అంతరిక్ష శిథిలాలు

కక్ష్యల్లో ఉన్న పనైపోయిన నౌకలు, వాటి శకలాలు
(అంతరిక్ష వ్యర్ధాలు నుండి దారిమార్పు చెందింది)

అంతరిక్షంలోని శిథిలాలు లేదా చెత్తా చెదారం అనేది మానవ నిర్మిత, పనికిరాని వస్తువుల కుప్ప.–వయసైపోయిన ఉపగ్రహాలు, మండిపోయిన రాకెట్ల దశలు, ఈ వస్తువులు విచ్ఛిన్నమవడంవలన గాని అరిగిపోవడం వలన గాని ఢీకొట్టుకోవడం వలన గాని ఏర్పడిన శకలాలు -ఇవన్నీ అంతరిక్ష శిథిలాల లోకి వస్తాయి.

Earth from space, surrounded by small white dots
భూ ఉచ్ఛ కక్ష్య (HEO) నుండి అంతరిక్ష శిథిలాల దృశ్యం. ప్రధానమైన శిథిలాల సమూహాలు రెండు: భూస్థిర కక్ష్యలో ఉన్న వలయం, భూ నిమ్న కక్ష్యలో (LEO). ఉన్న శిథిలాల మేఘం

2013 జూలై నాటికి, 1 సెం.మీ. కంటే చిన్న వస్తువులు 17 కోట్లు, 1–10 సెం.మీ. వస్తువులు 670,000, అంతకంటే పెద్దవి 29,000 దాకా కక్ష్యల్లో ఉన్నాయి.[1] 2009 నాటికి 5 సెం.మీ. కంటే పెద్దవి 19,000 వరకూ పర్యవేక్షణలో ఉన్నాయి.[2] 2000 కి.మీ.ల కంటే దిగువన శిథిలాలు చిన్నపాటి ఉల్కల కంటే దట్టంగా ఉంటాయి; ఇందులో చాలావరకు సాలిడ్ రాకెట్ మోటార్ల నుండి వెలువడ్డ దుమ్ము, ఉపరితల రాపిడి కారణంగా వెలువడ్డ పైపూత (పెయింట్) వంటి శకలాలు, గడ్డకట్టిన శీతలీకరణి వంటివి ఉంటాయి. వీటివలన సౌరఫలకాలకు, కటకాలకూ దెబ్బ తగులుతుంది.శాండ్ బ్లాస్టింగ్ చేసినట్లుగా ఉంటుంది ఆ దెబ్బ.[2]

ఉదాహరణకు, ఆంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 300-400 కి.మీ.ల కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. 2009 లో ఉపగ్రహాల ఢీ, 2007 లో ఉపగ్రహ విధ్వంస పరీక్ష 800-900 కి.మీ.లవద్ద జరిగాయి.[2] కేంద్రానికి విపుల్ షీల్డింగ్ ఉన్నప్పటికీ, శకలాలు దాన్ని గుద్దుకునే అవకాశం 1/10000 అయినప్పటికీ ఆ కొద్దిపాటి సంభావ్యతను కూడా నివారించేందుకు గాను, కేంద్రాన్ని తగిన విధంగా జరిపారు.

శిథిలాల సాంద్రత ఒక స్థాయి కంటే పెరిగిపోయినపుడు, అదుపు చెయ్యలేని గొలుసుకట్టు చర్య లాగా ఘాతాలు (collisions) జరిగి, శిథిలాల సంఖ్య విశేషంగా పెరిగిపోతుంది. దీంతో, పనిచేస్తూ ఉన్న ఉపగ్రహాలు నాశనమౌతాయి. వాటి రక్షణ కోసం చేసే ఖర్చు పెరిగిపోతుంది. అది ఈసరికే జరగడం మొదలైందా అనేది చర్చనీయాంశం.[3][4] శిథిలాల సంఖ్యను అంచనా వెయ్యడం, దాన్ని అరికట్టడం, తొలగించడం మొదలైన పనులను ప్రస్తుతం కొన్ని సంస్థలు చేపట్టాయి.

పరిమాణం

మార్చు

2013 జూలై నాటికి, 1 సెం.మీ. కంటే చిన్న వస్తువులు 17 కోట్లు ఉన్నాయి. 1–10 సెం.మీ. వస్తువులు 670,000 ఉన్నాయి. 10 సెం.మీ. కంటే పెద్దవి[5]) 29,000 ఉన్నాయి.[1] సాంకేతికంగా ఈ కొలతకు పరిమితి 3 మి.మీ.లు.[6] భూ నిమ్న కక్ష్యలో ఉన్న 1900 టన్నుల శిథిలాల్లో (2002 నాటికి) 98 శాతానికి పైగా 1500 వస్తువులదే. ఇవి ఒక్కొక్కటీ 100 కిలోల పైచిలుకు బరువు ఉంటాయి.[7] చిన్న చిన్న వస్తువులు చాలా చేరుతున్నప్పటికీ, అవి త్వరలోనే భూ వాతావరణంలోకి వచ్చి మండిపోతాయి కాబట్టి, మొత్తం ద్రవ్యరాశి మాత్రం స్థిరంగానే ఉంటుంది. 2008 నాటి గణాంకాల ప్రకారం 8500 వస్తువులు, 5500 టన్నుల ద్రవ్యరాశీ ఉన్నట్లు అంచనా కట్టారు.[8]

భూ నిమ్న కక్ష్య

మార్చు

భూ నిమ్న కక్ష్యలో సార్వత్రిక కక్ష్యలు ఉన్నాయి. ఇక్కడ ఉపగ్రహాలు ఒకే కక్ష్యలో కాక, అనేక కక్ష్యల వలయాల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. సౌర అనువర్తిత కక్ష్యలు (సన్ సింక్రొనస్) దీనికో ఉదాహరణ. భూ నిమ్న ఉపగ్రహాలు అనేక కక్ష్యా తలాల్లో, రోజుకు 15 సార్ల వరకు, పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ కారణంగా తరచూ ఆ కక్ష్యల్లోని వస్తువుల సమీపంలోకి వస్తూ ఉంటాయి. (భూ నిమ్న కక్ష్యలో వస్తువుల సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది).[9]

కక్ష్యలు అస్థిరత (perturbations) కారణంగా కూడా మారుతాయి. (భూ గురుత్వాకర్షణలో అసమతుల్యత అస్థిరతకు ఒక కారణం). ఘాతాలు (collisions) ఏ దిశ నుండైనా జరగవచ్చు. కెస్స్లర్ సిండ్రోమ్ ముఖ్యంగా భూ నిమ్న కక్షలకు వర్తిస్తుంది; ముఖాముఖి ఘాతాలైతే 16 కి.మీ./సె వేగంతో జరగవచ్చు (కక్ష్యావేగానికి రెట్టింపు). 2009 నాటి ఉపగ్రహ ఘాతం 11.7 కి.మీ./సె వేగంతో జరిగి, [10] బోలెడు చిన్న చిన్న ముక్కలు అంతరిక్షంలోకి వెదజల్లబడ్డాయి. ఈ ముక్కలు కక్ష్యలను దాటి అనేక ఘాతాలకు కారణమై క్యాస్కేడింగు ఎఫెక్టుకు దారితీస్తాయి. ఓ మహా ఘాతమేదైనా జరిగితే (ఉదాహరణకు అంతరిక్ష కేంద్రానికి, వయసైపోయిన ఏదైనా ఉపగ్రహానికీ మధ్య), ఆ తరువాత భూ నిమ్న కక్ష్యను ఉపయోగించుకోవడం అసాధ్యమైపోవచ్చు.[3]

మానవ సహిత యాత్రలు 400 కి.మీ.లు ఎత్తున, లేదా అంతకంటే దిగువన జరుగుతాయి. ఇక్కడ ఉండే వాతావరణ గుంజుబాటు, శిథిలాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతరిక్ష వాతావరణం కారణాన, భూ వాతావరణం విస్తరించడం వలన క్రిటికల్ ఆల్టిట్యూడ్ పెరిగింది; 90 ల్లో శిథిలాల సాంద్రత తగ్గడానికి ఇదొక కారణం.[11] రష్యా ప్రయోగాలు తగ్గడం కూడా మరో కారణం; 1970, 80 ల్లో అత్యధిక ప్రయోగాలు చేసినది సోవియట్ యూనియనే.[12]

ఇంకా ఎత్తులలో

మార్చు

ఇంకా ఎత్తున ఉన్న కక్ష్యల్లో వాతావరణ గుంజుబాటు బాగా తక్కువగా ఉండడం వలన కక్ష్యా క్షీణతకు మరింత సమయం పడుతుంది. కొద్దిపాటి వాతావరణ గుంజుబాటు, చంద్రుడు కలిగించే అస్థిరత, భూ గురుత్వ అస్థిరత, సౌర గాలులు, సౌర ధార్మిక పీడనం మొదలైనవి శిథిలాలను క్రమేణా నిమ్న కక్ష్యల్లోకి నెడతాయి (అక్కడ ఆ శిథిలాలు క్షీణిస్తాయి). కానీ చాలా ఎత్తైన కక్ష్యల్లో ఈ ప్రక్రియకు వేల సంవత్సరాలు పడుతుంది.[13] మానవుడు నిమ్న కక్ష్యల కంటే ఉన్నత కక్ష్యలను తక్కువగా వాడినప్పటికీ, సమస్య ఎదురవడానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ, సమస్య జటిలం కావడానికి ఎంతో సమయం పట్టదు.[contradictory][page needed][14]

