90వ అకాడమీ పురస్కారాలు

90వ అకాడమీ పురస్కారాలు భారత కాలమానం ప్రకారం మార్చి 4, 2018అమెరికాలోని లాస్ ఎజిల్స్ లో డాల్బీ థియేటర్ లో అత్యంత వైభవంగా జరిగింది. జిమీ కిమ్మెల్ రెండో సారి ఈ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.[1]

90వ అకాడమీ పురస్కారాలు
Awarded forCinema
Awarded byఅకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
Presented on2018 మార్చి 4 (2018-03-04)
Hosted byడాల్బీ థియేటర్
Official websiteఅకాడమీ పురస్కారాలు
Highlights
ఉత్తమ చిత్రంది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ నటుడుగ్యారీ ఓల్డ్ మన్
ఉత్తమ నటిఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్

చరిత్రసవరించు

ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి ఇది ఏర్పాటు చేశారు.[2]

పురస్కార విజేతలుసవరించు

  • ఉత్తమ చిత్రం - ది షేప్ ఆఫ్ వాటర్
  • ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్) – డియర్ బాస్కెట్‌బాల్
  • ఉత్తమ నటుడు - గ్యారీ ఓల్డ్ మన్
  • ఉత్తమ నటి - ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్
  • ఉత్తమ సహాయ నటుడు - సామ్ రాక్ వెల్
  • ఉత్తమ సహాయ నటి - అల్లిసన్ జన్నే
  • ఉత్తమ దర్శకుడు - గిలెర్మో డెల్ టోరో
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - బ్లేడ్ రన్నర్ 2049
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - రిమెంబర్ మి: కోకో (సంగీతం: క్రిస్టెన్ అండెర్సన్, రచన: రాబర్ట్ లోపెజ్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) - ఐకారస్
  • ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ - డన్‌కిర్క్
  • ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - అలెగ్జాండర్ డెస్ప్లాట్ (ది షేప్ ఆఫ్ వాటర్)
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) - హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
  • ఉత్తమ లఘుచిత్రం (లైవ్ యాక్షన్) - ది సైలెంట్ చైల్డ్
  • ఉత్తమ విదేశీ చిత్రం - ఎ ఫెంటాస్టిక్ ఉమన్ (చిలీ)
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - జోర్డాన్ పీలే (గెట్ ఔట్)
  • ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - డన్‌కిర్క్
  • ఉత్తమ ఛాయాగ్రహణం - రోజర్ ఎ. డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - ది షేప్ ఆఫ్ వాటర్
  • ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - లీ స్మిత్ (డన్‌కిర్క్)
  • ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్ - డార్కెస్ట్ అవర్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ త్రెడ్)

చిత్రమాలికలుసవరించు

 
గిల్లెర్మో డెల్ టోరో ( ఉత్తమ దర్శకుడు )
 
ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (ఉత్తమ నటి)

బయటి లంకెలుసవరించు

అధికారిక వెబ్‌సైటులు

మూలాలుసవరించు

  1. 90వ అకాడమి పురస్కారాలు. "ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు గ్యారీ ఓల్డ్ మ‌న్‌". www.teluguglobal.in. Archived from the original on 9 మార్చి 2018. Retrieved 7 March 2018.
  2. 90వ అకాడమి పురస్కారాలు. "OSCARS 2018: WINNERS LIST". edition.cnn.com. సీ ఎన్ ఎన్. Retrieved 7 March 2018.