కన్యాదానం (1998)
కన్యాదానం 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రచన నటించగా, కోటి సంగీతం అందించారు. ఈ సినిమాను అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మించాడు. స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కథానాయకుడు చివరికి అతనికి కన్యాదానంగా ఇచ్చి పెళ్ళి చేయడమే ఈ చిత్ర కథాంశం.[1] ఈ సినిమా 1998 జులై 10న ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది.[2]
కన్యాదానం (1998) | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
నిర్మాత | అంబికా కృష్ణ |
తారాగణం | శ్రీకాంత్, రచన, ఉపేంద్ర |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1998 జూలై 10 |
భాష | తెలుగు |
కథ సవరించు
నలుగురు స్నేహితులు నివాస్, వెంకట్, మరో ఇద్దరు పనికోసం వెతుక్కుంటూ పట్నం వస్తారు. వెంకట్ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆమెకు నివాస్ తో పెళ్ళి అవుతుంది. తర్వాత ఆమె మరెవరినో ప్రేమించింది అని తెలుసుకుని అతని ఊర్లోనే వదిలేసి వస్తాడు. కానీ వెంకట్ ఆమెను తీసుకుని నివాస్ ఇంటికే వచ్చి అక్కడ ఆశ్రయం ఇవ్వమని కోరతాడు. తన భార్య ప్రేమించింది వెంకట్ నే అని తెలిసి వారిద్దరికి పెళ్ళి చేయాలని చూస్తాడు నివాస్. కానీ పెద్దలు ఆ వివాహానికి అంగీకరించరు. చివరకు వాళ్ళందరినీ ఒప్పించి వారిద్దరికీ ఎలా పెళ్ళి చేసాడన్నది మిగతా కథ.
నటవర్గం సవరించు
సాంకేతికవర్గం సవరించు
- దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ
- సంగీతం: కోటి
- నిర్మాణ సంస్థ: అంబిక ఆర్ట్ ప్రొడక్షన్స్
మూలాలు సవరించు
- ↑ "Kanyadanam Cast & Crew". Archived from the original on 2013-07-19.
- ↑ "Kanyadanam Info - Oneindia". Archived from the original on 2013-10-12.