సమాచార ఉపగ్రహాలు చాలావరకు భూస్థిర కక్ష్యల్లో ఉంటాయి. ఇవన్నీ ఒకే కక్ష్యామార్గంలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి మధ్య వేగాలు తక్కువే ఐనప్పటికీ ఏదైనా ఉపగ్రహం పనికిరాకుండా పోయినపుడు (Telstar 401 లాగా) అది భూ సమవర్తన కక్ష్య (జియో సింక్రొనస్ ఆర్బిట్) లోకి చేరుతుంది; ప్రతి సంవత్సరం దాని కక్ష్యా కోణం 0.8° చొప్పున, వేగం 160 కి.మీ./గంటకు చొప్పున పెరుగుతూ పోతాయి. ఘాతక వేగం 1.5 కి.మీ./సె వరకూ పెరుగుతుంది. కక్ష్యా అస్థిరతలు, పనికిరాని ఉపగ్రహాల్లో రేఖాంశ చలనానికి, కక్ష్యా తలం యొక్క ప్రిసెషన్ కు కారణమవుతాయి. వ్యోమనౌకలు శిథిలాలకు అతి సమీపంలోకి (50 మీటర్ల లోపు) వచ్చే సంఘటనలు సంవత్సరానికి ఒకటైనా జరుగుతుందని అంచనా.[15] ఇక్కడి ఘాతాల వలన ఏర్పడే శిథిలాలు, నిమ్న కక్ష్యల ఘాతాల కంటే తక్కువ ప్రమాదకరం. కానీ ఉపగ్రహం పనికిరాకుండా పోతుంది. మరీ ముఖ్యంగా సౌర చోదిత ఉపగ్రహాల వంటి పెద్ద వస్తువులు ఘాతాలకు గురవుతాయి.[16]

ఉపగ్రహ జీవిత కాలాంతాన దానిని కక్ష్యా స్థానం నుండి తరలించగల సౌకర్యం అందులో ఏర్పాటు చేసామని ITU కు నిరూపించాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది. ఐతే ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలను పరిగణనలోకి తీసుకుంటే అది సరిపోదని తెలుస్తోంది.[17] అంత దూరాన ఉన్న భూ స్థిర కక్ష్యలో 1 మీటరు కంటే చిన్న వస్తువులను కచ్చితంగా కొలవలేము కాబట్టి సమస్య స్వరూపం పూర్తిగా తెలుసుకోలేం.[18] ఉపగ్రహాలను కక్ష్యలోనే ఖాళీ స్థానాల్లోకి తరలించవచ్చు. ఇది సులువే కాక, భావి కదలికలను ముందే అంచనా వెయ్యవచ్చు.[19] ఇతర కక్ష్యల్లోని ఉపగ్రహాలు, బూస్టర్లు - ముఖ్యంగా భూ స్థిర బదిలీ కక్ష్యల్లో ఇరుక్కుపోయినవి- అందోళన కలిగించే మరో అంశం. ఇవి భూ స్థిర కక్ష్యను దాటేటపుడు చాలా ఎక్కువ వేగం కలిగి ఉండడమే దానికి కారణం.

ఘాతాలను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఉపగ్రహాలు ఢీ కొట్టుకోవడం జరిగాయి. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఒలింపస్-1 ని 1993 ఆగస్టు 11 న ఒక ఉల్కాశకలం ఢీకొట్టింది.చివరికి దాన్ని శ్మశాన కక్ష్యకు తరలించారు.[20] 1996 జూలై 24 న సెరీస్ అనే ఫ్రెంచి సౌర అనువర్తిత భూ నిమ్న ఉపగ్రహాన్ని ఏరియేన్-1 H-10 రాకెట్ యొక్క శకలాలు ఢీకొట్టాయి. 1986 లో పేలిపోయిన అ రాకెట్ యొక్క శకలాలే ఇవి.[21] 2006 మార్చి 29 న రష్యన్ ఎక్స్‌ప్రెస్-ఏఎమ్11 అనే సమాచార ఉపగ్రహం ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొనడంతో పనికిరాకుండా పోయింది;[22] అది చెడిపోయేలోగా సరిపడినంత సమయం ఇంజనీర్లకు దొరకడంతో దాన్ని శ్మశాన కక్ష్యలోకి పంపగలిగారు.

కొన్ని ప్రమాదాలు

మార్చు

1969లో జపాన్‌ ఓడకు సంబంధించిన ఐదుగురు నావికులు అంతరిక్ష వ్యర్థపదార్థాల వల్ల గాయపడ్డట్లు నమోదు చేయబడింది. ఇది బహుశా రష్యన్‌ ఉపగ్రహ వ్యర్థాల వల్ల వచ్చిందని అనుకుంటున్నారు.అమెరికా 1974 ఫిబ్రవరిలో ప్రయోగించిన స్కైలాబ్‌ 8 నుంచి 10 సంవత్సరాలు పనిచే యడానికి ఉద్దేశించింది. కానీ సూర్యునిలో జరిగిన మార్పుల వల్ల భూ వాతావరణ పైభాగం అనుకున్న దానికన్నా ఎక్కువగా విస్తరించి, పైకి లేచింది.ఫలితంగా ఈ అంతరిక్ష వాహనంపై వాతావరణ నిరోధకశక్తి, రాపిడి పెరిగి, అంతరిక్ష వాహక కక్ష్యను కిందికి దించాయి. ఫలితంగా అనుకున్న దానికన్నా ముందుగానే జులై 1979లో ఇది భూ వాతా వరణంలో ప్రవేశించి, విచ్ఛిన్నమైంది. ఈ సమయంలో విడుదలైన వ్యర్థాలు ప్రాణ, ఆస్తి నష్టం కలిగించ కుండా దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. దీనిలో కొంతభాగం మాత్రం జనాభా తక్కువగా ఉండే పశ్చిమ ఆస్ట్రేలియాలో పడింది.1997 లో అమెరికాలోని వోక్లహామా దగ్గర ఒక మహిళను 10×13 సెం.మీ. శకలం భుజాన్ని ఢీ కొనడం వల్ల ఆమె గాయపడింది. ఈ శకలం అమెరికాయే ప్రయోగించిన డెల్టా-2 రాకెట్‌ లోని ఇంధన ట్యాంకులోని భాగమని గుర్తించ బడింది. దీనిని అమెరికా ఎయిర్‌ఫోర్సు 1996లో ప్రయోగించింది. 2001లో ప్రయోగించిన ఒక రాకెట్‌ పైభాగం లోని సాంకేతిక లోపాలవల్ల క్షీణించి, ఎవరూ నివసించని సౌదీ అరేబియా అడవిలో పడిపోయింది. ఇదే విధంగా2003లో జరిగిన కొలంబియా ప్రమాదంలో అంతరిక్ష వాహక నౌకలో గరిష్ఠ భాగం యథాతథంగా భూమిపై పడింది.

కాలం చెల్లిన ఉపగ్రహాలు

మార్చు
 
Vanguard 1 is expected to remain in orbit for 240 years.[23]

1958 లో అమెరికా వాన్‌గార్డ్-1 అనే ఉపగ్రహాన్ని భూ మధ్యస్థ కక్ష్యలోకి ప్రయోగించింది. 2009 అక్టోబరు నాటికి కక్ష్యల్లో ఉన్న మానవ నిర్మిత అంతరిక్ష వస్తువులన్నింటిలోకీ అది ప్రాచీనమైనది.[24][25] 2009 జూలై వరకు బహిరంగంగా తెలిసిన అన్ని ప్రయోగాలలో 19,000 పెద్ద వస్తువులు, 30,000 ఇతర వస్తువులనూ ప్రయోగించగా వాటిలో 902 ఉపగ్రహాలు పనిచేస్తూ ఉన్నాయని యూనియన్ ఆఫ్ కన్‌సర్న్‌డ్ సైంటిస్ట్స్ తెలిపింది.[26]

1970, 1980 ల్లో, సోవియట్ యూనియన్ తమ RORSAT (Radar Ocean Reconnaissance SATellite) కార్యక్రమంలో భాగంగా అనేక నావిక గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాల రాడార్ల పవర్ కోసం BES-5 అణు రియాక్టరును వినియోగించారు. ఈ ఉపగ్రహాల జీవితాంతాన వాటిని శ్మశాన క్లక్ష్యలోకి పంపినప్పటికీ, అనేక వైఫల్యాల కారణంగా అణుధార్మిక పదార్థం భూమికీ నీటిలోకీ చేరింది. శ్మశాన కక్ష్యలోకి పంపిన వాటిలో కూడా పైపులకు రంధ్రాలు పడి శీతలీకరణి లీకయ్యే అవకాశం 50 ఏళ్ళ కాలంలో 8 శాతం వరకూ ఉంది. శీతలీకరణి గడ్దకట్టి, సోడియమ్-పొటాసియం మిశ్రమ బొట్లుగా మారి, [27] మరిన్ని శిథిలాలుగా మారుతుంది.[28]

