52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

భారత చలన చిత్రోత్సవం

52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2021 నవంబరు 20న గోవాలో కార్లోస్ సౌరా తీసిన ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్ (ఎల్ రే డి టోడో ఎల్ ముండో )తో ప్రారంభమైంది. 51వ చిత్రోత్సవం మాదిరిగానే ఈ చిత్రోత్సవం కూడా భౌతిక, వర్చువల్ స్క్రీనింగ్ జరిగింది.[1][2] ఇందులో బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, భారతదేశాల నుండి సినిమాలు ప్రదర్శించబడ్డాయి. 52వ చిత్రోత్సవంలో ఈ ఐదు దేశాలు 'కంట్రీ ఆఫ్ ఫోకస్'గా ఉన్నాయి.[3]

52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

2021 చిత్రోత్సవంలో, సత్యజిత్ రే శతజయంతి సందర్భంగా, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 'స్పెషల్ రెట్రోస్పెక్టివ్' ద్వారా ఆయనకు నివాళులు అర్పించింది, చిత్రోత్సవంలో రే రూపొందించిన 11 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. అతని వారసత్వానికి గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం నుండి 'సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'గా పేర్కొనబడింది.[4] ఈ చిత్రోత్సవంలో మొదటిసారిగా, స్ట్రీమింగ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, వూట్, సోనీ లీవ్ కూడా పాల్గొన్నాయి.[5]

కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్ చేసిన ఈ చిత్రోత్సవ ప్రారంభ వేడుక 2021 నవంబరు 20న ఛానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.[6] యూట్యూబ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. నవంబరు 28న అస్గర్ ఫర్హాదీ తీసిన ఎ హీరో సినిమాతో చిత్రోత్సవం ముగిసింది. ముగింపు వేడుక కూడా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

నివాళి మార్చు

  • దిలీప్ కుమార్, భారతీయ నటుడు , సినిమా నిర్మాత
  • సుమిత్రా భావే, భారతీయ చిత్ర దర్శకుడు
  • బుద్ధదేవ్ దాస్‌గుప్తా, భారతీయ కవి సినీ దర్శకుడు
  • సంచారి విజయ్, భారతీయ నటుడు
  • సురేఖ సిక్రి, భారతీయ నాటకరంగ, సినిమా, టెలివిజన్ నటి
  • జీన్-పాల్ బెల్మోండో, ఫ్రెంచ్ నటుడు
  • బెర్ట్రాండ్ టావెర్నియర్, ఫ్రెంచ్ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు , నిర్మాత
  • క్రిస్టోఫర్ ప్లమ్మర్, కెనడియన్ నటుడు
  • జీన్-క్లాడ్ కారియర్, ఫ్రెంచ్ నవలా రచయిత, స్క్రీన్ రైటర్, నటుడు
  • సీన్ కానరీ, స్కాటిష్ నటుడు
  • పునీత్ రాజ్‌కుమార్, భారతీయ నటుడు, గాయకుడు, నృత్యకారుడు

మూలాలు మార్చు

  1. "52nd edition of IFFI to start in Goa from November 20". The Hindu. 6 July 2021. Retrieved 2023-05-25.
  2. "52nd IFFI to be inaugurated tomorrow in Goa". PIB. 19 November 2021. Retrieved 2023-05-25 – via press release.
  3. "Martin Scorsese, Istevan Szabo to receive Satyajit Ray Lifetime Achievement award at 52nd IFFI". The Hindu. 23 October 2021. Retrieved 2023-05-25.
  4. "52nd IFFI to be held from 20th -28th Nov 2021 in Goa, Prakash Javadekar releases poster". India TV News. 6 July 2021. Retrieved 2023-05-25.
  5. "In hybrid format, IFFI plans to draw big names and movies". The Indian Express. 23 October 2021. Retrieved 2023-05-25.
  6. "IFFI: Salman Khan and Ranveer Singh to attend opening ceremony, Puneeth Rajkumar and Dilip Kumar to be honoured". The Indian Express. 19 November 2021. Retrieved 2023-05-25.

బయటి లింకులు మార్చు