అన్నాబత్తుని శివకుమార్

అన్నాబత్తుని శివకుమార్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

అన్నాబత్తుని శివకుమార్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 ఆగష్టు 1968
తెనాలి, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు అన్నాబత్తుని సత్యనారాయణ
జీవిత భాగస్వామి పుష్ప
సంతానం సత్యనారాయణ, అఖిల్ గణేష్

జననం, విద్యాభాస్యం మార్చు

అన్నాబత్తుని శివకుమార్ 14 ఆగష్టు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో అన్నాబత్తుని సత్యనారాయణ దంపతులకు జన్మించాడు. ఆయన 1991లో ఎ.ఎస్.ఎన్ డిగ్రీ కాలేజీ నుండి బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

అన్నాబత్తుని శివకుమార్ రాజకీయాల్లోకి రాకముందు ఎ.ఎస్.ఎన్ గ్రూప్ విద్యాసంస్థలను నిర్వహించాడు. ఆయన తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి తెనాలి నుండి టీడీపీ పార్టీ టికెట్ ఆశించిన దక్కలేదు. ఆయన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ పై 19065 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. శివకుమార్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ పై 17649 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.