అంజలి పాటిల్

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, దర్శకురాలు.

అంజలి పాటిల్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, దర్శకురాలు. ఢిల్లీ ఇన్ ఎ డే, చక్రవ్యూహ, న్యూటన్, విత్ యు వితౌట్ యు (శ్రీలంక) సినిమాలలో పనిచేసి, ప్రశంసలు అందుకుంది. విత్ యు వితౌట్ యు సినిమాలో నటనకు 43వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటి (సిల్వర్ పీకాక్) అవార్డును అందుకుంది.[1] 2013లో నా బంగారు తల్లి అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డులలో స్పెషల్ మెన్షన్ అవార్డునూ,[2] ఉత్తమ నటిగా రాష్ట్ర నంది అవార్డును అందుకుంది.[3]

అంజలి పాటిల్
2012లో ఉత్తమనటి అవార్డు అందుకుంటున్న అంజలి
జననం
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం
పురస్కారాలుజాతీయ చలనచిత్ర అవార్డులు - స్పెషల్ మెన్షన్
నంది ఉత్తమ నటీమణులు

జననం, విద్య

మార్చు

అంజలి పాటిల్ మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతంలోని మరాఠీ కుటుంబంలో జన్మించింది. నాసిక్‌లోనే ఉన్నత పాఠశాలను పూర్తిచేసింది. 14 సంవత్సరాల వయస్సులో, కళారంగంపై ఆసక్తిని పెంచుకుంది. పూణే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో చేరి 2007 జూన్ లో బంగారు పతకంతో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆ సంవత్సరం తరువాత, న్యూ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నాటకరంగంలో మాస్టర్స్ చేయడానికి ఎంపికయింది. అక్కడ భారతీయ, అంతర్జాతీయ సినిమా, నాటకరంగ నటులు, దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది.[4][5]

 
వరల్డ్ ప్రీమియర్ న్యూటన్ జూపాలాస్ట్ బెర్లినాలే 2017లో పంకజ్ త్రిపాఠితో పాటిల్.

కెరీర్

మార్చు

ప్రశాంత్ నాయర్ తీసిన హిందీ-ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఢిల్లీ ఇన్ ఎ డే సినిమాలో రోహిణి పాత్రలో మొదటిసారిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2011, అక్టోబరు 13న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శించబడింది. 2012 ఆగస్టులో[6] భారతదేశంలోని థియేటర్లలో విడుదలైంది.

అంజలి పాటిల్ 2010-11లో అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ గ్రీన్ బ్యాంగిల్స్‌లో ప్రధాన నటిగా నటించడంతోపాటు నిర్మాతగా పనిచేసింది. ఇది విమెన్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇంటర్నేషనల్, లాస్ ఏంజిల్స్ కి భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేయబడింది. 15 దేశాల్లోని 44 నగరాల్లో ఇంటర్నేషనల్ షోకేస్ 2012లో ఎంపిక చేయబడి ప్రదర్శించబడింది.[7]

నక్సలిజంకు సంబంధించిన సమస్యలపై ప్రకాష్ ఝా తీసిన చక్రవ్యూహ్ సినిమాలో నక్సల్ లీడర్ జూహీ పాత్రలో నటించి,[8][9] ప్రశంసలు అందుకున్నది.[4][10]

2012లో శ్రీలంకకు చెందిన ప్రఖ్యాత రచయిత-దర్శకుడు ప్రసన్న వితానగే తీసిన విత్ యు, వితౌట్ యు సినిమాలో నటించి, తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పింది. సింహళ భాషలో డబ్బింగ్ చేసిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. తన అద్భుతమైన నటనతో 2012 నవంబరులో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ నటిగా సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుల్లో అంజలి ఒకరు. 2017లో తన నటనకుగానూ పాటిల్ శ్రీలంక అధ్యక్ష అవార్డును కూడా అందుకున్నది.

2016లో అంజలి పాటిల్ తన మొదటి మరాఠీ చిత్రం ది సైలెన్స్‌లో నటించి, ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

2016లో విడుదలైన రాకేష్ ఓంప్రకాష్ తీసిన మిర్జియా సినిమాలో కీలక పాత్ర పోషించింది. 2018లో మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్‌ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.[11]

పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా చేసిన కాలా సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది.[12] తరువాత అంజలి నటించిన కుతిరై వాల్ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా భాష పాత్ర ఇతర వివరాలు
2011 ఢిల్లీ ఇన్ ఎ డే హిందీ రోహిణి
గ్రీన్ బ్యాంగిల్స్ హిందీ మను షార్ట్ ఫిల్మ్
2012 ప్రత్యయామ్ తెలుగు దుర్గ
ఓబ నాథువ ఓబ ఎక్కా సింహళం సెల్వి సింహళ అరంగేట్రం
చక్రవ్యూహ్ హిందీ జూహీ
2013 ఎంత మలయాళం దుర్గ మలయాళ సినిమారంగ ప్రవేశం
నా బంగారు తల్లి తెలుగు
అప్నా దేశ్ కన్నడ వసుందర [13]
శ్రీ హిందీ సోనూ
2014 కిల్ ది రేపిస్ట్‌? హిందీ మీరా శుక్లా
ఫైండింగ్ ఫన్నీ ఇంగ్లీష్/కొంకణి స్టెఫానీ 'ఫన్నీ' ఫెర్నాండెజ్,
ఫ్యానీ కూతురు
అతిథి పాత్ర
2015 ది సైలెన్స్ మరాఠీ మామి మరాఠీ అరంగేట్రం
మిస్సెస్ స్కూటర్ హిందీ అషిమా
2016 మిర్జియా హిందీ జీనత్
2017 సమీర్ హిందీ అలియా ఇరాడే
న్యూటన్ హిందీ మాల్కో
2018 మేరి నిమ్మో హిందీ నిమ్మో
కాలా తమిళం పుయల్ చారుమతి గైక్వాడ్ తమిళ అరంగేట్రం
2019 దితీ మరాఠీ తుల్సా
మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ హిందీ సర్గం
2020 మన్ ఫకీరా మరాఠీ మహి
2022 కుత్తిరైవాల్ తమిళం వంగ/ఇరుసాయి
కౌన్ ప్రవీణ్ తాంబే? హిందీ వైశాలి తాంబే
బార్డో మరాఠీ ఆశాలత