ఈ సంఘటనలు జరుతూనే ఉన్నాయి. ఉదాహరణకు, 2015ఫిబ్రవరిలో USAF Defense Meteorological Satellite Program Flight 13 (DMSP-F13) కక్ష్యలో పేలిపోయి, 148 శిథిల శకలాలు ఏర్పడ్డాయి. ఇవి దశాబ్దాల తరబడి కక్ష్యలోనే ఉంటాయని భావిస్తున్నారు.[29]

పోయిన పరికరాలు

మార్చు

ఎడ్వర్డ్ టఫ్ట్ రాసిన ఎన్విజనింగ్ ఇన్ఫర్మేషన్ అనే పుస్తకం ప్రకారం, మొట్టమొదటి అమెరికన్ అంతరిక్ష నడక సందర్భంగా వ్యోమగామి మైకెల్ కాలిన్స్ పోగొట్టుకున్న గ్లవ్ కూడా అంతరిక్ష శిథిలాలలో భాగమే; మైకెల్ కాలిన్స్ జెమిని-1 వద్ద పోగొట్టుకున్న కెమెరా; మిర్ కేంద్రం యొక్క 15 ఏళ్ళ జీవిత కాలంలో సోవియట్ కాస్మొనాట్లు వదిలేసిన చెత్త సంచులు, [24] ఒక రెంచి, ఒక టూత్ బ్రష్, ఎస్‌టిఎస్-116 లో ప్రయణించిన సునీతా విలియమ్స్ పోగొట్టుకున్న కెమెరా, ఎస్‌టిఎస్-120 మిషన్‌లో చిరిగిన సౌర ఫలకాన్ని రిపేరు చేస్తూండగా పోయిన ప్లయర్స్, ఎస్‌టిఎస్-126 లో హేడ్‌మేరీ స్టెఫానిషిన్-పైపర్ పోగొట్టుకున్న ఒక బ్రీఫ్‌కేసు పరిమాణంలో ఉన్న ఒక టూల్ బ్యాగు - ఇవన్నీ అంతరిక్ష శిథిలాల్లో భాగమే.[30]

బూస్టర్లు

మార్చు
 
Spent upper stage of a Delta II rocket, photographed by the XSS 10 satellite

శిథిలాలకు ప్రధాన కారణం రాకెట్ల పై దశలు అని అంతరిక్ష శిథిలాల సమస్యను వర్గీకరించే క్రమంలో బోధపడింది. కక్ష్యలో ఉండిపోయిన ఈ దశలలో మిగిలిపోయిన ఇంధనం క్షీణించడంతో ఇవి విచ్ఛిన్నమౌతాయి.[31] అయితే, ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉన్న ఒక ఏరియేన్ రాకెట్ బూస్టరు విషయంలో కూడా ఒక పెద్ద ఘాత సంఘటన జరిగింది.[21] ఉచ్ఛ దశలను నిర్వీర్యం చెయ్యాలని నాసా, అమెరికా ఎయిర్ ఫోర్సులు నిబంధన పెట్టుకున్నాయి. కానీ ఇతర సంస్థలకు చెందిన లాంచర్లకు ఆ నిబంధన లేదు[vague]. పిఎస్‌ఎల్‌వి యొక్క సాలిడ్ రాకెట్ బూస్టర్ల వంటి కింది దశలు కక్ష్యను చేరవు, అంతకు ముందే విడిపోయి, భూవాతావరణంలో పడిపోతూ మండిపోతాయి. అందుచేత వీటి కారణంగా శిథిలాల బెడద ఉండదు. [32]

2000 మార్చి 11 న చైనా లాంగ్ మార్చి -4 CBERS-1 యొక్క పై దశ, కక్ష్యలో పేలిపోయి, శిథిలాల మేఘం ఏర్పడింది. 2007 ఫిబ్రవరి 19 న రష్యన్ Briz-M బూస్టర్ దశ కక్ష్యలో పేలిపోయింది. 2006 ఫిబ్రవరి 28 న ప్రయోగింపబడిన ఈ రాకెట్, దానిలోని ప్రొపెల్లంట్‌ను పూర్తిగా వాడేసే లోపు దానిలో లోపం ఏర్పడింది. పేలుడును శాస్త్రవేత్తలు ఫిల్ముపై రికార్డు చేసినప్పటికీ, శిథిలాల మేఘాన్ని రాడారుతో కొలవలేకపోయారు. 2007 ఫిబ్రవరి 21 నాటికి 1000 పైచిలుకు ముక్కలను గుర్తించారు. 2007 ఫిబ్రవరి 14 నాటి ఒక విచ్ఛిన్నాన్ని సెలెస్ట్రాక్ తో రికార్డు చేసారు. 2006 లో 8 విచ్ఛిన్నాలు జరిగాయి. 1993 తరువాత ఇదే అధికం. 2012 అక్టోబరు 16 న Briz-M విచ్ఛిన్నమైంది. దాని శిథిలాల మొత్తం సంఖ్య, వాటి పరిమాణం తదితర వివరాలు తెలియలేదు.

ఆయుధాలు

మార్చు

గతంలో శిథిలాలు ఏర్పడడానికి ఒక కారణం, 1960, 70 ల్లో అమెరికా, సోవియట్ యూనియన్‌లు చేపట్టిన ఉపగ్రహాంతక ఆయుధాల పరీక్ష. ఉత్తర అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD) వద్ద ఉన్న ఫైళ్ళలో సోవియట్ పరీక్షలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంది, అమెరికా పరీక్షల కారణంగా ఏర్పడిన శిథిలాలను తరువాతి కాలంలో గుర్తించారు.[31] శిథిలాల సమస్యను అర్థం చేసుకునే సరికి, ఉపగ్రహాంతక పరీక్షలు ఆగిపోయాయి. అమెరికా వారి ప్రోగ్రాం 437ను 1975 లో మూసివేసారు.[32]

అమెరికా తిరిగి తన ఉపగ్రహాంతక పరీక్షలను 1980ల్లో Vought ASM-135 ఆయుధంతో మొదలుపెట్టింది. 1985లో చేసిన ఒక పరీక్ష 525 కి.మీ. కక్ష్యలో ఉన్న 1-టన్ను బరువైన ఉపగ్రహాన్ని ధ్వంసం చెయ్యడంతో 1 సెం.మీ. కంటే పెద్ద శకలాలలను వేలాదిగా సృష్టించింది. తక్కువ ఎత్తులో ఉండటాన, వాతావరణ గుంజుబాటు ఒక దశాబ్దం లోపే ఈ శిథిలాలను చాలావరకు వాతావరణంలోకి లాగేసింది. ఆ పరీక్ష తరువాత ఇలాంటి పరీక్షలపై అప్రకటిత విరామాన్ని పాటించబడింది.[33]

 
Known orbit planes of Fengyun-1C debris one month after the weather satellite's disintegration by the Chinese ASAT

2007 లో చైనా జరిపిన ఉపగ్రహాంతక క్షిపణి పరీక్షలో ఏర్పడిన శిథిలాలకు గాను ఆ దేశం విస్తృతంగా విమర్శలను ఎదుర్కొంది.[34] ఇది చరిత్రలో జరిగిన అతి పెద్ద అంతరిక్ష శిథిలాల సంఘటన. అది సృష్టించిన శిథిలాల వివరాలిలా ఉన్నాయి - గోల్ఫ్ బంతి పరిమాణం లేదా అంతకంటే పెద్ద ముక్కలు 2,300 , 1 సెం.మీ. లేదా అంతకంటే పెద్దవి 35,000 ముక్కలు, 1 మి.మీ. లేదా అంతకంటే పెద్ద ముక్కలు పది లక్షలు. ధ్వంసం చేయబడ్డ ఆ ఉపగ్రహం 850 కి.మీ., 882 కి.మీ. ల మధ్యనున్న కక్ష్యలో పరిభ్రమిస్తూండేది. అంతరిక్షంలోని ఈ భాగం అత్యధిక ఉపగ్రహ సాంద్రత కలిగిన ప్రాంతం.[35] ఈ ఎత్తులో వాతావరణ గుంజుబాటు (ఎట్మాస్ఫెరిక్ డ్రాగ్) తక్కువగా ఉండటాన శిథిలాలు భూమికి తిరిగిరావడానికి కూడా సమయం పడుతుంది. 2007 జూన్ లో నాసా వారి టెర్రా పర్యావరణ వ్యోమనౌక ఈ శిథిలాల నుండి తప్పించుకోవడానికి తగు చర్యలు తీసుకుంది.[36]

