ఆదిలాబాద్ పట్టణ మండలం
అదిలాబాదు పట్టణ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] ఆదిలాబాద్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం, పూర్వపు "ఆదిలాబాద్ మండలం"లో భాగంగా ఇదే జిల్లాలో ఉండేది.[2] పునర్వ్యవస్థీకరణలో ఆదిలాబాదు మండలాన్ని విడదీసి, 3 గ్రామాలతో ఆదిలాబాద్ పట్టణ మండలాన్ని, 38 గ్రామాలతో ఆదిలాబాద్ గ్రామీణ మండలాన్ని, 4 గ్రామాలతో మావల మండలాన్నీ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో మొత్తం 3 గ్రామాలు ఉన్నాయి.
అదిలాబాద్ పట్టణ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ పట్టణ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°39′57″N 78°32′01″E / 19.665867°N 78.533649°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | అదిలాబాద్ |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,17,167 |
- పురుషులు | 59,448 |
- స్త్రీలు | 57,719 |
పిన్‌కోడ్ | 504001 |
గణాంక వివరాలు
మార్చుమండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,98,338 - పురుషులు 1,00,054 - స్త్రీలు 98,284:పిన్ కోడ్ నం. 504001. పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 19 చ.కి.మీ. కాగా, జనాభా 117,167. జనాభాలో పురుషులు 59,448 కాగా, స్త్రీల సంఖ్య 57,719. మండలంలో 25,840 గృహాలున్నాయి.
ప్రముఖులు
మార్చు- చైతన్ సంఘి (ఐ.ఏ.ఎస్.అధికారి)
- పుష్ప అగర్వాల్ (ఐ.ఏ.ఎస్.అధికారి)
వ్యవసాయం, పంటలు
మార్చుఆదిలాబాదు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16036 హెక్టార్లు, రబీలో 390 హెక్టార్లు.
ప్రధాన పంటలు
మార్చుమండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మండలంలోని పట్టణాలు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 89