అడోబీ సిస్టెమ్స్

(అడోబ్ నుండి దారిమార్పు చెందింది)

అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్ (Adobe Systems Incorporated) అమెరికాకు చెందిన, మల్టీమీడియా సాఫ్ట్‌వేర్లు అందించే భాహులజాతి సంస్థ. పేజ్ మేకర్, ఫోటోషాప్,అక్రోబాట్, ఫ్లాష్ లాంటి సాఫ్ట్ వేర్లను ఈ కంపెనీయే అందించింది.

అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్
తరహాPublic (NASDAQ: ADBE)
స్థాపనఫ్లాగికాన్(flagicon), కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్త రాష్ట్రములు (1982)
ప్రధానకేంద్రముజోస్ సాంజోస్స్,కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికా సంయుక్తరాష్ట్రములు
కీలక వ్యక్తులుచార్లెస్ గేస్కే (Charles Geschke)
,
జాన్ వార్నోక్(John Warnock)
: వ్యవస్థాపకులు,
శంతను నారాయణ్
ప్రధాన కార్య నిర్వహనాధికారి(CEO)
పరిశ్రమకంప్యూటరు సాఫ్ట్ వేర్,
ఉత్పత్తులు* అక్రోబాట్
  • అక్రోబాట్ కనెక్ట్ ప్రొఫెషనల్
  • అఫ్టర్ ఎఫ్ఫెక్ట్స్
  • కోల్డ్ ఫ్యూజన్
  • డిజైన్ ప్రీమియం
  • డ్రీమ్ వీవర్
  • ఫ్లాష్
  • ఫ్లెక్స్
  • ఇల్లస్త్రేటర్
  • ఇండిజైన్
  • లైవ్ సైకిల్ ఎంటర్ ప్రైజ్ సూట్
  • ఫోటోషాప్
  • ఫోటోషాప్ ఎలిమెంట్
  • పేజ్ మేకర్
  • అడోబీ ప్రీమియర్ ప్రొ
  • మొబైల్ ఉత్పత్తులు
రెవిన్యూ$3.157 billion USD (2007)
ఉద్యోగులు6677 (December,2007)
నినాదముఅడోబీ తో ఉత్తమం
(Better by Adobe)
వెబ్ సైటుఅడోబీ సిస్టమ్స్

కంపెనీ చరిత్ర

మార్చు
 
శంతన్ నారాయణ్
అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ ప్రెసిడెంట్
ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సిఈఓ)

అడోబీ సిస్టమ్స్ సంస్థ అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సాన్ జోస్ పట్టణములో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది.1982 వ సంవత్సరంలో అడోబీ సంస్థనిచార్లెస్ గేస్కే (Charles Geschke), జాన్ వార్నోక్(John Warnock)స్థాపించి, అభివృద్ధి చేసారు.[1] ఇప్పుడు ప్రపంచములోనే మల్టిమీడియా సాఫ్టువేరు తయారీ,పరిశ్రమల,ప్రభుత్వాల,ప్రజల రోజువారి కార్యకలాపాల కంప్యూటర్,ప్రచురణ,పంపిణీ,నిక్షిప్త ఉపకరణాల,సమస్యల పరిష్కారాలలో ఒక ప్రధాన మయిన సంస్థగా ఎదిగింది.
ఇప్పుడు 6677 మంది సిబ్బందితో 3,157 బిలియన్ అమెరికా డాలర్ల వార్షిక ఆదాయంతో ప్రపంచంలోని(తన రంగంలో) మొదటి పది పెద్ద కంపనీలలో ఒకటిగా ఉందంటేనే అడోబీ కంపెనీ స్థాయి ఎమిటో అర్ధం చేసికోవచ్చు.సుమారు 40 శాతం నిపుణులు సాన్ జోష్ లోని ప్రధాన కార్యాలయమ్లో పనిచేస్తుంటే, మిగతావారు సీటేల్,శాన్ ఫ్రాన్సిస్కో,మినియాపోలీస్,న్యూటన్,శాన్ లూయిస్ ఒబిస్పో,(అమెరికా ),వోట్టావా(కెనడా),హంబుర్గ్ (జర్మనీ)నోయిడా(న్యూ ఢిల్లీ),బెంగళూరు(భారతదేశం) లో ఇతర అభివృద్ధి కేంద్రాలలో పనిచేస్తున్నారు.
అడోబీ సంస్థకి ప్రధాన పోటీదారులు యాపిల్, మైక్రోసాఫ్ట్, క్వార్క్.