2008 ఫిబ్రవరి 20 న అమెరికా చెడిపోయిన తన గూఢచార ఉపగ్రహాన్ని నాశనం చేసేందుకు తన యుద్ధ నౌక లేక్ ఈరీ నుండి SM-3 క్షిపణిని ప్రయోగించి పేల్చేసింది.ఈ గూఢచారి ఉపగ్రహం 450 కెజిల విషపూరిత హైడ్రజీన్ ప్రొపెల్లెంట్ కలిగి ఉందని భావించారు. ఈ సంఘటన 250 కి.మీ. ఎత్తున జరిగింది. ఏర్పడిన శిథిలాల పెరిజీ 250 కి.మీ..[37] శిథిలాల సంఖ్య తక్కువగా ఉండేలా క్షిపణిని ప్రయోగించారు. ఉపగ్రహ విధ్వంసం చాలా తక్కువ ఎత్తులో జరగడం, అక్కడ వాతావరణ గుంజుబాటు ఎక్కువగా ఉండడం చేత, శిథిలాలు 2009 కల్లా క్షీణించాయి.[38]

 
ఓ మైక్రోమెట్రాయిడ్ స్పేస్ షటిల్ చాలెంజరు ముందు కిటికీపై చేసిన గాయం

మానవ రహిత నౌకలకు

మార్చు

వ్యోమనౌకలు విపుల్ షీల్డుల రక్షణ ఉన్నప్పటికీ, సూర్యకాంతి కోసం తెరుచుకుని ఉండే సౌర ఫలకాలపై ఈ షీల్డులు ఉండవు. చిన్న చిన్న వస్తువుల తాకిడికి అవి అరిగిపోతూ ఉంటాయి. ఈ రాపిడిలో అవి ప్లాస్మాను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాస్మా కారణంగా ఫలకాలకు విద్యుత్ ముప్పు పెరుగుతుంది.[39] సోవియట్ అంతరిక్ష కేంద్రం మిర్‌లో ఫలకాలు చాలాకాలంగా అంతరిక్షంలో ఉన్నాయి కాబట్టి, ఈ తాకిడి కారణంగా జరిగిన అరుగుదల స్పష్టంగా కనబడుతుంది.[40][41]

పెద్ద శిథిలాలు సాధారణంగా వ్యోమనౌకను నాశనం చేస్తాయి. 1981 జూలై 24 న, ప్రయోగించిన నెల తరువాత, కాస్మోస్ 1275 అనే వ్యోమనౌక కనిపించకుండా పోయింది. ఇలాంటి సంఘటనల్లో ఇది మొట్టమొదటిది. అందులో ప్రొపెల్లంటేమీ లేదు. బహుశా బ్యాటరీ పేలిపోయి ఉండవచ్చు. తరువాతి పరిశోధనల్లో, అది 300 ముక్కలుగా విచ్ఛిన్నమైందని తెలిసింది. 1992 అక్టోబరు 18 న కాస్మోస్ 1484 కూడా అలానే విచ్ఛిన్నమై పోయింది.[42]

 
మిర్ అంతరిక్ష కేంద్రపు సౌర ఫలకాలపై శిథిలాల దెబ్బల కారణంగా వాటి పనితనం తగ్గిపోయింది. ఫలకం కుడి వైపున పడ్డ దెబ్బ బాగా పెద్దది. కెమెరా వైపు ఉన్నది అదే. ఫలకానికి కింది వైపున ఉన్న పెద్ద దెబ్బ ప్రోగ్రెస్ నౌక దాన్ని గుద్దినపుడు ఏర్పడింది.

ఆ తరువాత అనేక ఘాతాలు (కొలిజన్స్) జరిగాయి. 1993 ఆగస్టు 11 న ఒలింపస్-1 ను ఒక ఉల్కా శకలం ఢీకొట్టింది.[20] 1996 జూలై 24 న ఫ్రెంచి మైక్రో ఉపగ్రహం సెరైస్ ను ఏరియేన్-1 H-10 పైదశ బూస్టరు శకలాలు డీకొట్టాయి. 1986 నవంబరులో ఈ బూస్టరు పేలిపోయింది.[21] 2006 మార్చి 29 న రష్యను ఎక్‌స్ప్రెస్ AM11 సమాచార ఉపగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వస్తువు ఢీకొనడంతో అది పనికిరాకుండా పోయింది;[22] ఇంజనీర్లకు తగినంత సమయం ఉండడంతో దాన్ని శ్మశాన కక్ష్యకు పంపగలిగారు.

2009 ఫిబ్రవరి 10 న 16:56 UTC కి మొట్టమొదటి సారి పెద్ద ఉపగ్రహాలు ఢీకొట్టుకోవడం జరిగింది. 950 కిలోల అచేతన ఉపగ్రహం కాస్మోస్ 2251, పనిచేస్తూ ఉన్న 560 కిలోల ఇరిడియమ్-33 ఉపగ్రహం ఉత్తర సైబీరియాకు 800 కి.మీ. ఎత్తున [43] గుద్దుకున్నాయి. ఘాతం యొక్క సాపేక్ష వేగం 11.7 కి.మీ./సె.[44] ఉపగ్రహాలు రెండూ కూడా నాశనమయ్యాయి. శిథిలాల సంఖ్య ఎంత అనేదాదానికి కచ్చితమైన అంచనా లభించలేదు.[45][46]

2013 జనవరి 22 న BLITS ఉపగ్రహాన్ని శిథిలాలు ఢీకొట్టడంతో దాని కక్ష్య, కక్ష్యా వేగం రెండూ మారిపోయాయి. ఆ శిథిలాలు 2007 లో చైనా చేసిన ఉపగ్రహాంతక క్షిపణి పరీక్ష వలన ఏర్పడినవని అనుమానం.[47]

స్పేస్ షటిల్ యాత్రలు

మార్చు
 
ఎస్‌టిఎస్-114 యాత్రలో డిస్కవరీ యొక్క రెక్క, ఉష్ణ కవచం

స్పేస్ షటిల్ యాత్రలు మొదలుపెట్టిన కొత్తలో, కక్ష్యా మార్గంలో శిథిలాలు ఏమైనా ఉన్నాయేమోనని వెతికేందుకు నాసా, NORAD (నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్) ను నియోగించింది.[48] ఢీ కొట్టుకోడాన్ని నివారించే చర్యలను 1991 లో మొట్టమొదటిసారిగా తీసుకున్నారు[49] కాస్మోస్ 955 నుండి వెలువడ్డ శిథిలాలను తప్పించేందుకు 7 సెకండ్ల పాటు థ్రస్టర్లను మండించారు.[50] ఇలాంటి చర్యలనే తరువాతి స్పేస్ షటిల్ యాత్రలైన ఎస్‌టిఎస్ - 53, 72, 82 లలో కూడా చేపట్టారు.[49]

ఛాలెంజరు రెండో యాత్ర (ఎస్‌టిఎస్-7) లో జరిగిన ఒక సంఘటన శిథిలాల సమస్యను ప్రజల దృష్టికి కూడా తీసుకువచ్చిన తొలి సంఘటనల్లో ఒకటి. పైపూతకు (పెయింటు) చెందిన ఒక పెళ్ళ దాని కిటికీకి గుద్దుకుని, 1 మి.మీ. వెడల్పు గల గుంట పడింది. 1994 లో ఎస్‌టిఎస్-59 యాత్రలో ఎండీవర్ ముందు కిటికీకి గుంట పడింది. 1998 నుండి చిన్నపాటి తాకిడుల సంఖ్య పెరుగుతూ పోయింది.[51]

1990 ల నాటికే కిటికీల పెచ్చులూడడం, ఉష్ణ కవచాలకు చిన్న చిన్న దెబ్బలు తగలడం లాంటివి మామూలైపోయింది. ఈ దెబ్బల నుండి సున్నితమైన ఉష్ణ కవచాలను కాపాడేందుకు, షటిల్‌ తోక భాగం ముందుకు వచ్చేలా షటిల్‌ను అంతరిక్షంలో నడపడం మొదలుపెట్టారు. ఇలా నడపడం చేత శిథిలాల దెబ్బలు ఇంజన్ల మీద, వెనుక కార్గో బే మీదా పడతాయి, ఉష్ణ కవచాలు ఈ దెబ్బలనుండి తప్పించుకుంటాయి. ఇంజన్లు, కార్గో బేలు షటిల్ భూమికి తిరిగి వచ్చేటపుడు వాడరు కాబట్టి ఈ ఏర్పాటు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలో లంగరు (డాకింగు) వేసేటపుడు, కవచం దృఢంగా ఉన్న వ్యోమనౌక ఆర్బిటర్‌కు అడ్డుగా ఉండేలా చూసేవారు.[52]

 
ఎస్‌టిఎస్-118 యాత్రలో ఎండీవర్ రేడియేటర్ ప్యానెల్లో శిథిలాల కారణంగా ఏర్పడిన తూటా లాంటి ¼ అంగుళాల రంధ్రం.

