నాదెండ్ల మనోహర్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నాదెండ్ల మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరుగా పనిచేశారు, ఇతను జనసేన పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను తెనాలి శాసనసభా నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 2018లో జనసేన పార్టీలో చేరాడు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
నాదెండ్ల మనోహర్ | |||
![]() ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ | |||
నియోజకవర్గం | తెనాలి శాసనసభా నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జనసేన | ||
జీవిత భాగస్వామి | డాక్టర్.నాదెండ్ల మనోహరం | ||
మతం | హిందూ |
విద్యసవరించు
నాదెండ్ల మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు.
బయో ప్రొఫైల్సవరించు
మనోహర్ జూన్ 2011లో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇతను 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు జిల్లా తెనాలి శాసనసభా నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. తను స్పీకర్‌గా ఎన్నిక కాక ముందు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇతను వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో NSUI, యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టిసారించాడు.
అభిరుచులుసవరించు
మనోహర్ జాతీయస్థాయి టెన్నిస్ ఆటగాడు. ఇతను దేశ విదేశాలలో అనేక పోటీలలో పాల్గొన్నాడు. ఇతను 1986 నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు.