ఎన్.జె. భిక్షు

(ఎన్.జె. బిక్షు నుండి దారిమార్పు చెందింది)

ఎన్.జె. భిక్షు రంగస్థల, టీవీ, నటుడు, దర్శకుడు, సినిమా నటుడు, రంగస్థల అధ్యాపకుడు. హైదరాబాదు విశ్వవిద్యాలయములోని రంగస్థల కళలశాఖలో ప్రొఫెసర్ గా పనిచేసిన బిక్షు, సినీరంగంలోని యువ నటీనటులకు నటనలో శిక్షణ ఇస్తున్నాడు.[1]

ఎన్.జె. భిక్షు
జననంఏప్రిల్ 26, 1957
తెనాలి, గుంటూరు జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
వృత్తిరంగస్థల అధ్యాపకుడు
ప్రసిద్ధిరంగస్థల, టివీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు
భార్య / భర్తఅరుణా భిక్షు
పిల్లలుమహతి భిక్షు

జననం - వివాహం మార్చు

భిక్షు 1957, ఏప్రిల్ 26న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాడు. నృత్యకారిణి అరుణతో భిక్షు వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (మహతి భిక్షు).

రంగస్థల ప్రస్థానం మార్చు

చిన్నప్పటి నుండి నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్న భిక్షు, 1981లో తెనాలి నుండి హైదరాబాదుకి వచ్చాడు. ఎ.ఆర్.కృష్ణ, దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల, చాట్ల శ్రీరాములు, కేవీ గోపాలస్వామి నాయుడు, నటరాజ రామకృష్ణ వంటివారు బోధిస్తున్న ఏపి థియేటర్ రిపర్టరీ ఇన్సిట్యూట్లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నాడు.[2] అటుతరువాత మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. అనేక నాటక శిక్షణ శిబిరాలు నిర్వహించి ఔత్సాహిక కళాకారులకు నటనలో శిక్షణ ఇచ్చాడు.

కొద్దికాలం తరువాత హైదరాబాదు విశ్వవిద్యాలయంలో శిక్షకుడిగా చేరమని ఆహ్వానం వచ్చినా, విద్యార్థిగా చేరాడు. అటుతరువాత అదే విశ్వవిద్యాలయం 1991నుండి పాఠాలు బోధించి 2021 ఆగస్టు 2న పదవీ విరమణ చేశాడు. అనేక నాటకోత్సవాలకు న్యాయనిర్ణేతగా కూడా ఉన్నాడు.

దర్శకత్వం చేసినవి: ఒక ఒరలో నాలుగు నిజాలు (రషోమన్ సినిమాకు నాటక రూపం), దేవుడ్ని చూసినవాడు (తిలక్ కథకు నాటక రూపం), అమరావతి కథలు, కన్యాశుల్కం, దంతవేదాంతం, ఎలక్ట్రా (గ్రీకు నాటకం)

సినీరంగ ప్రస్థానం మార్చు

కళ్ళు సినిమాలో నటించాడు.[3] 1987లో పూణే ఫిల్మ్ ఇన్సిట్యూట్లో రెండు నెలల అప్రిషియేషన్ కోర్సు చేశాడు. మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్ నుండి బయటికి వచ్చిన తరువాత పరిచయం ఉన్నవారికి నటనలో శిక్షణ ఇచ్చేవాడు. భిక్షు శిక్షన ఇచ్చిన వారిలో వేణు, జూ. ఎన్టీయార్, నితిన్, నిఖిల్ సిద్ధార్థ్, రామ్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా, దీక్షా సేథ్, సుహాసిని, పార్వతీ మెల్టన్, బెల్లకొండ శ్రీను, నాగ శౌర్య, స్వాతి (రామాయణంలో రావణుడి పాత్రధారిణి), తేజ (చూడాలని వుంది), అతులిత్ (తులసి) వంటి నటీనటులు కూడా ఉన్నారు.[1]

నటించిన సినిమాలు: కళ్ళు, మనీ, పాపే నా ప్రాణం (2000), మాస్, చంటిగాడు (2003)

పుస్తకాలు మార్చు

  1. సెమియోటిక్స్ ఆఫ్ ఒగ్గుకథ (పరిశోధన గ్రంథం)[4]

పురస్కారాలు మార్చు

  1. ఉత్తమ దర్శకుడు - నంది నాటక పరిషత్తు, ఒక ఒరలో నాలుగు నిజాలు (నాటిక, 1998)[5]
  2. రసమయి రంగస్థల పురస్కారం (2017)[6][7]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
  2. Deccan Chronicle (7 March 2017). "A lifetime of theatre". Nikhita Gowra. Retrieved 26 April 2019.
  3. విజయక్రాంతి, సినిమాలు (10 August 2018). "30 ఏళ్లుగా మరవలేని 'కళ్లు'". Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
  4. The Hans India, Hyderabad (8 August 2017). "Propagating the culture of Oggu Katha". Retrieved 26 April 2019.
  5. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.696.
  6. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ఘనంగా రంగస్థల పురస్కారాల ప్రదానం". Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.
  7. The Hans India, Hyderabad (3 March 2017). "Rangasthala Puraskaram for NJ Bhikshu". Retrieved 26 April 2019.