అనుపమ్ ఖేర్
అనుపమ్ ఖేర్ ఒక భారతీయ నటుడు. 2016 లో భారత ప్రభుత్వము ఇతడికి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది.
అనుపమ్ ఖేర్ | |
---|---|
హిందీ: अनुपम खेर | |
![]() 2013 లో అనుపమ్ ఖేర్ | |
జననం | |
జాతీయత | భారతీయడు |
వృత్తి | నటుడు, నిర్మాత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | |
బంధువులు | రాజు ఖేర్ (తమ్ముడు) |
నేపథ్యంసవరించు
సిమ్లాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనుపమ్ ఖేర్, పద్మభూషణ్ పురస్కారాన్ని సాధించే స్థాయికి ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకం. రంగస్థల నటుడిగా మొదలై వెండితెరకు చేరిన ఆయన ప్రయాణంలో హాస్యనటుడు, సహాయ నటుడు, ప్రతినాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటశిక్షకుడు ఇలా భిన్న పాత్రల్ని సమర్థవంతంగా పోషించాడు.
అనుపమ్ ఖేర్ కళాశాల విద్యార్థిగానే హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో విరివిగా నాటకాల్లో నటించాడు. నటనను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరాడు. అనంతర కాలంలో అదే సంస్థకు అధ్యక్షుడి హోదాలో సేవలందించడం విశేషం. సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చిన తొలిరోజుల్లో ఎన్నో రాత్రులు రైల్వే స్టేషన్‌లోనే నిద్రించిన సందర్భాలు ఉన్నాయి. ఆగమన్ లో తొలి అవకాశాన్ని అందుకుని రెండో చిత్రం సారంశ్ తోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు.
హిందీ, మరాఠీ, పంజాబీ, మలయాళ, తమిళ చిత్రాల్లోనూ నటించాడు. హాలీవుడ్‌లో బెండ్ ఇట్ లైక్ బెక్‌హామ్, బ్రైడ్ అండ్ ప్రిజ్యూడిస్ చిత్రాల్లో నటించాడు. ఓమ్ జై జగదీశ్ తో దర్శకుడిగా మారాడు. మైనే గాంధీ కో నహీ మారా , డాడీ చిత్రాలకుగాను జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఫిలింఫేర్ పురస్కారాల్లో 14 నామినేషన్లు అందుకుని 8 సార్లు పురస్కారాలు గెలుచుకున్నాడు. [1]
నటించిన చిత్రాలుసవరించు
నాటకాలుసవరించు
మేరా వో మత్‌లబ్ నహీ థా , కుఛ్ భీ హో సక్తా లాంటి నాటకాలను మనదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రదర్శించాడు. కుఛ్ భీ హో సక్తా నాటకాన్ని తన జీవితం ఆధారంగా ఆయనే రచించాడు. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. యాక్టర్ ప్రిపేర్స్ పేరుతో నటశిక్షణాలయాన్ని నెలకొల్పి ఔత్సాహిక నటులకు శిక్షణ ఇస్తున్నాడు.
మూలాలుసవరించు
- ↑ "అనుపమాన ప్రతిభాశాలి". ఈనాడు. 2016-01-26. Archived from the original on 2016-01-25. Retrieved 2016-01-26.