్షాల నుంచి ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సి ఎన్నికలు జరుగుతున్నవి ఒక్కో ఎమ్మేల్సిని ఎన్నుకోవడానికి 17 మంది ఎమ్మెల్యేలు అవసరం. అలా అప్పుడు అధికార పార్టి తెలంగాణా రాష్ట్ర సమితికి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టికి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం ఒక్క ఏమ్మేల్సిని గెలిపించుకోవాలన్నా తెలుగుదేశం పార్టికి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కొనడానికి పెద్ద కసరత్తే జరిగింది.
ఘటన
మార్చుఇతర పార్టీల శాసన సభ్యులకు వల వేస్తున్నారని తెలియటంతో ఆయా పార్టీల నేతలు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే స్టీఫెన్ సన్ దగ్గర హై డ్రామా చోటు చేసుకొంది. టీడీపీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఒక సహాయకునితో కలిసి ఆయన్ని కలిశారు. రేవంత్ సూచనల మేరకు ఆ సహాయకుడు రూ.50లక్షల రూపాయిల నోట్ల కట్టలను అందించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో రేవంత్ చేసిన సంభాషణలు కీలకంగా మారాయి. స్టీఫెన్ సన్ తో రేవంత్ రెడ్డి [7] చాలా విషయాలు మాట్లాడినట్లు వీడియో లో రికార్డు అయ్యాయి. తెలంగాణలో తాను యాక్టివ్ గా ఉన్న నేతను అని ఆయన చెప్పుకొని వచ్చారు. ముఖ్యమైన పనులకు బాస్ తననే పంపిస్తారని చెప్పారు. అన్ని విషయాలు బాస్ చూసుకొంటారని నమ్మ పలికారు. ఇప్పటికే డబ్బు విషయం అందించానని చెప్పుకొచ్చారు. బాస్ సూచన మేరకే అన్ని చేస్తున్నట్లు చెప్పారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. తర్వాత ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యాయి.
నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ సన్ వాదనల ప్రకారం చంద్రబాబే ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు తెలుస్తోంది.[8]
తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు కాగానే అందరి దృష్టి ఆ పార్టీ కార్యకలాపాల మీదకు వెళ్లింది. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది ప్రజా ప్రతినిధుల్ని కొనుగోలుచేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రాదేశిక సభ్యుల్ని కొనుగోలు చేసి, జడ్పీ మండల అధ్యక్ష పదవుల్ని దక్కించుకొందన్న మాట ఉంది[ఆధారం చూపాలి]. అదే క్రమంలో తెలంగాణలో కూడా ముందుకు వెళుతోందా అన్న మాట వినిపించింది. ఈ లోగా చంద్రబాబు నాయుడు స్వయంగా స్టీఫెన్ సన్ తో మాట్లాడారంటూ ఒక ఆడియో సంభాషణటేపు వెలుగు చూసింది.
సెబాస్టియన్ అని చెప్పబడుతున్న ప్రధానవ్యక్తి :- హలో
- చంద్ర బాబు మనిషిగా చెప్పబడుతున్న మొదటి వ్యక్తి :- ఆ యా బ్రదర్
ప్రధానవ్యక్తి :- సర్
- మొదటి వ్యక్తి :- అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్
ప్రధానవ్యక్తి :- ఒకే సర్
- చంద్రబాబుగా చెప్పబడుతున్న రెండవవ్యక్తి :- హలో
ప్రధాన వ్యక్తి :- సర్ గుడ్ ఈవెనింగ్ సర్
- రెండవవ్యక్తి:- ఆ గుడ్ ఈవెనింగ్ బ్రదర్ హౌ ఆర్ యు
ప్రధాన వ్యక్తి :- ఫైన్ సర్ థ్యాంక్ యు
- రెండవవ్యక్తి :- మనవాళ్ళు అదే దే బ్రీఫుడు మీ
ప్రధాన వ్యక్తి :- యా సర్
- రెండవవ్యక్తి :- ఐ యాం విత్ యు డోంట్ బాదర్
ప్రధాన వ్యక్తి :- రైట్
- రెండవవ్యక్తి :- ఫర్ ఎవెరి థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్
ప్రధాన వ్యక్తి :- యా సర్ రైట్
- రెండవ వ్యక్తి :- ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్
ప్రధాన వ్యక్తి :- ఎస్ సర్
- రెండవ వ్యక్తి :- దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టూ గెధెర్
ప్రధాన వ్యక్తి :- రైట్
- రెండవ వ్యక్తి :- థ్యాంక్ యు
పరిణామాలు
