అక్కా చెల్లెలు 1970 జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది ఎం.ఏ.తిరుముగం దర్శకత్వంలో శాండో చిన్నప్పదేవర్ 1969లో నిర్మించిన అక్కై-తంగై అనే తమిళ సినిమాకు తెలుగు రీమేక్.జగపతి ఆర్ట్స్ పతాకంపై వి. బి. రాజేంద్ర ప్రసాద్, వి. కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం అక్కినేని సంజీవి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు

అక్కా చెల్లెలు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం అక్కినేని సంజీవి
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్,
వి.కృష్ణప్రసాద్
రచన వి.సి. గుహనాథన్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
ఘట్టమనేని కృష్ణ,
షావుకారు జానకి,
విజయనిర్మల,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం,
రమాప్రభ,
శాంతకుమారి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
సంభాషణలు ఆత్రేయ
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతికవర్గం మార్చు

  • కథ: పూవై కృష్ణన్
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నృత్యం చిన్ని, సంపత్
  • కళ: జి.వి.సుబ్బారావు
  • కూర్పు: టి.వి.బాలు
  • పోరాటాలు: రాఘవులు
  • ఛాయాగ్రహణం: ఎం.వెంకటరత్నం
  • నిర్మాత వి.కృష్ణప్రసాద్
  • దర్శకత్వం ఎ.సంజీవి

పాత్రలు-పాత్రధారులు మార్చు

కథ మార్చు

ఓ పట్టణంలో పేరున్న న్యాయమూర్తి రామచంద్రరావు. అతని తల్లి జయమ్మ , తమ్ముడు వేణు. వారి ఆప్తుడు, కోర్టులో గుమస్తా ధర్మయ్య, అతని కుమారుడు భాను. ఫొటోస్టూడియో అధినేత అల్లు రామలింగయ్య, కూతురు సరోజ. ఊళ్లో కాయకష్టం చేసుకుంటూ చెల్లెలు విజయను పట్నంలో న్యాయవాద విద్య చదివించే అమాయకపు, నిజాయితీ యువతి జానకి. పట్నంలో చదువుతున్న వేణు, విజయ ప్రేమించుకుంటారు. జానకి, నిజాయితీ, మంచితనం నచ్చిన రామచంద్రరావు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అంతకుముందు ఓ స్రీని హత్య చేస్తున్న వ్యక్తిని విజయ అనుకోకుండా చూస్తుంది. తరువాత అక్కకు కాబోయే భర్త, తనకు కాబోయే బావే.. తానుచూసిన హంతకుడని గ్రహిస్తుంది. అక్క పెళ్లి జరిగాక, అతనిని కోర్టులో దోషిగా ఆరోపణ చేస్తుంది. అన్న తరపున వేణు లాయర్‌గా నిలబడతాడు. కేసును పరిశోధించి, తన అన్న రామచంద్రరావు హంతకుడు కాదని నిరూపిస్తాడు. తన అన్నతోపాటు జన్మించిన కవల సోదరుడు రాజా, తోటమాలి ఆ దారుణానికి పాల్పడ్డారని నిరూపిస్తాడు. అన్న నిర్దోషిగా విడుదలవ్వడంతో, వేణు -విజయల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]

పాటలు మార్చు

  1. ఇది మతికి మనసుకు పోరాటం తల్లి మనిషితొ - ఘంటసాల . రచన. ఆత్రేయ..
  2. ఓ పిల్లా ఫఠఫఠలాడిస్తా ఓ ఓపిల్లా చకచక - ఘంటసాల, పి.సుశీల . రచన. కొసరాజు
  3. చకచకలాడే పడుచుంది రెపరెపలాడె పొగరుంది - పి.సుశీల , రచన. ఆరుద్ర
  4. చిటాపటా చినుకులతో కురిసింది వాన - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
  5. పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులోయమ్మ తుమ్మెదా - పి.సుశీల , రచన. ఆత్రేయ
  6. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన - ఘంటసాల, పి.సుశీల . రచన; ఆత్రేయ.
  7. సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా సరదాలు - పి.సుశీల, రచన. ఆరుద్ర.

వనరులు మార్చు

  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి. "ఫ్లాష్ బ్యాక్ @ అక్కా చెల్లెలు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 13 June 2020.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు

బయటిలింకులు మార్చు