నేరము - శిక్ష (2009 సినిమా)

నేరము - శిక్ష 2009 జూన్ 30వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. విజయ నిర్మల దర్శకత్వంలో విజయకృష్ణా మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబడింది.

నేరము - శిక్ష
(2009 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
జయసుధ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ విజయకృష్ణా మూవీస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ : బొల్లిముంత నాగేశ్వరరావు
  • మాటలు: పరుచూరి బ్రదర్స్
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, వెనిగెళ్ళ రాంబాబు
  • ఛాయాగ్రహణం: శ్రీనివాసరెడ్డి
  • సంగీతం: కోటి
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: విజయనిర్మల

భార్గవ్ న్యాయవాద ప్రవీణుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతని భార్య అర్చన. కొడుకు అఖిల్. అఖిల్‌కు శిరీషతో పెళ్ళి కుదురుతుంది. అయితే శిరీష రోహిత్ అనే మరో యువకుని ప్రేమిస్తూ ఉంటుంది. శిరీష విషయమై అఖిల్, రోహిత్‌లకు కొట్లాట జరుగుతుంది. ఆ తర్వాత అఖిల్ హత్యకు గురు అవుతాడు. నేరం రోహిత్‌పై పడుతుంది. రోహిత్ భార్గవ్ మాజీ ప్రేయసి సౌజన్య కొడుకు. తన బిడ్డ నిరపరాధి అని, అతనిని రక్షించమని భార్గవ్‌ను వేడుకుంటుంది సౌజన్య. భార్గవ్ తన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి రాజీనామా చేసి రోహిత్ తరఫున కోర్టులో వాదించడానికి పూనుకుంటాడు. మాజీ ప్రేయసి కొడుకును రక్షించడానికి స్వంత కొడుకు హత్యకు ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశాన్ని వదిలేసిన భార్గవ్ తీరును అతని కుటుంబం నిరసిస్తుంది. భార్గవ్, అర్చనల మధ్య మనస్పర్ధలు వస్తాయి. అఖిల్‌ను చంపిన అసలు హంతకులు ఎవరు? న్యాయాన్ని రక్షించి తాను గెలిచి తన కుటుంబాన్ని తిరిగి ఎలా గెలిపించుకున్నాడు? అనేది మిగిలిన కథ.[1]

మూలాలు

మార్చు
  1. సైరా (3 July 2009). "పాత ఫార్ములా నేరము - శిక్ష (సినిమా సమీక్ష)". సూపర్ హిట్. Retrieved 19 August 2022.