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర భాష ఛానల్ ఇతర వివరాలు
2019 హుతాత్మా విద్యుత్ మరాఠి జీ5
2020 అఫ్సోస్ శ్లోక హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో
2020 నా క్లయింట్ వైఫ్ సింధూర హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం సినిమా అవార్డు ఫలితం
2012 విత్ యు వితౌట్ యు గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - ఉత్తమ నటి[1] గెలుపు
2012 చక్రవ్యూహ్ స్టార్‌డస్ట్ అవార్డ్స్ 2013 - బ్రేక్‌త్రూ సపోర్టింగ్ పెర్ఫార్మెన్స్ - ఫిమేల్[14] ప్రతిపాదించబడింది
2012 చక్రవ్యూహ్ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్- ఫిమేల్ [15] ప్రతిపాదించబడింది
2012 ఢిల్లీ ఇన్ ఎ డే ఉత్తమ నటిగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతిపాదించబడింది
2012 ఢిల్లీ ఇన్ ఎ డే సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యూయార్క్ - ఉత్తమ సహాయ నటిగా సౌత్ ఆసియన్ రైజింగ్ స్టార్ [16] ప్రతిపాదించబడింది
2013 నా బంగారు తల్లి నంది అవార్డు - ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుపు
2013 నా బంగారు తల్లి జాతీయ చలనచిత్ర అవార్డు - స్పెషల్ మెన్షన్ గెలుపు
2016 విత్ యు వితౌట్ యు కొలంబో శ్రీలంకలో సరసవియ అవార్డులు - ఉత్తమ నటి[1] గెలుపు
2016 విత్ యు వితౌట్ యు కొలంబో శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ ఫిల్మ్ అవార్డులు - ఉత్తమ నటి[1] గెలుపు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 1.2 1.3 Gurvinder Singh bags Golden Peacock at IFFI 2012, Centenary Award to Mira Nair | DearCinema.com Archived 22 జనవరి 2013 at the Wayback Machine
 2. "IndiaGlitz -". Archived from the original on 27 జూన్ 2015. Retrieved 13 October 2016.
 3. "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
 4. 4.0 4.1 Hungama, Bollywood (30 October 2012). "Introducing Anjali Patil: Prakash Jha's Naxal firebrand - Bollywood Hungama". Retrieved 2022-07-11.
 5. "NDTVMovies.com : Bollywood News, Reviews, Celebrity News, Hollywood News, Entertainment News, Videos & Photos". Archived from the original on 30 January 2013. Retrieved 2022-07-11.
 6. Shiban Bedi, Nishat Bari (22 October 2011). "Anjali Patil to act in 'Delhi in a Day'". India Today. Retrieved 2022-07-11.
 7. Nyay Bhushan (7 March 2012). "Women In Film & Television India Chapter Launched". "The Hollywood Reporter". Retrieved 2022-07-11.
 8. "From the very first meeting, Prakash Sir had faith in me: Anjali Patil". The Times of India. 2 October 2012. Archived from the original on 17 December 2013. Retrieved 2022-07-11.
 9. "Anjali Patil is a great actor: Esha Gupta". The Times of India. 2 October 2012. Archived from the original on 27 September 2012. Retrieved 2022-07-11.
 10. "Paying a price for acting! - Latest News & Updates at Daily News & Analysis". 31 October 2012. Retrieved 2022-07-11.
 11. "Mere Pyare Prime Minister isn't a political film: Rakeysh Omprakash Mehra". The Indian Express (in ఇంగ్లీష్). 17 February 2019. Retrieved 29 April 2021.
 12. "Anjali Patil Joins 'Kaala' - Silverscreen.in". Silverscreen.in. 25 May 2017. Retrieved 2022-07-11.
 13. Bollywood actress Actress Anjali Patil in Kannada- Timesofap Archived 16 డిసెంబరు 2012 at the Wayback Machine
 14. Hungama, Bollywood (21 January 2013). "Nominations for Stardust Awards 2013 - Bollywood Hungama". Retrieved 2022-07-11.
 15. "Colors Screen Awards 2013 Nominations". Retrieved 2022-07-11.
 16. SAIFF announces South Asian Rising Star Film Awards nominees, Sunny Leone to co host award ceremony - DearCinema.com | DearCinema.com Archived 25 జనవరి 2013 at the Wayback Machine

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.