ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యొక్క అగ్నిమాపక శాఖ గత కొన్ని శతాబ్దాలుగా అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి, అసలు ప్రమాదాలు జరగకుండాఅ తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయండంలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించింది.

చరిత్ర

మార్చు

రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో సామాన్య ప్రజలను ప్రమాదం నుండి కాపాడడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎయిర్ రెయిడ్ ప్రికాషంస్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించింది. దీనిని 1942లో అగ్నిమామప శాఖగా మార్చారు.

పాలనా సౌలభ్యం కోసం దీనిని మూడు ప్రాంతాలుగాను, ప్రాంతాలను డివిజన్లుగాను విభజించారు. తూర్పు ప్రాంతం విశాఖపట్నంలోను, దక్షిణ ప్రాంతం అనంతపురంలోను, మధ్య ప్రాంతం హైదరాబాద్ లోనూ ఉన్నాయి.

అగ్నిమాపక కేంద్రాలు

మార్చు

1956లో మన రాష్ట్రంలో 29 అగ్నిమాపక కేంద్రాలు, 966 మందితో పనిచేస్తుండగా; ఇది 1985 నాటిని 173 కి పెరిగింది. సిబ్బంది సంఖ్య 3,670 కి పెరిగింది. 1987 నాటికి రాష్ట్రంలో 206 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 4,198 మంది పనిచేస్తున్నారు.[1] 2005 సంవత్సరం నాటికి ఈ కేంద్రాల సంఖ్య 251 కి పెరిగింది.

ఈ శాఖ 1985-86లో 10,113 అగ్ని ప్రమాదాలను ఎదుర్కొన్నది. వీటిలో 30.34 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లగా రూ. 105.82 కోట్ల ఆస్తిని రక్షించారు. ఈ ప్రమాదాలలో 94 మంది చనిపోయారు; సభ్యులు 97 మందిని రక్షించారు.

1986-87లో 10,075 ప్రమాదాలు సంభవించగా వీటిలో రూ. 33.73 కోట్ల ఆస్తినష్టం జరిగింది. అయితే ఈ శాఖ రూ. 162.10 కోట్ల ఆస్తిని రక్షించ గలిగింది. ఈ ప్రమాదాలలో 122 మంది చనిపోగా, 272 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించింది.

అగ్నిమాపక వారం

మార్చు

1944 సంవత్సరం ఏప్రిల్ 14 తేదీన మందుగుండు సామగ్రిని తీసుకొనివెళ్తున్న కార్గో షిప్ SS Fort Stikine బొంబాయిలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఇందులో వందల మంది చిక్కుకున్నారు. అందులో 66 మంది మరణించారు. అది భయంకరమైన ఈ అగ్ని ప్రమాదంలో తమ సేవల్ని అందించిన వారికి శ్రద్ధాంజలిగా ఏప్రిల్ 14 నుండి 20 తేదీ వరకు అగ్ని మాపక వారం గా దేశమంతా జరుపుకుంటున్నాము. ఈ వారం రోజులు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేస్తారు.

యివి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. అగ్నిమాపకశాఖ, ఆంధ్ర ప్రదేశ్ వార్షికదర్శిని, పేజీ 232.
  • ఆంధ్ర ప్రదేశ్ వార్షిక దర్శిని - 1988.

బయటి లింకులు

మార్చు