అనంతపంతుల రామలింగస్వామి

అనంతపంతుల రామలింగస్వామి (ఆగష్టు 1, 1890 - 1977) ప్రముఖ తెలుగు కవి. ఇతడు భావకవిత్వం మీద వ్యంగ్య రచనలు చేశాడు.

ఈయన 1890, ఆగష్టు 1 తేదీన విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో లక్ష్మీదేవి, వెంకట సోమేశ్వరరావు దంపతులకు జన్మించాడు. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషలలో ఈయన ప్రవీణుడు. ఈయన కొంతకాలం ప్రభుత్వ పరిశ్రమల శాఖలో సూపరెంటెండెంటుగా ఉద్యొగ బాధ్యతలు నిర్వహించాడు. వీరికి సాంప్రదాయ కవిత్వం, ప్రబంధాల గురించిన ఇతివృత్తాలు, దేశభక్తిని బోధించే రచనలు అంటే చాలా ప్రీతి.

1910-20 మధ్యకాలంలో భావకవిత్వం పరుగులు పెడుతున్న కాలంలో రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖులు చాలా రచనలు చేశారు. వానిలో దేవులపల్లి వారి కృష్ణ పక్షం ఒక ముఖ్యమైన కవితా సంపుటి. దీనిపై అనంతపంతుల ఎక్కుపెట్టిన గ్రంథాస్త్రమే శుక్లపక్షం (1932). దీనిపై విశ్వనాథ నరసింహం విమర్శ కూడా రాశారు.

1920 నుండి 1937 వరకు ఆంధ్రపత్రిక, శారద, భారతి పత్రికలలో పాతికపైగా ఈయన రచనలు ప్రచురితమయ్యాయి.

మరణం మార్చు

ఈయన 1977లో పరమపదించాడు.

రచనలు మార్చు

 • శుక్ల పక్షం
 • శుక్ర చాపం (గేయసంపుటి)
 • అనుతాపం
 • వివేకోపాసన
 • భువన విజయం
 • వికటవాణి
 • కథాయుగం
 • కవితాంజలి
 • హిత సంహిత
 • భార్గవ రామాయణం
 • ప్రేమలత
 • ధాత్రి
 • భక్తబృందావనము
 • శ్రీకృష్ణకవి చరిత్రము

మూలాలు మార్చు

 • రామలింగస్వామి, అనంతపంతుల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 546.