అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ

వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన పట్టణ ప్రణాళిక సంస్థ.

ది అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎయుడిఎ), ఇది భారతదేశం వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన పట్టణ ప్రణాళిక సంస్థ. ఇది ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం - 2016 కింద 2019 జనవరి 1న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం కడప నగరంలో ఉంది.[1]

అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
అన్నమయ్య నగర అభివృద్ధి సంస్థ
సంస్థ వివరాలు
స్థాపన 2019 జనవరి 1
అధికార పరిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం కడప, ఆంధ్రప్రదేశ్

అధికారపరిధి

మార్చు

అయుడా కింద చట్టబద్దమైన ప్రాంతం 12,780.26 కి.మీ2 (4,934.49 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఇది మొత్తం 18.39 లక్షలమంది జనాభాను కలిగి ఉంది.[2] ఇందులో 41 మండలాలు, 520 గ్రామాలు దీని పరిధికిందకు వచ్చాయి. అవే కాకుండా కడప జిల్లా లోని ఈ పట్టణ ప్రాంతాలు ఉన్నాయి.[3]

అధికారపరిధి
ప్రాంతం లేదా సంస్థ వివరం పేరు మొత్తం
నగరపాలక సంస్థలు కడప నగరపాలక సంస్థ 1
పురపాలక సంఘాలు రాజంపేట, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, 6
నగర పంచాయతీలు కమలాపురం ,జమ్మలమడుగు, ఎర్రగుంట్ల 3

మూలాలు

మార్చు
  1. Staff Reporter (2 January 2019). "Three new urban development authorities" [మరో మూడు నగరాభివృద్ధి సంస్థలు]. Eenadu (in Telugu). Archived from the original on 3 January 2019. Retrieved 2 January 2019.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Staff Reporter (2 January 2019). "అన్నమయ్య దిశా.. కడపకు కొత్త దశ". Eenadu (in Telugu). Archived from the original on 3 జనవరి 2019. Retrieved 2 January 2019.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. "Andhra Pradesh Metropolitan Region and Urban Development Authorities Act, 2016". Archived from the original on 27 నవంబరు 2021. Retrieved 27 November 2021.