అన్నదమ్ముల కథ

1975లో విడుదలైన తెలుగు సినిమా

అన్నదమ్ముల కథ 1975 జూన్ 19వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.

అన్నదమ్ముల కథ
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.ఎస్.ప్రకాశరావు
తారాగణం బాలయ్య,
ప్రభ,
సత్యేంద్ర కుమార్,
రోజారమణి
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ అమృతా ఫిలిమ్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం సవరించు

నటీనటులు సవరించు

సంక్షిప్త చిత్రకథ సవరించు

సత్యం, రమణ అన్నదమ్ములు. సత్యం నిజాయితీగా, న్యాయంగా బ్రతికే ఇంజనీరు. పేదవాళ్లయిన తమకు అండగా నిలిచిన మేనమామ కూతురును పెళ్ళి చేసుకున్నాడు. రమణ స్వభావం అన్న స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఏ విధంగానైనా డబ్బు సంపాదించడం అతని ధ్యేయం. ఒక అవినీతిపరుడైన కాంట్రాక్టరు వద్ద చేరి, కేవలం డబ్బు కోసమే అతని అవిటి కూతురును పెళ్ళాడి, అక్రమ పద్ధతులలో అతని కంపెనీకి మేనేజర్ అవుతాడు. మారుతల్లి కూతురైన చెల్లెలి కోసం అన్న పాటు పడితే, ఆమె స్వంత అన్న అయిన రమణ ఆమె కష్టాలకు కారకుడౌతాడు. అన్నపై అవినీతి ఆరోపణలు మోపి అన్నను, తల్లిని, మేనమామను కడగండ్ల పాలు చేస్తాడు. ఇలా ధర్మాధర్మాలకు ప్రతీకలైన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటంలో ఒక కుటుంబం కష్టాల పాలవుతుంది. చివరకు ధర్మం గెలుస్తుంది. నీతి జయిస్తుంది. అవినీతి అనర్థాలకు హేతువని రుజువవుతుంది[1][2]

పాటలు సవరించు

  1. మంచితనమే ఓడిపోయేనా మానవత్వము మాసిపోయేనా[3] - జేసుదాస్ - రచన:శ్రీశ్రీ

మూలాలు సవరించు

  1. రెంటాల (22 June 1975). "రూపవాణి - అన్నదమ్ముల కథ చిత్ర సమీక్ష" (PDF). ఆంధ్రపభ దినపత్రిక. Archived (PDF) from the original on 5 సెప్టెంబరు 2022. Retrieved 14 August 2019.
  2. వెంకట్రావ్ (22 June 1975). "చిత్రసమీక్ష అన్నదమ్ముల కథ" (PDF). ఆంధ్ర పత్రిక దినపత్రిక. Archived (PDF) from the original on 5 సెప్టెంబరు 2022. Retrieved 14 August 2019.
  3. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.