నాసా జరిపిన ఒక అధ్యయనంలో, షటిల్‌కు ఉన్న మొత్తం ముప్పులో సగం శిథిలాల వల్లనే ఉందని తేలింది.[52][53] ఘోరమైన విపత్తు కలిగే అవకాశాలు 200 లో 1 కంటే ఎక్కువ ఉంటే షటిల్ యాత్రకు అనుమతి ఇచ్చేందుకు ఉన్నత స్థాయి నిర్ణయం అవసరం. సాధారణ షటిల్ యాత్రలో ముప్పు అవకాశం 300 లలో 1 గా ఉంటుంది. కానీ ఎస్‌టిఎస్-125 యాత్రలో (హబుల్ ను రిపేరు చేసేందుకు ఈ యాత్రను చేపట్టారు) 560 కి.మీ. ఎత్తు వద్ద ముప్పు 185 లో 1 గా ఉంటుందని తొలి అంచనాలు వేసారు. (2009 లో జరిగిన ఉపగ్రహ ఘాతం కారణంగా). అయితే శిథిలాల సంఖ్య మరింత కచ్చితంగా తెలిసాక, ఈ ముప్పును 221 లో 1 కి తగ్గించారు. యాత్ర మామూలుగానే జరిగింది.[54]

తరువాతి షటిల్ యాత్రలలో కూడా శిథిలాల సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2006 లో ఎస్‌టిఎస్-115 యాత్రలో ఒక సర్క్యూట్ బోర్డులోని ముక్క ఒకటి అట్లాంటిస్ కార్గో బేలో రేడియేటర్ ప్యానెల్లో ఒక చిన్న రంధ్రాన్ని చేసింది.[55] 2007 లో ఎస్‌టిఎస్-118 యాత్రలో ఎండీవర్ రేడియేటర్ ప్యానెల్లో తూటా చేసినట్టు రంధ్రాన్ని చేసింది.[56]

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

మార్చు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చిన్న శిథిలాల నుండి రక్షణ కోసం విపుల్ షీల్డింగును వాడినప్పటికీ, [57] సౌర ఫలకాల లాంటి కొన్ని భాగాలకు ఈ షీల్డు ఉండదు. వాటికి రక్షణ కల్పించడం అంత తేలిక కాదు. 1989 లో వేసిన అంచనా ప్రకారం సౌరఫలకాలు నాలుగేళ్ళకు ~0.23% చొప్పున క్షీణిస్తాయి. తదనుగుణంగా ఈ ఫలకాలను 1% అతి డిజైను చేసారు.[58] శిథిలాలు ఢీ కొట్టడానికి 10,000 లో 1 కంటే ఎక్కువ అవకాశం ఉంటే కేంద్రాన్ని విన్యాసాలు (ఇంజన్లను మండించడం) చేస్తారు."[59] 2014 జనవరి నాటికి పదిహేనేళ్ళలో 16 విన్యాసాలు చేసారు.[59] ఇవి కాక మరో మూడు సందర్భాల్లో సిబ్బంది, కేంద్రం నుండి బయటకు వెళ్ళి సోయుజ్ లో తలదాచుకున్నారు. ఈ 16 ఫైరింగులు, 3 సార్లు సోయుజ్ లో తలదాచుకోవడం కాక, మరో సందర్భంలో చేసిన విన్యాసం విఫలమైంది.[59][60][61] 2009 మార్చిలో 10 సెం.మీ. శకలం కేంద్రానికి బాగా దగ్గరగా వచ్చింది. ఈ శకలం కాస్మోస్ 1275 ఉపగ్రహానికి చెందినదిగా భావించారు.[62] 2012 లో నాలుగు సార్లు ఇంజన్లను మండించగా, 2013 లో ఒక్కసారి కూడా మండించలేదు.[59]

కెస్లర్ సిండ్రోమ్

మార్చు

మనుషుల అంతరిక్ష కార్యకలాపాలు చాలావరకు 800 నుండి 1,500 కి.మీ. కంటే తక్కువ ఎత్తులో జరుగుతున్నప్పటికీ, కెస్లర్ సిండ్రోం కారణంగా ఆ కక్ష్యలు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది. గుద్దుకోవడం వల్ల ఏర్పడే సిథిలాల శకలాలు మరిన్ని ఘాతాలకు కారణమై, గుద్దుకోవడాలు ఒక గొలుసుచర్య లాగా జరిగి భూనిమ్న కక్ష్యలో శిథిలాల శకలాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా ఫేరిగిపోతుంది. దీన్ని కెస్లర్ సిండ్రోం అంటారు.[63][64]

భూమికి

మార్చు
 
Saudi officials inspect a crashed PAM-D module in January 2001.

శిథిలాల్లో చాలావరకు భూవాతావరణం లోకి ప్రవేశించి మండిపోతాయి. పెద్ద వస్తువులు మండిపోకుండా భూమిని చేరి గుద్దుకోవచ్చు. నాసా అంచనా ప్రకారం గత యాభై ఏళ్ళుగా సగటున రోజుకు ఒకటి చొప్పున శిథిలాలు భూమిపై పడుతూనే ఉన్నాయి. పరిమాణంలో అవి పెద్దవిగా ఉన్నప్పటికీ ఆస్తి నష్టం పెద్దగా జరిగిన దాఖలాలు లేవు.[65]

1969 లో ఓ జపాను ఓడపై అంతరిక్ష శిథిలాలు పడి, నావికులు గాయపడ్డారు.[66] 1997 లో ఓక్లహామాలో లోటీ విలియమ్స్ అనే మహిళ భుజంపై 10 సెం.మీ. × 13 సెం.మీ. పరిమాణంలో ఉన్న ఒక శిథిలం పడగా ఆమె గాయపడింది. నల్లగా మారిపోయిన ఆ లోహ వస్తువు డెల్టా రాకెట్ లోని ప్రొపెల్లెంట్ ట్యాంకు ముక్క అని నిర్ధారించారు. ఆ రాకెట్టును ఒక సంవత్సరం కిందట ప్రయోగించారు.[67][68]

1979 జూలై 11 న స్కైల్యాబ్, భూవాతావరణంలో ప్రవేశించి విచ్ఛిన్నమై పోయింది. ఆ ముక్కలు దక్షిణ హిందూ మహాసముద్రంలోను, పశ్చిమ ఆస్ట్రేలియాలోను వర్షంలా కురిసాయి. ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం 1974 లో స్కైల్యాబ్ జీవిత కాలం ముగిసిన తరువాత 8 -10 ఏళ్ళ వరకు కక్ష్యలోనే ఉండాలి. కానీ సౌర కార్యకలాపాలు ఎక్కువ కావడంతో ఉచ్ఛస్థాయిల్లో వాతావరణం పలుచబడి, గుంజుబాటు (డ్రాగ్) పెరిగిపోయింది. దాంతో అనుకున్న సమయానికంటే ముందే స్కైల్యాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది.[69][70]

2001 జనవరి 12 న స్టార్ 48 లోని పేలోడ్ అసిస్ట్ మాడ్యూల్ (PAM-D) రాకెట్టు ఉచ్ఛ దశ కక్ష్యలో క్షీణత చెంది, వాతావరణంలోకి ప్రవేశించి.[71] సౌదీ అరేబియా ఎడారిలో పడిపోయింది. అది NAVSTAR 32, యొక్క ఉచ్ఛ దశగా గుర్తించారు.

2003 కొలంబియా దుర్ఘటనలో దాని పెద్ద పెద్ద భాగాలు భూమిపై పడిపోయాయి. దాని పరికరాల వ్యవస్థలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.[72] ఆ వస్తువులపై హానికారకమైన రసాయనాలు ఉండవచ్చని, వాటిని తాకవద్దని నాసా ప్రజలను హెచ్చరించింది.[73]

2007 మార్చి 27 న రష్యా గూఢచారి ఉపగ్రహానికి చెందిన శిథిలాలు భూమిపై పడుతూండగా, LAN ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్ A340 పైలట్ వాటిని చూసాడు. అప్పుడు ఆ విమానం పసిఫిక్ మహాసముద్రంపై శాంటియాగో, ఆక్లండ్‌ల మధ్య 270 మంది ప్రయాణీకులతో ఎగురుతోంది.[74] ఆ శిథిలాలు విమానం నుండి 8 కి.మీ. దూరంలో ఉన్నాయని పైలట్ అంచనా వేసాడు. ఆ శిథిలాలు పడుతూండగా అతడు సోనిక్ బూమ్ ను విన్నాడు.[75]

ట్రాకింగ్, గణన

మార్చు

అమెరికా అంతరిక్షశాఖ సమాచారం ప్రకారం 2009 జూలై నాటికి 902 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. కానీ, అప్పుడు అంతరిక్షంలో ఉన్న పెద్దశకలాల సంఖ్య 19 వేలు.అంటే పనిచేసే ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉండే శకలాలకన్నా చాలా తక్కువ. ఇవన్నీ వ్యర్థాల కిందకే వస్తాయి.1970, 80 దశకాల్లో సోవియట్‌ నావికా పర్యవేక్షణలో ప్రయోగించిన ఉపగ్రహాలు 'న్యూక్లియర్‌ రియాక్టర్‌'లను కలిగి ఉన్నాయి. భూ ఉపరితలంలో 71 శాతం సముద్రపు నీరే ఆక్రమించుకుని ఉంటుంది. నేల భాగంలో కూడా మనుషుల నివాసస్థలాలు కొద్ది భాగాన్నే (29 శాతం) ఆక్రమిస్తున్నాయి. అందువల్ల, శకలాలు భూగోళం మీద పడినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం ఉండే అవకాశాలు చాలా తక్కువ. సమాచార ప్రసార సాధనంగాను, మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి తెలుసుకోడానికీ, పర్యవేక్షించడానికీ, భూగర్భ వనరుల అంచనాకూ, ఇతర అవసరాల కోసమూ స్థిరమైన కక్ష్యలోకి ఉపగ్రహాలను ఇప్పుడు పెద్దఎత్తున ప్రయోగిస్తున్నారు. ఈ కక్ష్యలో వ్యర్థాలు, శకలాలూ పరిమితికి మించి పేరుకుపోతే ఆ కక్ష్యలో పనిచేసే ఉపగ్రహాలకు ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఏ క్షణంలోనైనా ఈ కక్ష్యలో మిగిలిపోయిన వ్యర్థాలు, శకలాలతో ఢీకొనే ప్రమాదమూ ఉంది. అందువల్ల, కనీసం ఈ స్థిర కక్ష్యల నుండైనా వ్యర్థాలను, శకలాలను, పనిచేయని ఉపగ్రహాలను తొలగించాల్సిన అవసరం ఉంది.

