అడవి రాముడు (2004 చిత్రం )

2004 సినిమా

అడవి రాముడు అనేది 2004 వచ్చిన తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రానికి బి. గోపాల్గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలు, రమ్య కృష్ణన్ ప్రభాస్‌తో కలిసి ఐటమ్ సాంగ్లో నటించారు. గిరిజన యువకుడు , అతని చిన్ననాటి ప్రియురాలు మధ్య జరిగిన ప్రేమకథయే ఈ చిత్రం . వర్షం చిత్రం విజయవంతం అయిన వెంటనే ప్రభాస్ తదుపరి నటించిన చిత్రం ఇది. విడుదలైన తరువాత ఇది విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందనను పొందింది, బాక్స్ ఆఫీస్ వద్ద విపత్తుగా మారింది . ఈ చిత్రం తరువాత, 2009 లో ది స్ట్రాంగ్ మ్యాన్ బాదల్ గా హిందీలో పిలువబడింది.

Adavi RamudU
దస్త్రం:Adavi Ramudu.jpg
దర్శకత్వంB. Gopal
నిర్మాతChanti Addala
రచనB. Gopal
Paruchuri Brothers
నటులుPrabhas
Aarti Agarwal
సంగీతంMani Sharma
ఛాయాగ్రహణంVSR Swamy
కూర్పుKotagiri Venkateswara Rao
పంపిణీదారుKAD Movies
విడుదల
21 మే 2004
భాషతెలుగు
ఖర్చు60 million
బాక్సాఫీసు50 million

ప్లాట్సవరించు

తన బాల్యంలో, మధు ఒక గ్రామంలోని అబ్బాయితో స్నేహం చేస్తుంది . ఆమె మామ వచ్చి అబ్బాయిని గిరిజనుడిగా అవమానిస్తాడు. మధు అతనిని విద్యను పొందమని , అప్పుడు ప్రజలు అతనిని ఎక్కువగా గౌరవిస్తారాని చెప్తుంది . 10 సంవత్సరాల తరువాత, బాలుడు రాము ( ప్రభాస్ ) కాలేజీకి వస్తాడు. అక్కడ తనకు చాలా కావలసిన మహిళ మధు ( ఆర్తి అగర్వాల్ ) ను కలుస్తాడు.అ కాలేజీలో మధు అతనితో ప్రేమలో పడుతుంది . తరువాత, ఆమె తన పుట్టినరోజు పండుగనాడు అతనిని చదువుకోమన్న చిన్ననాటి అమ్మాయిని నినేనని అతనికి మధు వెల్లడిస్తుంది . అయితే, మధు తల్లి త్రిభువన ( తెలంగాణ శకుంతల ) అతన్ని అవమానించి, తన కూతురి పార్టీ, తన ఇంటి నుండి బయటకు విసిరివేయిస్తుంది . త్రిభువన మాఫియా లేదా రాజకీయాలను ఉపయోగించడం ద్వారా ఆమె కోరుకున్నది చేయగల ఉధృతమైన ఆలోచనకల మహిళ. ఆమె రాముడిని చంపాలనుకుంటుంది.అ తరువాత ఏమి జరుగుతుందో అనేదే మిగతా చిత్రం .

చిత్రంలో నటించినవారుసవరించు

సంగీతం వివరాలుసవరించు

అడవి రాముడు చిత్రానికి సంగీతాన్ని మణి శర్మ కంపోజ్ చేశారు, ఆదిత్య మ్యూజిక్ విడుదల చేశారు

  • ఇందులో మొత్తముగా ఆరు పాటలు కలవు
  • జింక వేట అను పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు
  • ఆకాశం సాక్షిగా అను పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు
  • నగరం అను పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు
  • గోవింద అను పాటను భువన చంద్ర రచించారు
  • అడుగేస్తేనే అను పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు
  • ఆరేసుకోబోయి అను పాటను వేటూరి సుందరరామ మూర్తి రచించారు
  • ఈ చిత్రంలో మొత్తం 32:21 నిమిషాలు పాటలకు కేటాయిచారు
  • ఈ చిత్రం 20004లో విడుదల అయింది

విమర్శనాత్మక ప్రతిస్పందనసవరించు

ఈ చిత్రం విమర్శకుల నుండి విమర్శనాలను అందుకుంది. వారిలో చాలా మంది క్లిచ్డ్ ప్లాట్, నీరసమైన ప్రదర్శనను , నిరుత్సుకమైన సంగీతమును విమర్శించారు.

ఈ చిత్రం పేలవమైన రిసెప్షన్‌కు తెరవబడింది, అలాగే త్వరగా విపత్తుగా ప్రకటించబడింది.

బాహ్య లింకులుసవరించు

  • అడవిరాముడు చిత్రానికి సంబంధిచిన సమాచారం ఐ ఏం డి లో చూడవచ్చును