అంబికా కృష్ణ

అంబికా కృష్ణగా పేరుపొందిన పీవీవీపీ కృష్ణారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నిర్మాత. ఆయన అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా కూడా.తెలుగు రాష్ట్రాల్లో అంబికా కృష్ణ సుపరిచితుడు. 2016లో ఆచంట (భీమవరం)లో జరిగిన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడులో ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి తీర్మానాన్ని అంబికా కృష్ణ ప్రవేశపెట్టారు.

కెరీర్సవరించు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంబికా కృష్ణ జన్మించారు. ఏలూరు అంబికా థియేటర్‌ యజమాని. అతను 2010 ఏప్రిల్ 1 నుండి అంబికా అగర్బతీస్ అరోమా అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికై ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగా కొనసాగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ (APSFTTDC) ఛైర్మన్‌ గా కూడా వ్యవహరించారు.[1]

సినీరంగంలో

1998లో వచ్చిన కన్యాదానం సినిమాతో సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా కూడా సక్సెస్‌ అయ్యారు. ఆడంతే అదోటైపు (2003), వీరభద్ర (2005), జంప్ జిలానీ (2014), ఒకే మాట (2000), మనసున్న మారాజు (2000) లాంటి ఎన్నో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమాలను నిర్మించారు

మూలాలుసవరించు

  1. "Vaartha Online Edition". web.archive.org. 2022-05-28. Archived from the original on 2022-05-28. Retrieved 2022-05-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)