భూమ్మీద నుండి ట్రాకింగ్

మార్చు

రాడారు, ఆప్టికల్ డిటెక్టర్లు అంతరిక్ష శిథిలాలను పరిశీలిస్తూండే పరికరాల్లో ప్రధానమైనవి. 10 సెం.మీ. కంటే తక్కువ పరిమాణంలో ఉండే వస్తువులకు కక్ష్యా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఐనప్పటికీ, 1 సెం.మీ. పరిమాణంలో ఉండే వస్తువులను కూడా ట్రాకు చెయ్యవచ్చు.[76][77] అయితే, వీటి కక్ష్యను నిర్ధారించడం కష్టం కావడాన, అత్యధిక శిథిలాలు పరిశీలనకు అందవు. నాసా వారి కక్ష్యా శిథిలాల అబ్సర్వేటరీ 3 మీ. ద్రవ దర్పణ టెలిస్కోపు ద్వారా శిథిలాలను ట్రాకు చేసింది.[78] ఈ దర్పణాల నుండి ప్రతిఫలించిన శిథిలాలను ఎఫ్.ఎం రేడియో తరంగాలు గుర్తించగలవు.[79] అంతరిక్ష నౌకల పరిశీలనకు ఆప్టికల్ ట్రాకింగు ఉపయోగకరం.[80]

అమెరికా వ్యూహాత్మక కమాండు, తెలిసిన వస్తువులను ఒక జాబితా చేసి ఉంచుతుంది. భూస్థిత రాడారు, టెలిస్కోపులను, అంతరిక్షలో ఉన్న టెలిస్కోపునూ (శత్రు క్షిపణులను గుర్తించేందుకు వాడేది) ఇందుకు వాడుతుంది. 2009 జాబితాలో 19,000 వస్తువులు ఉన్నాయి.[81] ఐరోపా అంతరిక్ష సంస్థ (ESA) కు చెందిన శిథిలాల టెలిస్కోపు, TIRA,[82] గోల్డ్‌స్టోన్, హేస్టాక్,[83] EISCAT రాడార్లు, కోబ్రా ఫేస్‌డ్ ఎర్రే రాడారు, [84] ESA వారి మెట్రాయిడ్ అండ్ స్పేస్ డెబ్రి టెరెస్ట్రియల్ ఎన్వైరాన్‌మెంట్ రిఫరెన్స్ (MASTER) మోడల్‌లో వాడడం కోసం మరికొంత డేటాను పంపుతాయి.

అంతరిక్షంలో గణన

మార్చు
 
The Long Duration Exposure Facility (LDEF) is an important source of information on small-particle space debris.

మిల్లీమీటర్ లోపు శిధిలాల దిశాత్మక పంపిణీ, కూర్పుల గురించి, అంతరిక్షం నుండి వెనక్కి తిరిగి తెచ్చే ఉపగ్రహాలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఎస్‌టిఎస్-32 కొలంబియా తిరిగి తెచ్చిన LDEF ఉపగ్రహం (దీన్ని మిషన్ ఎస్‌టిఎస్-41-C ఛాలెంజర్ అంతరిక్షం లోకి ప్రవేశపెట్టింది) శిధిలాల డేటాను సేకరించడానికి 68 నెలల పాటు కక్ష్యలో గడిపింది. 1993 లో ఎస్‌టిఎస్-57 ఎండీవర్ తిరిగి తెచ్చిన EURECA ఉపగ్రహం కూడా (దీన్ని 1992 లో ఎస్‌టిఎస్-46 అట్లాంటిస్ అంతరిక్షం లోకి ప్రవేశపెట్టింది) శిధిలాల అధ్యయనానికి ఉపయోగపడింది.[85]

హబుల్ టెలిస్కోపుకు చెందిన సౌర ఫలకాలను ఎస్‌టిఎస్-61 ఎండీవర్ , ఎస్‌టిఎస్-109 కొలంబియా మిషన్లలో వెనక్కి తెచ్చారు. వీటినీ, మీర్ నుండి వెనక్కి తెచ్చిన పదార్థాలను కూడా అధ్యయనం చేశారు, ముఖ్యంగా మీర్ ఎన్విరాన్‌మెంటల్ ఎఫెక్ట్స్ పేలోడ్‌ను అధ్యయనం చేసి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రూపకల్పనలో ఈ పరిశీలనల ఫలితాలను వాడుకున్నారు.[86][87]

గబ్బార్డ్ చిత్రాలు

మార్చు

ఒకే సంఘటన ఫలితంగా ఏర్పడిన శిధిలాల మేఘాన్ని గబ్బార్డ్ రేఖాచిత్రాలు అనే స్కాటర్ ప్లాట్లతో అధ్యయనం చేస్తారు, ఇందులో శకలాల పెరిజీ, అపోజీలను వాటి కక్ష్య కాలానికి సంబంధించి ప్లాట్ చేస్తారు. కదలికల ప్రభావం కంటే ముందు ఉన్న శిధిలాల మేఘం యొక్క గబ్బార్డ్ రేఖాచిత్రాలు, డేటా అందుబాటులో ఉంటే, పునర్నిర్మిస్తారు. గబ్బార్డ్ రేఖాచిత్రాలు ఫ్రాగ్మెంటేషన్ యొక్క లక్షణాలు, దిశ, ప్రభావ స్థానం గురించి ముఖ్యమైన అంతర్దృష్టులను అందించగలవు.[88][89]

శిథిలాలతో వ్యవహారం

మార్చు

కృత్రిమ రాకెట్లు, ఉపగ్రహాల వినియోగం వల్ల విడుదలయ్యే పదార్థాలు - 'అంతరిక్ష వ్యర్థాలు', 'శకలాలు' (స్పేస్‌ డెబ్రీ / ఆర్బిటల్‌ డెబ్రీ ; జంక్‌ / వేస్ట్‌) ఇవి అంతరిక్షంలోనే ఉంటూ తిరుగుతుంటాయి. ఏ విధంగానూ ఇవి ఉపయోగపడవు. విడిపోయిన వివిధ రాకెట్‌ స్టేజీలు, పనిచేయని ఉపగ్రహాలు పేలి లేదా ఢకొీనడంతో విడుదలైన వాయువులు, శకలాలు అన్నీ వీటిలో ఉంటాయి. పలు సందర్భాలలో ఉపగ్రహాల ప్రయాణ కక్ష్య, వ్యర్థాల కక్ష్య ఒకే మార్గంలో ఉంటూ ఢకొీంటాయి. ఫలితంగా పనిచేస్తున్న ఉపగ్రహాలకు ఇవి ఆటంకంగా కొనసాగుతున్నాయి. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఇవి భూ వాతావరణంపై, భూమిపై ప్రభావాల్ని కలిగి ఉన్నాయి.గత 50 ఏళ్ళుగా సగటున రోజుకు ఒకటి చొప్పున వస్తువులు కక్ష్యనుండి పడిపోతున్నాయి, [90] సౌర గరిష్ఠంలో రోజుకు మూడు చొప్పున (భూ వాతావరణం వేడెక్కి వ్యాకోచించడం వలన), సౌర కనిష్ఠంలో మూడు రోజులకు ఒకటి చొప్పున పడిపోతున్నాయి.[90] వాతావరణకారణాలతో పాటు, శిథిలాలను తొలగించేందుకు ఇతర పద్ధతులను కూడా, వివిధ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యా సంస్థలూ ప్రతిపాదించాయి. కానీ 2014 నవంబరు నాటికి ఈ ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు.ఈ వ్యర్థాలను తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాకెట్లకు బదులుగా పలుమార్లు ప్రయోగించగల 'అంతరిక్ష షెటిల్‌ సర్వీస్‌' 1981లో రూపొందిన తర్వాత మాత్రమే అంతరిక్ష వ్యర్థాలు ఏర్పడటంలో వేగం తగ్గింది.

