అకుల్ బాలాజీ (జననం 1979 ఫిబ్రవరి 23) కన్నడ, తెలుగు టెలివిజన్ కార్యక్రమాలు, చిత్రాలలో పనిచేసే భారతీయ నటుడు, టెలివిజన్ హోస్ట్, నృత్యకారుడు. ఆయన టెలివిజన్ షోలు నిర్వహించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. అలా, ఆయన దాదాపు ఒక దశాబ్దం పాటు కన్నడ పరిశ్రమలో ఉన్నాడు. ఆయన ఆసియానెట్ సువర్ణ ఛానెల్‌లో కన్నడ స్టార్ సుదీప్‌తో కలిసి హిట్ కన్నడ రియాలిటీ షో ప్యాతే హద్గీర్ హల్లీ లిఫుకి సహ-హోస్ట్ గా చేసినందుకు ప్రసిద్ధి చెందాడు.[1] ఆయన కలర్స్ కన్నడ ఛానెల్‌లో తకధిమిత అనే కన్నడ డ్యాన్స్ రియాలిటీ షోను హోస్ట్ చేశాడు.

అకుల్ బాలాజీ
జననం
ఆకుల బాలాజీ

(1979-02-23) 1979 ఫిబ్రవరి 23 (వయసు 45)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజ్యోతి అకుల (m.2008)
పిల్లలుక్రిషన్ నాగ్

2014లో, ప్రజల ఓటు ద్వారా, ఆయన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కన్నడ రెండవ సీజన్‌ను గెలుచుకున్నాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరులో ఆయన 1979 ఫిబ్రవరి 23న జన్మించాడు. 16 ఏళ్ల వయస్సులో బెంగళూరుకు వెళ్లిన ఆయన, భరతనాట్యంలో గురు ఉషా దాతార్ వద్ద శిక్షణ పొందాడు. ఆ తరువాత, ఆయన మధు నటరాజ్ నేతృత్వంలోని "నాట్య STEM డాన్స్ కాంప్ని"లో చేరాడు. ఆయన గురు మాయా రావు వద్ద కథక్ కూడా నేర్చుకున్నాడు.

2004లో, ఆయన బాదల్ సర్కార్ రూపొందించిన ఏవం ఇంద్రజిత్, దర్శకుడు పవన్ కుమార్ అనుసరణలలో థియేటర్‌ ఆర్టిస్టుగా చేసాడు.[2] ఆయన మహేష్ దత్తాని ఆధ్వర్యంలో అడ్వాన్స్ యాక్టింగ్ వర్క్‌షాప్ కూడా నిర్వహించాడు.

అకుల్ బాలాజీ జ్యోతి అకుల్‌ను 2008లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

కెరీర్ మార్చు

టెలివిజన్ నటుడిగా ఆయన కన్నడలో కెరీర్ ప్రారంభించి హోస్ట్‌గా ఎదిగాడు. ఆయన 2010 సంవత్సరానికి బిగ్ ఎఫ్ఎమ్ బిగ్ టీవీ ద్వారా "మోస్ట్ పాపులర్ యాంకర్ అవార్డ్" గెలుచుకున్నాడు.[3][4] జీ కన్నడలో కునియోను బారా, కామెడీ కిల్లాడిగలు వంటి సూపర్‌హిట్ షోలను ఆయన గెలుచుకున్నాడు. ఆయన ఆసియానెట్ సువర్ణ కోసం ప్యాటే హుద్గీర్ హల్లీ లిఫు సీజన్ 1 అండ్ 2, హళ్లీ హైదా ప్యాటేగ్ బండ, ప్యాటే మండి కడిగే బండ్రు 1, ప్యాటే మండి కడిగే బండ్రు 2, అండమాన్ దీవులలో చిత్రీకరించబడిన, హోసా లవ్ స్టోరీ, నోడి వంటి సూపర్ హిట్ రియాలిటీ షోలను హోస్ట్ చేశాడు.[5]

ఆయన ఈటీవీ కన్నడలో మనే ముండే మహాలక్ష్మి అనే గేమ్ షోను నిర్వహించాడు.[6] ఆయన జీ తెలుగు కోసం సై అంటే సై హోస్ట్ చేశాడు. ఆయన ఈటీవి కన్నడ కోసం తకడిమిత డ్యాన్సింగ్ స్టార్స్ అనే రియాల్టీ షోను కూడా హోస్ట్ చేశాడు.[7] ఆయన టెలివిజన్ ధారావాహిక అగాథ (2002), గుప్త గామిని, యావ జనుమాధ మైత్రి , జగలగంటియారు, పెళ్లినాటి ప్రమాణాలు (2012)లలో నటించాడు. ఆయన 2021లో ఊహలు గుసగుసలాడేతో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో తిరిగి వచ్చాడు.[8]

2009లో వచ్చిన తెలుగు సినిమా నేరము - శిక్షలో ఆయన నటించాడు.[9][10]

మూలాలు మార్చు

  1. "Pyate Hudgir Halli Life". Exchange for Media.com. Archived from the original on 29 October 2013.
  2. "Evam Inderjit". Deccan Herald Metrolife. 2004-09-30. Archived from the original on 17 December 2013. Retrieved 15 December 2013.
  3. "Kannada Television Awards". IndianTelevision.com. Archived from the original on 17 December 2013. Retrieved 15 December 2013.
  4. "Kuniyonu Baara". Zee Kannada. Archived from the original on 1 May 2010.
  5. "Hosa Luv Story". IndianTelevision. Archived from the original on 17 December 2013. Retrieved 15 December 2013.
  6. "Mane Munde Mahalakshmi". Oneindia Kannada. 29 December 2012. Archived from the original on 17 December 2013. Retrieved 15 December 2013.
  7. "Dancing Star in ETV". Cineblitz. Archived from the original on 10 January 2014. Retrieved 14 January 2014.
  8. "Akul Balaji returns to acting with Telugu TV show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-16.
  9. సైరా (3 July 2009). "పాత ఫార్ములా నేరము - శిక్ష (సినిమా సమీక్ష)". సూపర్ హిట్. Retrieved 19 August 2022.
  10. "Neramu-Siksha in re-recording". The New Indian Express. 15 May 2012.