అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి (నాటకం)

అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి తెలుగు జానపద నాటకం. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) తయారుచేసిన ఈ నాటకానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయం రంగస్ధల కళలశాఖలో పి.హెచ్డి చేస్తున్న షేక్ జాన్ బషీర్ దర్శకత్వం వహించాడు. ఈ నాటకం చైనా జానపద కథ ఆధారంగా రూపొందింది. పాఠశాలలు, కళాశాలల్లో ఈ నాటకం దాదాపు 30 ప్రదర్శనలు ఇచ్చింది.[1][2]

అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి
అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి నాటికంలోని దృశ్యం
రచయితచంద్రశేఖర్ ఇండ్ల
దర్శకుడుషేక్ జాన్ బషీర్
ఒరిజినల్ భాషతెలుగు
విషయంజానపద నాటకం
కళా ప్రక్రియవినోదం, విజ్ఞానం
నిర్వహణథియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), రంగస్థల కళలశాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం

సంక్షిప్త కథ

మార్చు

ఇది ఒక తల్లీ బిడ్డల కథ. ఒక వికార రాక్షసుని కథ. తమ గ్రామం మీద దాడి చేసి ప్రజల వద్ద వున్న అందమైన వస్తువులన్నిటినీ బలవంతంగా దోచుకుపోయే ఒక వికార రాక్షసుడు. ఆ రాక్షసుని అకృత్యాలను మౌనంగా భరించడమే తప్ప ఎదురుతిరిగే సాహసం ఎవ్వరూ చేయలేరు. ఒక వేళ ఎవరన్నా చేస్తే వాళ్లు వికార రాక్షసునికి బలికావలసిందే. అలాంటి వికార రాక్షసుడిని ఎదిరించడానికి ఒక చిన్నారి సిద్ధపడుతుంది. అతన్ని వెతుక్కుంటూ కాకులు దూరని కారడవిలోకి ప్రయాణిస్తుంది. ఆ చిన్నారి రాక్షసుడిని ఎలా ఓడించిందన్నది మిగతా కథ.

నిర్మాణం

మార్చు

నాటకాల పట్ల అభిరుచి ఉన్న 124 మంది యువతని పరీక్షించి, అందులోంచి పదిమందిని వివిధ పాత్రలకు ఎంపిక చేశారు. వారికి రెండు నెలలు శిక్షణ ఇప్పించారు. శిక్షణ, ప్రదర్శనకాలంలో వారికి నెలకి రూ. 15 వేల గౌరవ వేతనం ఇచ్చారు.

నటీనటులు

మార్చు

తెలుగు నాటకరంగంలో ఆసక్తి కలిగిన యువకులకు ఈ నాటకంలో నటించడానికి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) లో శిక్షణ ఇచ్చారు. వారితో ఈ నాటకాన్ని ఎన్నో ప్రాంతాల్లో ప్రదర్శించారు.

  • సాయిలీల (చిన్నారి)
  • పద్మశ్రీ (చిన్నారి తల్లి)
  • పల్లవి (లంబు)
  • వికాస్ చైతన్య (జంబు)
  • ప్రవీణ్ కుమార్ గొలివాడ (ఆహార రాక్షసుడు)
  • సాయికిరణ్ (టీవీ రాక్షసుడు)
  • శ్రీనివాస్ రేణిగుంట్ల (సముద్ర రాక్షసుడు)
  • నిఖిల్ జాకబ్ తాటిపర్తి (సూత్రదారుడు)
  • పవన్ రమేష్ (సూత్రదారుడు)
  • సుధాకర్ తేళ్ళ (సూత్రదారుడు)

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం, లైటింగ్: షేక్ జాన్ బషీర్
  • దర్శకత్వ పర్యవేక్షణ: రాజీవ్ వెలిచేటి
  • రచన: చంద్రశేఖర్ ఇండ్ల
  • సంగీతం: ఎజిల్ మతి
  • నృత్యం: గిరీష్ చంద్ర
  • కాస్ట్యూమ్స, ప్రాపర్టీస్: ఈసునాథ్ రాథోడ్.

ఇతరులు

మార్చు

ఈ నాటకానికి ఆచార్య అనంతకృష్ణన్ (డీన్, యస్.యన్. స్కూల్), డా. ఎన్.జె. బిక్షు (హెడ్, థియేటర్ ఆర్ట్స్), రాజీవ్ వెలిచేటి (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), డా. పెద్ది రామారావు (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), నౌషాద్ (ప్రొఫెసర్, థియేటర్ ఆర్ట్స్), బిజు శ్రీథరన్, శివ ప్రసాద్, రాంమోహన్ తదితరులు నటీనటులకు శిక్షణ ఇచ్చారు. నాటక ప్రదర్శన నిర్వాహణ బాధ్యతను ఎస్.ఎం. బాషా (ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్) స్వీకరించగా, ప్రణయ్‌రాజ్ వంగరి (ప్రాజెక్ట్ అసిస్టెంట్) సహకారం అందించాడు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. The Hindu, Friday Review (26 July 2013). "Brave ACT". The Hindu (in Indian English). Archived from the original on 11 December 2013. Retrieved 9 September 2020.
  2. The Hindu, Friday Review (26 July 2013). "New dawn for theatre". The Hindu (in Indian English). Neeraja Murthy. Archived from the original on 4 November 2013. Retrieved 10 September 2020.