అనుమానాస్పదం
అనుమానాస్పదం 2007 లో వంశీ దర్శకత్వంలో విడుదలైన ఒక ఉత్కంఠభరిత చలనచిత్రం. ఇందులో ఆర్యన్ రాజేష్, హంసా నందిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.[1]
అనుమానాస్పదం | |
---|---|
![]() | |
దర్శకత్వం | వంశీ |
రచన | ఆకెళ్ళ వంశీకృష్ణ (సంభాషణలు), వేటూరి సుందరరామ్మూర్తి (పాటలు) |
నిర్మాత | సతీష్ తాటి, జై ఆర్నాల |
తారాగణం | ఆర్యన్ రాజేష్, హంసా నందిని, వనితా రెడ్డి, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, సుభాష్, మూలవిరాట్, దేవీచరణ్, బి. వి. చంద్రశేఖర్ |
ఛాయాగ్రహణం | పీ.జి. విందా |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | ఫిబ్రవరి 9, 2007 |
భాష | తెలుగు |
కథాగమనం సవరించు
విఠల్ దాసు అనే వ్యక్తికి నిత్యమంగళం అడవుల్లో వీరప్పన్ దాచిన నిధి గురించి తెలుస్తుంది. అతడు కొంతమందికి డబ్బు ఇచ్చి ఆ నిధిని వెతికేందుకు పంపిస్తాడు. వారిలో బాసు అనబడే బావరాజు సూర్యనారాయణ (ఆర్యన్ రాజేష్), ఒక లేడీ డాక్టర్ (హంసానందిని), ఒక మాజీ ఫారెస్టు ఆఫీసర్ తంగవేలు (జయప్రకాష్ రెడ్డి), బాంబులు డిటెక్ట్ చేసే వ్యక్తి, బాంబులను నిర్వీర్యం చేసేందుకు కామిని అనే ఆమె, వేస్ట్ అని పిలువబడే వంటవాడు, రాబర్ట్ అనే వ్యక్తి, రాజు అనే డ్రైవర్ ఉంటారు. వీళ్ళంతా నిత్యమంగళం అడవికి చేరే దారిలో వీరప్పన్లా మీసాలు పెంచిన వ్యక్తి లిఫ్ట్ అడుగుతాడు. ప్రయాణంలో వీరప్పన్ చావలేదనీ బ్రతికే ఉన్నాడనీ అతడు వీళ్ళకు చెపుతాడు. ఎలాగోలా తిప్పలు పడి మొత్తానికి నిధిని సాధించి వెనుకకు బయలుదేరుతారు. తిరుగు ప్రయాణంలో ఒక్కొక్కరుగా అందరూ చనిపోతుంటారు. వీరప్పనే అందరినీ చంపుతున్నాడని అనుకుంటుంటారు. చివరకు బాసు, లేడీ డాక్టర్, కామిని మిగులుతారు. తమ వాళ్ళను చంపిన వ్యక్తి బాసుకు దొరుకుతాడు వాళ్ళిద్దరూ కొట్టుకొనే సమయంలో కామిని వాడిని చంపేస్తుంది. హంతకుడిని చంపేసాని ఆనందపడుతుంటే కామినిని చంపేస్తారెవరో. తరువాత బాసును డాక్టరును చంపేందుకు వచ్చిన వాడిని పట్టుకొంటాడు బాసు. అప్పుడే తెలుస్తుంది వాడు వాళ్ళ గ్రూపులో మొదటగా హతమైన రాబర్ట్ అని. కామినిని ప్రేమించి అందరినీ చంపి డబ్బుతో పారిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. వాడిని చంపి డాక్టరుతో బాసు వెనుకకు వచ్చేస్తాడు.
పాటలు సవరించు
- కుయ్ లాలో కుయ్ లాలో చిలక చిలక (రచన : వేటురి; గానం : శ్రేయా గోషాల్)
- నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు (రచన : వేటూరి; గానం :శ్రేయా గోషాల్, విజయ్ జేసుదాసు)
- ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా (రచన : వంశీ; గానం : ఉన్నికృష్ణన్, శ్రేయా గోషాల్)
- మల్లెల్లో ఇల్లేసే చందమామ వెన్నెల్లు చల్లేసే చందమామ (రచన : వేటూరి; గానం : హరిహరన్, సాధనా సర్గమ్)
- రా రా రా గుమ్మా రా తుళ్ళే కొమ్మ (రచన : వేటురి; గానం : సోనూ నిగమ్, ఇళయరాజా)
- రేలా రేలా రేలా రెక్కి రెక్కి రేలా (రచన : వేటూరి; గానం : టిప్పు, భవతరంగిణి)
విశేషాలు సవరించు
ఈ సినిమా ఆర్థికంగా పెద్ద విజయం సాధించలేక పోయింది. బాక్సాఫీసు వద్ద సగటు చిత్రంగా నిలిచింది.[1]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 "Anumanaspadam is a decent fare though the first half is a big letdown and boorish". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-05. Retrieved 2021-12-20.