భూ నిమ్న కక్ష్య లోని వ్యర్థాలను తొలగించడానికి రాజకీయ, చట్టపరమైన, సాంస్కృతిక పరిస్థితులు అతి పెద్ద అడ్డంకి అని చాలామంది పండితులు గమనించారు. శిథిలాల తొలగిస్తే వ్యాపారాత్మకంగా ప్రయోజనమేమీ లేదు. శిథిలాల కారకుల మీద ఈ ఖర్చు మోపే పద్ధతి లేదు. ఈ విషయమై సూచనలు చాలానే వచ్చాయి.[91] అయితే ఇవేమీ పెద్దగా అమలుకు నోచుకోలేదు. [92][93]

శిథిలాల తొలగింపు

మార్చు

2016 డిసెంబరు 9 న జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా, అంతరిక్ష శిథిలాలను తొలగించే పరికరంతో కూడిన కూనొటోరి అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఈ పరికరం 700 మీ. పొడవైన ఒక ఎలక్ట్రోడైనమిక్ తాడు (Electrodynamic Tether-EDT)ను కలిగి ఉంటుంది. భూ అయస్కాంత క్షేత్రంలో చలించేటపుడు ఈ తాడులో విద్యుత్తు జనిస్తుంది. తద్వారా ఈ తాడు శిథిలాల వేగాన్ని తగ్గించి, వాటిని దిగువ కక్ష్యల్లోకి పడిపోయేలా చేస్తుంది. క్రమేణా ఈ శిథిలాలు భూవాతావరణంలోకి ప్రవేశించి, మండిపోతాయి.[94] అయితే ఈ ప్రయోగం విఫలమైంది. వీటి కాలంతీరిన తర్వాత కక్ష్యనుండి తప్పించి నప్పటికీ కొన్ని విఫలమై భూ వాతావరణంలో కి ప్రవేశించాయి. తద్వారా ఈ శకలాలు పెద్ద ఎత్తున రేడియోథార్మికశక్తిని విడుదల చేశాయి ఇతర కక్ష్యలకు మళ్లించబడిన ఉపగ్రహాలు విచ్ఛిన్నమై, రేడియోథార్మిక శక్తిని విడుదల చేసే ప్రమాదం ఇప్పటికీ ఉంది. ఇదే విధంగా ఫిబ్రవరి19, 2007లో ఒక శక్తివంతమైన రాకెట్‌ పేలిపోయింది. ఫలితంగా దాదాపు వెయ్యి శకలాలు గుర్తించబడ్డాయి.1960, 70 దశకాల్లో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ పోటీపడి సైనిక లక్ష్యాలతో ఉపగ్రహాలను ప్రయోగించాయి. వీటి వివరాలు బయటకు రానప్పటికీ, వీటివల్ల పెద్దఎత్తున శకలాలు, వ్యర్థాలు అంతరిక్షంలో ఏర్పడ్డాయి. మొత్తాని కి, కొనసాగుతున్న అంతరిక్ష ఉపగ్రహ ప్రయో గాలు, ప్రమాదాలు అంతరిక్ష వ్యర్థాలను, శకలాలను వేగంగా పెంచుతున్నాయి.కాలం తీరిన ఉపగ్రహాలు లేదా అంతరిక్ష పరిశోధన స్థావరాలు భూ కక్ష్యలోకి తిరిగి ప్రవేశించి, విచ్ఛిన్నమవుతాయి. ఇలా ప్రవేశించేటప్పుడు వాతా వరణంలోని గాలి, ఇతర కణాలను ఎదుర్కొంటాయి. రాపిడి (ఫిక్షన్‌) వల్ల వేడెక్కుతాయి. ఇలా దాదాపు 3000 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకూ (1648 సెంటీగ్రేడ్‌) వేడి పెరుగుతుంది. దీనివల్ల ఉపగ్రహ విచ్ఛిన్న సమయంలో విడుదలయ్యే ఎన్నో శకలాలు భూమిపై పడకుండా వాతావరణంలోనే కాలిపోవడమో లేదా ఆవిరైపోవడమో జరుగుతుంది.ఈ సందర్భం లో ఎన్నో విష వాయువులు, రేడియోథార్మిక శక్తి, ధూళి విడుదలవుతాయి.ఈ వాయువు లు భూ వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. అయినా కొన్ని శకలాలు కాలకుండా తప్పించుకుని భూ గోళం మీద పడతాయి.

వ్యర్థాల తగ్గించ డానికి

మార్చు

అంతరిక్షంలో వ్యర్థాల ఏర్పాటును తగ్గించ డానికి ప్రయోగాలు కొనసాగు తున్నాయి . 1)ఇంధన ట్యాంకుల్లో శేష ఇంధనాలను నిర్వీర్యం చేయడానికి ఏర్పాట్లు జరుగు తున్నాయి. 2)వ్యర్థాలను నియంత్రించడానికి ఖర్చుతో కూడిన ఇతర సాంకేతిక ప్రక్రియలతో పరిశోధనలు కొనసాగుతున్నాయి. 3)భౌతికంగా వ్యర్థాలను తొలగించడంపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. దీనికోసం జరిగే ఏర్పాట్లకు రాకెట్‌ ప్రయోగానికి అయినంత ఖర్చవుతుందట. 4)స్థిర కక్ష్యలో వ్యర్థాలు ఏర్పడటాన్ని తగ్గించడానికి పనికాలం అయిపోయిన తర్వాత ఉపగ్రహం దానంతటదే కక్ష్యను తొలగి, వేరే కక్ష్యలోకి మళ్లించే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.


