హొహొబ నూనె

(Jojoba oil నుండి దారిమార్పు చెందింది)
జొజొబమొక్క పొద
పుష్పము
మగపుష్పము.
కాయలు
హహోబ గింజ
హహోబ నూనె

మౌలిక సమాచారం

మార్చు

హహొబ (Jojoba) చెట్టు సిమ్మోండసియేసి (simmondsiaceae) వృక్షకుటుంబానికి చెందిన బహువార్షికపొద/చిన్నచెట్టు. వృక్షశాస్త్రనామం సిమ్మోండసియ చినెన్‍సిస్ (simmondasia chinensis) ఈగుల్మము యొక్క ఆదిఆవాసం మెట్టప్రాంతమైన దక్షిణ ఆరిజోనా, దక్షిణకాలిఫోర్నియో, ఆగ్నేయమెక్సికో ప్రాంతాలు.[1]. విత్తనంలో 50-55%నూనెవుంటుంది[2].ఈ చెట్టు పేరును జొజొబ (jojoba) అని వ్రాసినప్పటికి హహొబ (hohoba) అని పిలుస్తారు, అనగా లిఖితరూపానికి, వుచ్ఛారణకు వ్యత్యాసం ఉంది.

భారతదేశంలో సాగుకై అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించినవి

మార్చు

గుజరాత్, హర్యానా, రాజస్తాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక.రాజస్తాన్, గుజరాత్‍ల 'కచ్' ప్రాంతం ఈచెట్ల పెంపకానికి బాగా అనుకూలమైనది.సా.శ.1960 మధ్య కాలంలో IARI (Indian arid region institute) ద్వారా భారతదేశకు కొనిరాబడి సాగుకై అభివృద్ధిచేయబడింది.IARI ప్రస్తుతపేరు NBPGR (National Burea of Plant Genetic Resources).ఎక్కువదిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధిచేయడం, సాగుకు అనుకూలమైనప్రాంతాలను గుర్తించి, సలహాలు ఇవ్వడం చేస్తారు.రాజస్తాన్ లోని థార్ఎడారిలో ఈచెట్ల పెంపకంచేపట్టి ఎడారిప్రాంతాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టారు..

చెట్టు-విత్తనంల మౌలిక సమాచారం

మార్చు

హహొబ గింజ అండాకారంగా, బ్రౌన్ రంగులోవుండి గట్టిగా వుండును (fruit nut).హెక్టారుకు 1-1.5 టన్నులవరకు గింజదిగుబడి వుండును.పంటదిగుబడి నాల్గవసంవత్సరంనుండి మొదలవుతుంది.కాని చెట్టుదిగుబడితక్కువగా వుంటుంది (50గ్తాం.లు/చెట్టుకు).పదవసంవత్సరంనుండి దిగుబడి పెరుగుతుంది.చెట్లవరుసలఖాలి 3x1.3మీ.లేదా4x1M మీ.వరుసలున్న తోటలలో చెట్టుకుఒక కే.జి.గింజలు,4x2మీ.వరుసకొలతలున్న తోటలలో 3.5 కిలోల దిగుబడివచ్చును.

నూనె సంగ్రహణ

మార్చు

విత్తనాలలో నుండి మొదట నూనెను ఎక్సుపెల్లరు అనబడు యంత్రాలద్వారా నూనెను తీయుదురు.ఈ యంత్రాలు విత్తనంపైవత్తిడి కల్గించడం వలన నూనె విత్తనకణాలనుండి బయటకు వచ్చును.ఈ విధానంలో విత్తనంలోని మొత్తం నూనెను తీయుటకు సాధ్యంకాదు.ఇంకను విత్తనపు పిండిలో 20-24% వరకు నూనెఉండును .సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో విత్తనపిండి/ఆయిల్‌కేకులో ఉండిపోయిన నూనెను తీయుదురు.[3].సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పరిశ్రమలో హెక్సేనుఅను పెట్రోలియం ద్రావణాన్ని ద్రావణిగా ఉపయోగిస్తారు.

నూనె/వ్యాక్సు

మార్చు

హహొబా నూనె సాధారణ ఉష్ణోగ్రతవద్ద లేతపసుపురంగులో ఉండును.ఎక్కువకాలం నిల్వవుంచినను, అధిక ఉష్ణోగ్రతకు గురైనను అంతత్వరగా పాడుకాదు. నూనెలోని కొవ్వు ఆమ్లాలు పొడవైన హైడ్రొకార్బను శృంఖాలను (C20-C22) కలిగివున్నవి.హహోబ నూనెను ఇంధనంగా వాడవచ్చును[4].ఈనూనె తిమింగళంనూనెను గుణాలలో పోలివుండి, దానికి మారుగా వినియోగిస్తునారు.అమెరికాలో ఈనూనెనుండి బయోడిసెల్ ఉత్పత్తికూడా మొదలైనది.ఔషదమందుల తయారిలో కూడా వాడెదరు.