 
అడోబీ సంస్థ ప్రధాన కార్యాలయం
  • కంపెనీ ప్రెసిడెంట్,ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సిఈఓ)

అడోబీ సిస్టం ఇన్ కార్పొరేట్ కొత్త అధ్యక్షుడిగా,ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా(సిఈఓ)గా శంతన్ నారాయణ్ను నియమించారు.ఈయన భారతదేశంలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డారు. హైదరాబాదు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన శంతను నారాయణ్ [2] చేతిలో ఐదు పేటెంట్లు ఉన్నాయి. బర్కిలీ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా హాస్ బిజినెస్ స్కూల్లో ఎం బి ఎ చేశారు. అదే స్కూల్ సలహా మండలిలో ఈయనకు సభ్యత్వం లభించింది. నారాయణ్ మొదట పిక్స్ ట్ర అనే పేరుతో ఫోటో షేరింగ్ సాఫ్టువేర్ కంపెనీని నడిపాడు. 1998 జనవరిలో అడోబీ కంపెనీలోకి అడుగుపెట్టారు. అప్పటిలో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూపునకు ఉపాధ్యక్షుడిగా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించాడు. ఏడాది తిరిగే సరికి పదోన్నతి లభించి కంపెనీ ప్రపంచవ్యాప్త ఉత్పతుల విబాగానికి సీనియర్ ఉపాధ్యక్షుడు అయ్యారు.

2001 మార్చి కల్లా వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ అభివృద్ధి విభాగానికి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి‌గా ఎదిగారు.2005 జనవరి నుంచి ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్నారు. కంపెనీ రోజు వారి అంతర్జాతీయ కార్యకలాపాలన్ని పర్యవేక్షించడం, దీర్ఘకాల ప్రాతిపదికన అనుసరించాల్సిన ప్యుహాలను ఖరారుచేయడం, పరిశోధన,అభివృద్ధి విభాగానికి మార్గదర్శకత్వం వహించడం, పెట్టుబడులపై సిఫారసులు ఇవి నారాయణ ప్రస్తుత విధులు. ఇప్పుడు ఈయనకు 49 ఏళ్లు ఇంత కాలం కంపెనీ ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న బ్రూస్ షి జెన్ స్థానాన్ని నారాయణ అలంకరించనున్నారు.2005లో అడోబీ కంపెనీ మాక్రో మీడియా ఇంక్ ను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని షిజెన్,శంతన్ ఇరువురూ కలసి తీసుకున్నారు. వీడియో, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, మొబైల్ సొల్యూషన్స్ విపణులలో అడోబీ ఉనికిని దృఢపరిచిన ఎత్తుగడ అది.మరో భారతీయ సంతతి అమెరికన్ ఘన విజయమిది.

కంపెనీ విశేషాలు

మార్చు

ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్

మార్చు

అడోబి కంపెనీ వారు ఈ మధ్యనే ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్ పేరుతో ఆన్ లైన్ ఫోటో ఎడిటింగ్ సౌకర్యం కలిగించారు. ఎవరైనా రిజిస్టర్ చేసుకుని తమ ఫోటోలని ఎగుమతి చేసుకుని కావలసిన మార్పులు చేర్పులు(ఎడిటింగ్)చేసుకుని ఆల్బం రూపంలో ఉంచుకోవటంతో పాటు ఫేస్ బుక్ లాంటి సైట్లకి ఎగుమతి చేసికోవచ్చు లేదా తమ ఈ మెయిలుకు పంపుకోవచ్చు. ఇందుకోసం అడోబి వారు 2జీబి స్పేస్ ఉచితంగా ఇస్తున్నారు. తమ ఆదాయాన్ని పెంచుకోవటంతో పాటు ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లకి(సంస్థలకి) గట్టి పోటీ ఇవ్వటం అడోబి వారి వ్యాపార ఎత్తుగడగా కనిపిస్తుంది.

