అంబేద్కర్ రాజగృహ ప్రవేశం (నాటకం)

అంబేద్కర్ రాజగృహ ప్రవేశం అనేది అంబేద్కర్ జీవితంపై నిర్మించిన తెలుగు నాటకం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ నాటకానికి పాటిబండ్ల ఆనందరావు రచన, దర్శకత్వం చేకూర్చారు. ఈ నాటకానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది.[1] అంబేద్కర్‌ జీవితం, విద్యా, సంఘర్షణ, ఇబ్బందులను ఎదుర్కొని ఎలా అభివృద్ధి సాధించే విధానం, అంబేద్కర్‌కు చదువులపై జ్ఞానార్జనపైన మక్కువ కలుగుటకు కారణాలు, ఏ సమస్యలు ఎలాంటి సమాజం అంబేద్కర్‌ను పోరాటయోధుడిగా మార్చాయనే విషయాలపై సమగ్రంగా వివరించే నాటకం యిది. ఈ నాటకానికి బి.ఆర్ అంబేద్కర్ ఇల్లు, స్మారక చిహ్నమైన బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం పేరు పెట్టబడింది.

నిర్వహణ

మార్చు

పాటిబండ్ల ఆనందరావు రచించి, దర్శకత్వం వహించిన 'రాజగృహ ప్రవేశం' నాటకాన్ని స్పందన థియేటర్ ప్రదర్శించింది. సుమారు 60మంది కళాకారులు, సాంకేతిక వర్గం నిర్వహించిన అంబేద్కర్ నాటకం రసవత్తరంగా వుంటుంది. అంబేద్కర్ చిన్ననాటి జీవితం, చదువుకోని పెద్దయి దళితుల కోసం అహార్నిశం పాటుపడిన ఇతివృత్తంతో సాగిన నాటకాన్ని రచయిత తనదైన శైలిలో మలిచారు. అగ్రవర్ణాల వారి దురహంకారాన్ని అంబేద్కర్ ప్రశ్నించే సన్నివేశ ప్రేక్షకుల ఆదరణ ఇంకా చప్పట్లో మారుమోగిపోతుంది.

పాత్రలు

మార్చు

అంబేద్కర్ పాత్రలో వెంకట్ గోవాడ

 
వెంకట్ గోవాడ

కలెక్టర్ పాత్రలో ఎస్‌.ఎం. బాషా

అంబేద్కర్ భార్య రమబాయిగా సురభి ప్రభావతి

కేతాస్కర్ దొర పాత్రలో రజితమూర్తి

టీచర్ పాత్రలో నాయుడు గోపి

ప్రజాదరణ

మార్చు

అంబేద్కర్ రాజగృహ ప్రవేశం నాటకము ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో అన్ని జిల్లాలలో ప్రదర్శించారు. నాటకాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వందలాది మందితో కిక్కిరిసి పోతుంది. నాటకాల పట్ల ఆసక్తి కనబర్చని యువత, విద్యార్థులు ఈ నాటకాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తి చూశారు.[2]

మొదటి భాగంలో విశేషాలు

మార్చు

ముఖ్యంగా ఈ మొదటి భాగంలో అంబేద్కర్‌ జీవనశైలి, విద్యాభ్యాసం, భాధలు, అయన అనుభవించిన కష్టాలు, సంఘర్షణలుపై ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది, ఈ భాగం విద్యార్థులను తమ లక్ష్యాలను ఎలా నిర్ణయించు కోవాలనే విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ నాటక మొదటి ప్రదర్శన 2010 ఏప్రిల్‌ 13 న జరిగింది. ఆనంతరం హైదరాబాద్‌ లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో జూలై 12 న ప్రదర్శించారు. ప్రదర్శనను ఎంతగానో ఆస్వాదించిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆకర్షితులై ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ వారి సౌజన్యంతో రాష్ట్రంలోని పది జిల్లాలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.[3]

మూలాలు

మార్చు
  1. http://www.andhrajyothy.com/districtnewsshow.asp?qry=2010/jul/13/districts/hyd/13hyd11&more=2010/jul/13/districts/hyd/hyd&date=7/13/2010[permanent dead link]
  2. http://www.andhrabhoomi.net/kalabhoomi/ambedkar-naatakam-527[permanent dead link]
  3. "నాటకం గూర్చి". Archived from the original on 2016-03-04. Retrieved 2013-09-15.