మార్చుటీవీ చానెల్స్ లో పదే పదే ప్రసారం అవుతున్న సంభాషణలమీద తెలుగుదేశం పార్టీ నష్ట నివారణ చర్యలు మొదలెట్టింది. ముందుగా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల్ని కలిసి వచ్చారు. అక్కడ నుంచి సానుకూల స్పందనకానీ, ప్రకటనలుకానీ వెలువడలేదు. పైగా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమనికేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఇటు, గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ వెళ్లి నివేదిక సమర్పించారు దీనిపై కోపించిన టీడీపీ మంత్రులు, నాయకులు గవర్నర్ మీద తిట్లు మొదలెట్టారు. ఆయన్ని రక రకాలుగా తిట్టడం చర్చనీయాంశంగామారింది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ అంతటా భావోద్వేగాల్ని రెచ్చ గొట్టారు. ఇది ఆంధప్రదేశ్ ప్రతిష్టకుసంబంధించిన అంశంగా తెలుగుదేశంశ్రేణులు మార్చేశాయి. హైదరాబాదు లో ఆంధ్రులకు రక్షణ లేదంటూ ప్రచారం చేయటంతో పాటు ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచారం కొంత వరకు ప్రజల్లోకి పంపించగలిగారు.
రాష్ట్రమంతా దీనిమీదేచర్చించుకోవటతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని సీరియస్ గా తీసుకొన్నారు. కొన్ని రోజుల పాటు దీనిమీదే పూర్తి దృష్టి పెట్టారు. పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించుకొని దీని మీదేసమీక్షలు జరిపారు. ఓటుకి నోటుకుంభకోణంలో తెలుగుదేశం ఎమ్ ఎల్ ఎ రేవంత్ రెడ్డి అరెస్టు కావటం, సూత్రధారి తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్న ప్రచారం బాగా జరిగింది. ఇదంతా పార్టీ వ్యవహారం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారంగా భావించారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా దీని మీద చర్యలు సాగించారు.
ఓటుకి కోట్లు కుంభకోణంలో ఇరుక్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్ డిమాండ్ చేశాయి. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటించింది.
తెలుగుదేశం పార్టీ మాత్రం ఇదంతా తెలంగాణ ప్రభుత్వ కుట్ర అని వాదించింది. ఇందులో ప్రతిపక్షపార్టీ వైఎస్సార్‌సీపీ పాత్ర ఉందని ఆరోపించింది. గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యవహార శైలి బాగోలేదని ఆక్షేపించింది.
ప్రభావం
మార్చుదీని ఫలితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైద్రాబాదునుండి ఆంధ్రప్రదేశ్ కు మార్చటం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడం జరిగాయి.[9]
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ "భ్రీఫ్ కేసులో బాబు". progressivemedia.in. Archived from the original on 2015-06-28. Retrieved 2015-06-22.
- ↑ Rahul, U. (8 June 2015) TV channel airs Naidu-MLA ‘tape’. The Hindu
- ↑ U. Sudhar Reddy (8 June 2015) TV channels telacast AP CM Chandrababu Naidu’s call to MLA Elvis Stephenson. Deccanchronicle.com. Retrieved on 18 June 2016.
- ↑ "Cash-for-vote case explained: Poll, alleged bribe, an audio clip". The Indian Express. 10 June 2015.
- ↑ "చంద్రబాబు కుట్రదారుడు గవర్నర్‌కు కేసీర్ నివేదిక". updateap.com. Retrieved 2015-06-22.[dead link]
- ↑ V Rishi Kumar. "Revanth Reddy gets bail; ACB set to approach Supreme Court". The Hindu Business Line.
- ↑ "ఎంత డబ్బు కావాలో చెప్పండి:స్టీపన్‌తో రేవంత్". sakshi.com. Retrieved 2015-06-22.
- ↑ "అన్నింటికీ నేనున్నా". sakshi.com. Retrieved 2015-06-22.
- ↑ "ఓటుకు నోటు... తెలుగుదేశంపై ఈ కేసు ప్రభావమెంత..?". Telugu360 - Telugu. 2018-05-31. Retrieved 2018-06-01.