అంబ అనే పౌరాణిక నాటకాన్ని చిలుకూరి నారాయణరావు (1889 - 1951) వాడుక భాష ప్రాచుర్యం కోసం 1933 ప్రచురించారు.

తెలుగు సాహిత్య భాషను కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రారంభమైన వ్యవహారిక భాషోద్యమానికి ఈ గ్రంథానికి సంబంధం ఉంది. భాషావేత్త, మహా పండితుడు గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషోద్యమానికి లక్షణకర్తగా సిద్ధాంత పరమైన పోరాటం చేస్తూండగా, శ్రీపాద, చిలుకూరి వంటి వారు తమ రచనలు వాడుక భాషలో రచించి బలోపేతం చేశారు. అదే క్రమంలో ఈ నాటకాన్ని వాడుక భాషలో భీష్మ-శిఖండి చరిత్రముగా రచించారు. రచయిత చిలుకూరి నారాయణరావు సంగీతం, పద్యాలు, ఔచిత్యానికి సంబంధం లేని గ్రాంథికాల నుంచి నాటకాలను బయటపడేసి వాడుక భాషలో ఒరవడి పెట్టేందుకు రాశారు. ముందుమాటలో దీన్ని గ్రాంథికంలోకి మార్చి ప్రదర్శించవద్దని నటులు, దర్శకులను విజ్ఞప్తి చేశారాయన.

పాత్రలు మార్చు

 • అంబ : కథానాయిక
 • అంబిక
 • అంబాలిక
 • కాశీరాజు : అంబాంబికాంబాలికల తండ్రి
 • సాళ్వరాజు : అంబ కోసము భీష్మునితో యుద్ధముచేసిన రాజు
 • భీష్ముడు : కథానాయకుడు
 • పరశురాముడు : భీష్ముని గురువు
 • కుబేరుడు
 • స్థూలకర్ణుడు : కుబేరుని వనపాలకుడు
 • అర్జునుడు
 • కృష్ణుడు
 • శిఖండి : అంబ పునర్జన్మము పొందినవాడు, ద్రుపదరాజు పుత్రుడు
 • దేవదూత
 • రెండు పిశాచములు
 • పప్పుశాస్త్రి, నేతావధానులు : ఇద్దరు బ్రాహ్మణులు

మూలాలు మార్చు