అందెల రవమిది పదములదా (పాట)

అందెల రవమిది పదములదా అనే ఈ పాట 1988లో విడుదలైన స్వర్ణకమలం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడారు.[1]

"అందెల రవమిది పదములదా"
అందెల రవమిది పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంఇళయరాజా
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణస్వర్ణకమలం (1988)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
రికార్డు చేసినవారు (స్టుడియో)భాను ఆర్ట్ క్రియెషన్స్
చిత్రంలో ప్రదర్శించినవారుభానుప్రియ , వెంకటేశ్

పాట నేపథ్యం

మార్చు

నృత్యకారిణికి తన నృత్యం విలువ తెలిపే సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాటలో నృత్యకారిణిగా భానుప్రియ, యువకుడిగా వెంకటేష్ నటించాడు.

సాహిత్యం

మార్చు

పాట పల్లవి:

పల్లవి:
ఆమె: అందెల రవమిది పదములదా ||2||
అంబరమంటిన హృదయముదా ||అందెల||
అమృతగానమిది పెదవులదా
అమితానందపు ఎదసడిదా

అతడుశ సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా ||2||
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ||అందెల||

పురస్కారాలు

మార్చు
  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం - 1988.

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (30 April 2017). "అందెల రవమిది..." Archived from the original on 13 August 2017. Retrieved 22 December 2020.

ఇతర లంకెలు

మార్చు
  1. భావలహరి వెబ్ సైట్ Archived 2016-03-05 at the Wayback Machine
  2. లో పాట వీడియో