మూలాలు వనరులు

మార్చు
  1. 1.0 1.1 ""How many space debris objects are currently in orbit?"". Archived from the original on 2016-05-18. Retrieved 2016-07-23.
  2. 2.0 2.1 2.2 The Threat of Orbital Debris and Protecting NASA Space Assets from Satellite Collisions (PDF), Space Reference, 2009 
  3. 3.0 3.1 Donald J. Kessler (March 8, 2009). "The Kessler Syndrome".
  4. Lisa Grossman, "NASA Considers Shooting Space Junk with Lasers", wired, 15 March 2011.
  5. "Technical report on space debris", p. 15, United Nations, New York, 1999.
  6. ""Orbital Debris FAQ: How much orbital debris is currently in Earth orbit?"". Archived from the original on 2009-08-25. Retrieved 2016-07-23.
  7. Joseph Carroll, "Space Transport Development Using Orbital Debris", NASA Institute for Advanced Concepts, 2 December 2002, p. 3.
  8. Robin McKie and Michael Day, "Warning of catastrophe from mass of 'space junk'" The Observer, 24 February 2008.
  9. Matt Ford, "Orbiting space junk heightens risk of satellite catastrophes."
  10. ""What are hypervelocity impacts?"". Archived from the original on 2011-08-09. Retrieved 2016-07-23.
  11. Kessler 1991, p. 65.
  12. Klinkrad, p. 7.
  13. Kessler 1991, p. 268.
  14. Schildknecht, T.; Musci, R.; Flury, W.; Kuusela, J.; De Leon, J.; Dominguez Palmero, L. De Fatima (2005). "Optical observation of space debris in high-altitude orbits". Proceedings of the 4th European Conference on Space Debris (ESA SP-587). 18–20 April 2005. 587: 113. Bibcode:2005ESASP.587..113S.
  15. ""Colocation Strategy and Collision Avoidance for the Geostationary Satellites at 19 Degrees West."" (PDF). Archived from the original (PDF) on 2011-07-18. Retrieved 2016-07-23.
  16. van der Ha, J. C.; Hechler, M. "The Collision Probability of Geostationary Satellites". 32nd International Astronautical Congress. 1981: 23. Bibcode:1981rome.iafcR....V.
  17. Anselmo, L.; Pardini, C. (2000). "Collision Risk Mitigation in Geostationary Orbit". Space Debris. 2 (2): 67–82. doi:10.1023/A:1021255523174.
  18. Orbital Debris, p. 86.
  19. Orbital Debris, p. 152.
  20. 20.0 20.1 "The Olympus failure" Archived 2007-09-11 at the Wayback Machine ESA press release, 26 August 1993.
  21. 21.0 21.1 Klinkrad, p. 2.
  22. 22.0 22.1 "Notification for Express-AM11 satellite users in connection with the spacecraft failure"[permanent dead link] Russian Satellite Communications Company, 19 April 2006.
  23. "Vanguard I celebrates 50 years in space". Eurekalert.org. Retrieved 2013-10-04.
  24. 24.0 24.1 Julian Smith, "Space Junk"[permanent dead link][dead link] USA Weekend, 26 August 2007.
  25. "Vanguard 50 years". Archived from the original on 2013-06-05. Retrieved 2016-07-23.
  26. "UCS Satellite Database" Union of Concerned Scientists, 16 July 2009.
  27. C. Wiedemann, et al, "Size distribution of NaK droplets for MASTER-2009", Proceedings of the 5th European Conference on Space Debris, 30 March-2 April 2009, (ESA SP-672, July 2009).
  28. A. Rossi et al, "Effects of the RORSAT NaK Drops on the Long Term Evolution of the Space Debris Population"[permanent dead link][dead link], University of Pisa, 1997.
  29. Gruss, Mike (2015-05-06). "DMSP-F13 Debris To Stay On Orbit for Decades". Space News. Retrieved 7 May 2015.
  30. See image here.
  31. Note that the list Schefter was presented only identified USSR ASAT tests.
  32. Clayton Chun, "Shooting Down a Star: America's Thor Program 437, Nuclear ASAT, and Copycat Killers", Maxwell AFB Base, AL: Air University Press, 1999.
  33. David Wright, "Debris in Brief: Space Debris from Anti-Satellite Weapons" Archived 2009-09-09 at the Wayback Machine Union of Concerned Scientists, December 2007.
  34. Leonard David, "China's Anti-Satellite Test: Worrisome Debris Cloud Circles Earth" space.com, 2 February 2007.
  35. "Fengyun 1C – Orbit Data" Heavens Above.
  36. Brian Burger, "NASA's Terra Satellite Moved to Avoid Chinese ASAT Debris", space.com.
  37. "Pentagon: Missile Scored Direct Hit on Satellite.", npr.org, 21 February 2008.
  38. Jim Wolf, "US satellite shootdown debris said gone from space" Archived 2009-07-14 at the Wayback Machine, Reuters, 27 February 2009.
  39. Akahoshi, Y.; et al. (2008). "Influence of space debris impact on solar array under power generation". International Journal of Impact Engineering. 35 (12): 1678–1682. doi:10.1016/j.ijimpeng.2008.07.048.
  40. Smirnov, V.M.; et al. (2000). "Study of Micrometeoroid and Orbital Debris Effects on the Solar Panelson 'MIR'". Space Debris. 2 (1): 1–7. doi:10.1023/A:1015607813420.
  41. ""Orbital Debris FAQ: How did the Mir space station fare during its 15-year stay in Earth orbit?"". Archived from the original on 2009-08-25. Retrieved 2016-07-23.
  42. Phillip Clark, "Space Debris Incidents Involving Soviet/Russian Launches" Archived 2015-09-24 at the Wayback Machine, Molniya Space Consultancy, friends-partners.org.
  43. Becky Iannotta and Tariq Malik, "U.S. Satellite Destroyed in Space Collision", space.com, 11 February 2009
  44. Paul Marks, "Satellite collision 'more powerful than China's ASAT test", New Scientist, 13 February 2009.
  45. "2 big satellites collide 500 miles over Siberia." yahoo.com, 11 February 2009.
  46. Becky Iannotta, "U.S. Satellite Destroyed in Space Collision", space.com, 11 February 2009.
  47. Leonard David. "Russian Satellite Hit by Debris from Chinese Anti-Satellite Test". space.com.
  48. Schefter, p. 50.
  49. 49.0 49.1 Rob Matson, "Satellite Encounters" Visual Satellite Observer's Home Page.
  50. "STS-48 Space Shuttle Mission Report", NASA, NASA-CR-193060, October 1991.
  51. Christiansen, E. L.; Hyden, J. L.; Bernhard, R. P. (2004). "Space Shuttle debris and meteoroid impacts". Advances in Space Research. 34 (5): 1097–1103. Bibcode:2004AdSpR..34.1097C. doi:10.1016/j.asr.2003.12.008.
  52. 52.0 52.1 Kelly, John.
  53. "Debris Danger."
  54. William Harwood, "Improved odds ease NASA's concerns about space debris" Archived 2009-06-19 at the Wayback Machine, CBS News, 16 April 2009.
  55. D. Lear; et al, "Investigation of Shuttle Radiator Micro-Meteoroid & Orbital Debris Damage" Archived 2012-03-09 at the Wayback Machine, Proceedings of the 50th Structures, Structural Dynamics, and Materials Conference, 4–7 May 2009, AIAA 2009–2361.
  56. https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/20080010742_2008009999.pdf
  57. "cosis.net". site2.e-public.net. Retrieved 2023-01-12.
  58. Henry Nahra, "Effect of Micrometeoroid and Space Debris Impacts on the Space Station Freedom Solar Array Surfaces" Presented at the 1989 Spring Meeting of the Materials Research Society, 24–29 April 1989, NASA TR-102287.
  59. 59.0 59.1 59.2 59.3 de Selding, Peter B. (2014-01-16). "Space Station Required No Evasive Maneuvers in 2013 Despite Growing Debris Threat". Space News. Retrieved 2014-01-17.[permanent dead link]
  60. "Junk alert for space station crew", BBC News, 12 March 2009.
  61. "International Space Station in debris scare", BBC News, 28 June 2011.
  62. Haines, Lester.
  63. Kessler 1991, p. 63.
  64. Bechara J. Saab, "Planet Earth, Space Debris" Archived 2012-04-25 at the Wayback Machine, Hypothesis Volume 7 Issue 1 (September 2009).
  65. Brown, M. (2012).
  66. U.S. Congress, Office of Technology Assessment, "Orbiting Debris: A Space Environmental Problem" Archived 2016-03-04 at the Wayback Machine, Background Paper, OTA-BP-ISC-72, U.S. Government Printing Office, September 1990, p. 3
  67. "Today in Science History" todayinsci.com.
  68. Tony Long, "Jan. 22, 1997: Heads Up, Lottie!
  69. "NASA – Part I – The History of Skylab."
  70. ""NASA – John F. Kennedy Space Center Story."". Archived from the original on 2008-09-24. Retrieved 2016-07-23.
  71. "PAM-D Debris Falls in Saudi Arabia" Archived 2009-07-16 at the Wayback Machine, The Orbital Debris Quarterly News, Volume 6 Issue 2 (April 2001).
  72. "Debris Photos" Archived 2015-10-17 at the Wayback Machine NASA.
  73. "Debris Warning" Archived 2015-10-17 at the Wayback Machine NASA.
  74. Jano Gibson, "Jet's flaming space junk scare", The Sydney Morning Herald, 28 March 2007.
  75. "Space junk falls around airliner" Archived 2012-03-02 at the Wayback Machine, AFP, 28 March 2007
  76. D. Mehrholz; et al;"Detecting, Tracking and Imaging Space Debris", ESA bulletin 109, February 2002.
  77. Ben Greene, "Laser Tracking of Space Debris" Archived 2009-03-18 at the Wayback Machine, Electro Optic Systems Pty
  78. "Orbital debris: Optical Measurements" Archived 2012-02-15 at the Wayback Machine, NASA Orbital Debris Program Office
  79. Pantaleo, Rick. "Australian Scientists Track Space Junk by Listening to FM Radio". web. Retrieved 3 December 2013.
  80. Englert, Christoph R.; Bays, J. Timothy; Marr, Kenneth D.; Brown, Charles M.; Nicholas, Andrew C.; Finne, Theodore T. (2014). "Optical orbital debris spotter". Acta Astronautica. 104: 99–105. doi:10.1016/j.actaastro.2014.07.031.
  81. "The Space-Based Visible Program: Table of Contents". web.archive.org. 2008-03-27. Archived from the original on 2008-03-27. Retrieved 2023-01-12.
  82. H. Klinkrad, "Monitoring Space – Efforts Made by European Countries", fas.org.
  83. "MIT Haystack Observatory" haystack.mit.edu.
  84. "AN/FPS-108 COBRA DANE." fas.org.
  85. Darius Nikanpour, "Space Debris Mitigation Technologies" Archived 2012-10-19 at the Wayback Machine, Proceedings of the Space Debris Congress, 7–9 May 2009.
  86. MEEP Archived 2011-06-05 at the Wayback Machine, NASA, 4 April 2002.
  87. "STS-76 Mir Environmental Effects Payload (MEEP)" Archived 2011-04-18 at the Wayback Machine, NASA, March 1996.
  88. David Portree and Joseph Loftus.
  89. David Whitlock, "History of On-Orbit Satellite Fragmentations" Archived 2006-01-03 at the Wayback Machine, NASA JSC, 2004
  90. 90.0 90.1 Johnson, Nicholas (5 December 2011). "Space debris issues". audio file, @0:05:50-0:07:40. The Space Show. Archived from the original on 27 జనవరి 2012. Retrieved 8 December 2011.
  91. Foust, Jeff (2014-11-25). "Companies Have Technologies, but Not Business Plans, for Orbital Debris Cleanup". Space News. Retrieved 2014-12-06.[permanent dead link]
  92. Foust, Jeff (2014-11-24). "Industry Worries Government 'Backsliding' on Orbital Debris". Space News. Archived from the original on 2014-12-08. Retrieved 2014-12-08. Despite growing concern about the threat posed by orbital debris, and language in U.S. national space policy directing government agencies to study debris cleanup technologies, many in the space community worry that the government is not doing enough to implement that policy.
  93. Foust, Jeff (2014-11-24). "Industry Worries Government 'Backsliding' on Orbital Debris". Space News. Retrieved 2015-11-10.
  94. "Japan Sends Long Electric Whip Into Orbit, To Tame Space Junk". Archived from the original on 2016-12-10. Retrieved 2016-12-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)