హంసా నందిని
హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్, డ్యాన్సర్.
హంసా నందిని | |
---|---|
![]() హంసా నందిని | |
జననం | పూనం బర్టాకే పూణే, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది.
వ్యక్తిగత జీవితం మార్చు
హంసా నందిని పూనేలో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.
2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.
2021 లో తాను రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డట్లు తెలిపింది. ఇందుకోసం ఈమె శస్త్రచికిత్స చేయించుకుంది. జన్యుపరంగా ఆ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉండటంతో ఇంకా మరిన్ని శస్త్రచికిత్సలు, కీమోథెరపీ చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపింది. ఈమె తల్లి కూడా 2003 లో క్యాన్సర్ వ్యాధితోనే మరణించింది.[1]
క్యాన్సర్ ని జయించిన హంసా నందిని తిరిగి సెట్ లో 2022 డిసెంబరు 7న అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె సినిమాలపై దృష్టి పెట్టింది.[2]
చిత్ర సమహారం మార్చు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2004 | ఒకటవుదాం | తెలుగు | ||
2005 | 786 (ఖైదీ ప్రమకథ) | రోషిణి | తెలుగు | పూనం బర్టాకే |
2006 | మోహిని 9886788888 | మోహిని | కన్నడ | |
2006 | కార్పొరేట్ | హిందీ | పూనం బర్టాకే | |
2007 | అనుమానాస్పదం | దేవిక | తెలుగు | |
2008 | గీత | హంసా | తెలుగు | |
2009 | అధినేత | హంసా | తెలుగు | |
2009 | ప్రవరాఖ్యుడు | తెలుగు | ||
2011 | అహా నా పెళ్లంటా | తెలుగు | ||
2012 | నా ఇష్టం | తెలుగు | అతిథి పాత్ర | |
2012 | ఈగ | కళ | తెలుగు | అతిథి పాత్ర |
2012 | నాన్-ఇ | తమిళ | ||
2013 | మిర్చి | తెలుగు | టైటిల్ సాంగ్ | |
2013 | భాయ్[3] | తెలుగు | అతిథి పాత్ర | |
2013 | రామయ్యా వస్తావయ్యా | తెలుగు | అతిథి పాత్ర | |
2013 | అత్తారింటికి దారేది | తెలుగు | ప్రత్యేక గీతం | |
2014 | లెజెండ్ | తెలుగు | ప్రత్యేక గీతం | |
2014 | లౌక్యం[4] | హంస సిప్పీ | తెలుగు | |
2014 | రియల్ స్టార్ | తెలుగు | ||
2015 | రుద్రమదేవి[5] | మదనిక | తెలుగు | |
2015 | సోగ్గాడే చిన్నినయనా | తెలుగు | ||
2015 | బెంగాల్ టైగర్ | తెలుగు | అతిథి పాత్ర | |
2016 | శ్రీరస్తు శుభమస్తు[6] | తెలుగు | అతిథి పాత్ర |
మూలాలు మార్చు
- ↑ "Hamsa Nandini: సినీనటి హంసానందినికి క్యాన్సర్ - telugu news actress hamsa nandini fights with cancer diagnosis". www.eenadu.net. Retrieved 2021-12-20.
- ↑ "Hamsa nandini: ఇది నాకు పునర్జన్మ! | Hamsanandini is back avm". web.archive.org. 2022-12-08. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 123తెలుగు.కాం, సినిమా వార్తలు. "ఐటెం సాంగ్స్ చేయడం ఆషామాషీ కాదు – హంసా నందిని". www.123telugu.com. Retrieved 21 September 2016.
- ↑ 123తెలుగు.కాం, సినిమా వార్తలు. "గోపీచంద్ మూవీలో హంసా నందిని స్పెషల్ సాంగ్". www.123telugu.com. Retrieved 21 September 2016.
- ↑ స్పైస్ ఆంధ్రా, టీ2బీ. "మదనికగా హంసా నందిని". spiceandhra.com. Retrieved 21 September 2016.[permanent dead link]
- ↑ ఆంధ్రావిల్లాస్, సినిమా వార్తలు. "అల్లు శిరీష్ మూవీ స్పెషల్ సాంగ్ లో హంసా నందిని". www.andhravilas.net. Retrieved 21 September 2016.