ఉత్పత్తులు ఉపయోగం వెర్షన్ సమాచారం సమాచారం
అక్రోబాట్ (acrobat) cell cell
అక్రోబాట్ కనెక్ట్ ప్రొఫెషనల్(Acrobat connect professional) ఆన్ లైన్ కొలాబరేషన్ టూల్,వెబ్,ప్రాజెక్ట్,టీం కొలాబరేషన్ సాఫ్టువేరు cell అక్రోబాట్ కనెక్ట్ ప్రొఫెషనల్
అఫ్టర్ ఎఫ్ఫెక్ట్స్(After effects) మోషన్ గ్రాఫిక్ డిజ్యేన్,విజువల్ ఎఫ్ఫెక్ట్స్ సాఫ్టువేరు సిఎస్3 ప్రొఫెషనల్ అఫ్టర్ ఎఫ్ఫెక్ట్స్
కోల్డ్ ఫ్యూజన్8(Coldfusion 8) అప్లికేషన్ సర్వర్ సాఫ్టువేరు కోల్డ్ ఫ్యూజన్8 కోల్డ్ ఫ్యూజన్
దిజయిన్ ప్రీమియం (Design premium) cell cell
డ్రీమ్ వీవెర్ వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్ సిఎస్3 డ్రీమ్ వీవెర్
ఫ్లాష్ (Flash) ఇంటరాక్టివ్ మల్టిమేడియా,డిజయిన్,వెబ్ డెవలప్మెంట్ సాఫ్టువేరు సిఎస్3 ఫ్లాష్
ఫ్లేక్స్ (Flex) అన్ని ఫ్లాట్ ఫారం లలో రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ తయారు చేయుటకు,అప్లికేషన్స్ డేవలోప్మెంట్ టూల్ ఫ్లేక్స్2 ఫ్లేక్స్
ఇలస్త్రేటర్ (Illustrator) డిజిటల్ గ్రాఫిక్ డిజ్యేన్ సాఫ్టువేరు, కంప్యూటర్ గ్రాఫిక్ డిజ్యేన్ సోలుషన్స్ సిఎస్3 ఇలస్త్రేటర్
ఇండిజయిన్ (Indesign) డెస్కుటాపు పబ్లిషింగ్ సాఫ్టువేరు సిఎస్3 ఇండిజయిన్
లైవ్ సైకల్ ఎంటర్ ప్రైజ్ సూట్ (Live cycle enterprize suite) జె2ఈఈ(J2EE)ఆధారంగా తయారుచేయబడిన సర్వర్ సాఫ్టువేరు(Adobe LiveCycle Enterprise Suite (ES) is a suite of J2EE-based J2EE (Java 2 Enterprise Edition) server software products from Adobe Systems Incorporated. LiveCycle ES combines its PDF (Portable Document Format) technology and Flex (Flash-based UI technology) to develop "customer engagement applications" that provide end users with a dynamic and intuitive user experience that can be used inside or outside the firewall, in both online or offline environments. LiveCycle "ES" (Enterprise Suite) is the newest version of LiveCycle software and currently available in pre-release on the Adobe Developer website.) ES లైవ్ సైకల్
ఫోటోషాప్ (Photoshop) ఫోటోలు ఎడిటింగ్,గ్రాఫిక్ డిజ్యేన్ సోలుషన్స్ సాఫ్టువేరు ఫోటోషాప్ ఫ్యామిలీ క్రింద ఫోటోషాప్ ఆల్బం స్టార్టర్ ఎడిషన్ 3.2,లైట్ రూం,ఫోటోషాప్ ఎలిమెంట్,ఫోటోషాప్ సిఏస్3,ఫోటోషాప్ సిఎస్3 ఎక్స్ టెండేడ్ ఫోటోషాప్
ఫోటోషాప్ ఎలిమెంట్ (Element) cell cell
పేజ్ మేకర్ (Pagemaker) పుస్తకాలు,పత్రికలు అంటే పేజి లేఔట్ డిజ్యేన్ సాఫ్టువేరు (PageMaker was the first desktop publishing program, introduced in 1985 by Aldus Corporation[1], initially for the Apple Macintosh but soon after also for the PC. It relies on Adobe Systems' PostScript page description language. In 1994 Adobe Systems acquired Aldus and PageMaker. The current version is PageMaker 7.0, released July 9, 2001, though updates have been released for the two supported platforms since. PageMaker was awarded a SPA Excellence in Software Award for Best New Use of a Computer in 1986) 7 పేజ్ మేకర్
అడొబ్ ప్రీమియర్ ప్రొ (Premiere Pro) వీడియో ఎడిటింగ్ సాఫ్టువేరు cell ప్రీమియమ్
క్రియేటివ్ సూట్ 3 మాస్టర్ కల్లెక్షన్() వెబ్,గ్రాఫిక్ గ్రాఫిక్ దిజయినింగ్, ఫోటో,వీడియో ఎడిటింగ్ సాఫ్టువేరు cell క్రియేటివ్ సూట్ 3 మాస్టర్ కల్లెక్షన్

మూలాలు

మార్చు
  1. http://www.hoovers.com/adobe/--ID__12518--/free-co-factsheet.xhtml |తీసుకొన్న తేదీ:ఏప్రిల్ 11,2008
  2. http://www.eenaduandhra.com/telugu/index.php?option=com_content&task=view&id=2106&Itemid=86[permanent dead link] |తీసుకొన్న తేదీ:మార్చి 22,2008

ఇవి కూడా చూడండి

మార్చు