హహొబ (jojoba) గింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[5]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 250Cవద్ద 1.4648-1.4650
ఐయోడిన్ విలువ 82-89
సపనిఫికెసను విలువ 92-167
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 37-49
అసెటైల్‍ విలువ 6.8
R-M విలువ 0.7
సాంద్రత 250Cవద్ద 0.8642-0.8990
ద్రవీభవన ఉషోగ్రత (0C) 11.2-11.8
ఫైర్‍పాయింట్ 3300C
polenskey number 0.31
సంతృప్త ఆమ్లాలు 1.5-1.7

నూనెలోని కొవ్వు ఆమ్లాలు

మార్చు

సాధారణంగా మొక్కల, చెట్ల విత్తనంలనుండి తీయు నూనెలలో 10-40% వరకు సంతృప్తకొవ్వుఆమ్లాలుంటాయి.మొక్కల విత్తనాలనుండి తీయు నూనెలలో సంతృప్తకొవ్వుఆమ్లాలు10-25% వరకుంటే, చెట్లగింజలనుండి తీయు నూనెలలో 20-45% వరకు సంతృప్త కొవ్వుఆమ్లాలుంటాయి.కాని జొజొబా ఎడారిమొక్క అవ్వటం వలననేమో, దీని నూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలులేవు.కేవలం అసంతృప్తకొవ్వుఆమ్లాలున్నాయి. అత్యధిక నూనెలలో 18 కార్బనులున్నకొవ్వుఆమ్లాలుండగా ఇందులో 18కార్బనులున్న, ఏకద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం 1%కన్నతక్కువవుండి, మిగిలిన అసంతృప్త కొవ్వుఆమ్లాలన్ని 20-22 వరకు కార్బనులనుకలిగినవి.

హహొబ (jojoba) గింజల నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం[5]

ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటొలిక్ ఆమ్లం (C16:1) 0.24
ఒలిక్ ఆమ్లం (C18:1) 0.66
11-Eicosenoic Acid (C20:1) 30.3
Docosenoic Acid (C22:1) 14.2
Docosdienoic acid (C22:2) 33.7
9-Godoelic Acid (C20:1) 14.6

నూనె ఉపయోగాలు

మార్చు
  • తిమింగళపు నూనెకుబదులు వాడెదరు[6]
  • బయోడిసెల్ తయారిలో ఉపయోగిస్తారు[7].
  • కాస్మాటిక్సు తయారిలో వాడెదరు[8]
  • మైనం (wax) తయారుచేయుటలో వాడెదరు.
  • కందెనలు (Lubricants) ఉత్పత్తిచేయుటలో వినియోగిస్తారు.
  • పార్మాసుటికల్స్ (pharamceutucals) తయారిలో కూడా ఉపయోగించుతున్నారు.
  • అఢెస్సివులు (Adhesives) తయారులోను వాడెదరు
  • వార్నిష్‌లు, ఇంకులు, రెజిన్‌ (సజ్జాకారం, ప్లాస్టిక్కులు, డెటెర్జెంట్ (అపక్షాలకం) లతయారిలో విరివిగా వాడెదరు[9]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Jojoba". hort.purdue.edu. Retrieved 2015-03-24.
  2. "JOJOBA: USES". hort.purdue.edu. Archived from the original on 2015-04-29. Retrieved 2015-03-25.
  3. "Solvent extraction of jojoba oil from pre-pressed jojoba meal". grasasyaceites.revistas.csic.es. Retrieved 2015-03-25.
  4. "JOJOBA: USES". jatrophabiodiesel.org. Archived from the original on 2015-04-29. Retrieved 2015-03-24.
  5. 5.0 5.1 SEA HandBook-2009.By The Solvent Extractors' Association of India.page NO;931
  6. D.J. Undersander; E.A. Oelke; A.R. Kaminski; J.D. Doll; D.H. Putnam; S.M. Combs; C.V. Hanson (1990). "Jojoba". Alternative Field Crops Manual.
  7. "Jojoba oil could fuel cars and trucks". New Scientist. March 6, 2003. Archived from the original on 2008-04-30. Retrieved 2015-03-24.
  8. "Jojoba Oil for Nails: Natural Care for Your Perfect Manicure". Body (personal) care. Oily Oily. Retrieved 29 August 2013.
  9. "The History and Promise of Jojoba". armchair.com. Retrieved 2015-03-24.