జంప్ జిలాని
జంప్ జిలాని 2014 జూన్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మాణ సారథ్యంలో ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ జంటగా నటించగా, విజయ్ ఎబినేజర్ సంగీతం అందించాడు.[1][2] 2012లో తమిళంలో వచ్చిన కళాకళప్పు చిత్రానికి రిమేక్ చిత్రమిది. ఇందులో నరేష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు.[3]
జంప్ జిలాని | |
---|---|
దర్శకత్వం | ఇ. సత్తిబాబు |
రచన | సుందర్ .సి |
నిర్మాత | అంబికా కృష్ణ |
తారాగణం | అల్లరి నరేష్ ఇషా చావ్లా స్వాతి దీక్షిత్ |
ఛాయాగ్రహణం | దాశరథి సివేంద్ర |
సంగీతం | విజయ్ ఎబినేజర్ |
నిర్మాణ సంస్థ | వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 13 జూన్ 2014 |
సినిమా నిడివి | 164 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- అల్లరి నరేష్ (సత్తిబాబు,రాంబాబు)
- స్వాతి దీక్షిత్ (గంగ)
- ఇషా చావ్లా (మాధవి)
- కోట శ్రీనివాసరావు (సత్తిబాబు,రాంబాబు తాత)
- పోసాని కృష్ణమురళి (ఉగ్ర నరసింహ రెడ్డి)
- రఘుబాబు (ధర్మరాజు)
- ఎం.ఎస్. నారాయణ
- తాగుబోతు రమేష్
- హేమ
- చలపతిరావు తమ్మారెడ్డి
- రావు రమేష్
- వేణుమాధవ్
- బెనర్జీ
- చంద్రమౌళి
- ధన్‌రాజ్
- దువ్వాసి మోహన్
- భరత్ రాజు (నాగరాజు)
- జయప్రకాష్ రెడ్డి (వీర పులి రెడ్డి)
- ఫిష్ వెంకట్
- గీతా సింగ్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఇ. సత్తిబాబు
- నిర్మాత: అంబికా కృష్ణ
- రచన: సుందర్ .సి
- సంగీతం: విజయ్ ఎబినేజర్
- ఛాయాగ్రహణం: దాశరథి సివేంద్ర
- నిర్మాణ సంస్థ: వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్
కథ
మార్చునిడదవోలు పట్టణంలోని తన తాతయ్యకు చెందిన హెూటల్‌ను నష్టాల్లో ఉన్నా అలాగే నెట్టు కొస్తుంటాడు సత్తిబాబు (నరేశ్). అతనికి తాతయ్య (కోట శ్రీనివాసరావు), ఆయన మనవరాలు గంగ (స్వాతి దీక్షిత్ ) తమ వంతు సాయం అందిస్తూ ఉంటారు. ఈలోగా దొంగతనం కేసులో జైలుకెళ్ళిన కోట రెండో మనవడు రాంబాబు (నరేశ్) కూడా విడుదలై బయటకు వస్తాడు. సరిగ్గా ఈ సమయంలో ఓ రియల్టర్ దృష్టి పట్టణం మధ్యలో ఉన్న ఈ హెూటల్ మీద పడుతుంది. దానిని ఎలాగైనా ఖాళీ చేయించి, అక్కడో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటాడు. కానీ దానికి సత్తిబాబు ససేమిరా అంటాడు. ఇంతలో ఈ హెూటల్లో శుచిశుభ్రం లేదని ఫుడ్ ఇన్స్పెక్టర్ మాధవి (ఇషా చావ్లా) నోటీస్ జారీచేస్తుంది. అయితే ఆమెను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఆమెతో ప్రేమలో పడిపోతాడు సత్తిబాబు. మాధవి కూడా అకారణంగానే అతన్ని ప్రేమించేస్తుంది. అయితే ఆమె పులివెందులలోని బావ ఉగ్రనరసింహారెడ్డి (పోసాని)తో నిశ్చయం అవుతుంది. రియాల్టర్ నుండి హెూటలును, బావబారి నుండి ప్రియురాలిని సత్తిబాబు ఎలా రక్షించాడన్నదే మిగతా కథ![4]
పాటలు
మార్చుసంగీత దర్శకుడు విజయ్ ఎబినేజర్, తమిళ చిత్రంలోని ట్యూన్లనే ఈ సినిమాకు ఉపయోగించాడు. 2014, మే 31న పాటలు విడుదలయ్యాయి.[5] ఈ కార్యక్రమంలో నరేష్, స్వాతి దీక్షిత్, ఇషా చావ్లా, మంచు విష్ణు తదితరులు హాట్ ఎయిర్ బెలూన్ ను ఆకాశంలోకి వదిలేసారు.[6]
- లక్కీ లడ్కీ - టిప్పు - 4:10
- ఖానా ఖజాన - సుచిత్ర, స్టీవ్ వాట్జ్ - 4:21
- వెల్ కమ్ - గీతా మాధురి, క్రిష్ - 4:42
- శ్రీమంతుడు - మనో, రాహుల్ నంబియార్, మాళవిక - 3:55
- రంగు రంగు - కార్తీక్ ముత్తురామన్, కార్తీక్ - 4:24
- టంప్ జిలాని (టైటిల్ సాంగ్) - కార్తీక్ సైమన్స్ - 1:59
విడుదల
మార్చుదక్కన్ క్రానికల్ ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది, ఇది టైమ్-పాస్ చిత్రం, చిత్రం రెండవ భాగంలో వినోదం ఉంటుంది అని పేర్కొంది.[7] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది, కథాంశం, సంగీతం, నటన, రచన, ఛాయాగ్రహణం వంటివి బాగున్నాయి" అని పేర్కొంది.[8] ఈ చిత్రం 2014, సెప్టెంబరు 14న జెమినీ టీవీలో ప్రసారమయింది.[9]
మూలాలు
మార్చు- ↑ 123తెలుగు. "చిట్ చాట్: ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ 'జంప్ జిలానీ'కి హైలైట్ అవుతుంది". www.123telugu.com. Retrieved 4 August 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
- ↑ "Jump Jilani - Times of India". The Times of India.
- ↑ చంద్రం (23 June 2014). "స్లంప్ నుండి నరేశ్‌ను గట్టెక్కించని జంప్ జిలానీ". జాగృతి వారపత్రిక. Retrieved 18 February 2024.
- ↑ "Jump Jilani's audio to be launched on May 31 - Times of India". The Times of India.
- ↑ "Jump Jilani's audio launch wows T-town - Times of India". The Times of India.
- ↑ Kavirayani, Suresh (June 13, 2014). "Movie Review 'Jump Jilani': It's a routine comedy". Deccan Chronicle.
- ↑ "Jump Jilani Movie Review {2/5}: Critic Review of Jump Jilani by Times of India" – via timesofindia.indiatimes.com.
- ↑ "Jump Jilani to be aired on TV on September 14 - Times of India". The Times of India.